confidence motion
-
ఏడాదిన్నరలో నాలుగోసారి..
కాఠ్మండు: నేపాల్ ప్రధానమంత్రి పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’సోమవారం పార్లమెంట్లో విశ్వాస తీర్మానం నెగ్గారు. పార్లమెంట్లో ప్రచండ సారథ్యంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్ సెంటర్) మూడో అతిపెద్ద పారీ్టగా ఉంది. సోమవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో 275 మంది సభ్యులకుగాను హాజరైన 158 మందిలో ప్రచండ ప్రభుత్వానికి అనుకూలంగా 157 మంది ఓటేశారు. ప్రచండ సభ విశ్వాసం పొందినట్లు పార్లమెంట్ స్పీకర్ ప్రకటించారు. ప్రచండ 2022లో ప్రధాని పగ్గాలు చేపట్టాక గత 18 నెలల్లో పార్లమెంట్ విశ్వాసం పొందడం ఇది నాలుగోసారి. -
నేడు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ
-
కేజ్రీవాల్ సర్కారు విశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ సర్కారుపై శుక్రవారం శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణంలో ప్రశ్నించేందుకు ఈడీ ఎన్నిసార్లు సమన్లు జారీచేసినా గైర్హాజరవడంతో శనివారం తమ ముందు హాజరుకావాలని సిటీ కోర్టు కేజ్రీవాల్‌ను ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ చర్యకు దిగడం గమనార్హం. విశ్వాస తీర్మానంపై శనివారం సభలో చర్చించనున్నారు. 70 మంది సభ్యుల అసెంబ్లీలో కేజ్రీవాల్ బలపరీక్షకు సిద్ధపడటం ఇది రెండోసారి. ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీ బలం రెండుకు పడిపోయింది. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారన్న కారణంతో గురువారం ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తానికీ సస్పెండ్ చేయడమే ఇందుకు కారణం. శుక్రవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కేజ్రీవాల్ మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారన్నారు. కానీ వారెక్కడ జారిపోతారోననే భయంతోనే ఆయన బలపరీక్షకు దిగారని బీజేపీ ఎద్దేవా చేసింది. -
Delhi Assembly: విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్
సాక్షి,ఢిల్లీ: సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం సభ వాయిదా పడింది. శనివారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. తన పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజా నోటీసుల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ జరపడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈడీ వరుసగా పంపిన సమన్లను కేజ్రీవాల్ తిరస్కరించడంతో కోర్టు ద్వారా తాజాగా ఈడీ ఆయనకు సమన్లు పంపిన విషయం తెలిసిందే. దీంతో 19న ఈడీ ముందు విచారణకు కేజ్రీవాల్ హాజరవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. ఇదీ చదవండి.. కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు షాక్ -
బండ్లగూడ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం.?
బండ్లగూడ: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ మేయర్ బుర్ర మహేందర్‌గౌడ్‌పై అవిశ్వాస తీర్మానం కోసం ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. అవిశ్వాసానికి పట్టుపడుతున్న వారిలో బీఆర్ఎస్కు చెందిన కార్పొరేటర్లు 13 మందితో పాటు ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఒక బీజేపీ కార్పొరేటర్ ఉన్నారు. వీరందరూ శుక్రవారం డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంకను కలిసి ఫిర్యాదు చేశారు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉండగా అందులో 16 మంది అవిశ్వాస తీర్మానం కోరుకుంటున్నారు. అధిక శాతం సభ్యులు మేయర్ పాలన నచ్చడం లేదని నిర్మొహమాటంగా స్పష్టం చేస్తున్నారు. గతంలోనూ పలుమార్లు కార్పొరేటర్లు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పడంతో అప్పట్లో వివాదం సర్దుమణిగింది. అవిశ్వాస తీర్మానం కోరుకుంటుంది వీరే.. బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్‌గౌడ్‌పై ఫిర్యాదు చేసిన వారిలో డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు తలారీ చంద్రశేఖర్, మాలతీనాగరాజు, సంతోషిరాజిరెడ్డి, లతాప్రేమ్‌గౌడ్, శ్రావంతినరేందర్, అనితవెంకటేష్, అస్లాంబిన్ అబ్దుల్లా, శ్రీనాథ్‌రెడ్డి, భూపాల్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, నిఖిలసంగారెడ్డి, ఆసియాఖాజా, ముద్దం రాము, ప్రశాంత్‌నాయక్, పుష్పమ్మ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. -
ఏమిటీ తీర్మానం...?
ఒక్కోసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ మే లోక్‌సభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రవేశపెట్టేదే విశ్వాస తీర్మానం. ఇలా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మూడు ప్రభుత్వా లు బలం నిరూపించుకోలేక పడిపోయాయి... పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా అది ప్రత్యక్షంగా ఎన్నికయ్యే చట్టసభలో (భారత్‌లో అయితే లోక్‌సభ) మెజారిటీ ఉన్నంత కాలమే మనుగడ సాగించగలదు. కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు ఉమ్మడిగా బాధ్యత వహిస్తుందని రాజ్యాంగంలో 75(3) ఆర్టీకల్ నిర్దేశిస్తోంది. ఏమిటీ అవిశ్వాస తీర్మానం? ► ప్రభుత్వం, అంటే మంత్రిమండలి లోక్‌సభ విశ్వాసం కోల్పోయిందని, మరోలా చెప్పాలంటే మెజారిటీ కోల్పోయిందని భావించినప్పుడు బలం నిరూపించుకోవాలని ఎవరైనా డిమాండ్ చేసేందుకు అవకాశముంది. ► సాధారణంగా విపక్షాలే ఈ పని చేస్తుంటాయి. ఇందుకోసం అవి లోక్‌సభలో ప్రవేశపెట్టే తీర్మానమే అవిశ్వాస తీర్మానం. ► అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టే వీలుంది. ► లోక్‌సభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్లోని 198వ నిబంధన మేరకు దీన్ని ప్రవేశపెడతారు. ► కనీసం 50 మంది సహచర ఎంపీల మద్దతు కూడగట్టగలిగిన ఏ లోక్‌సభ సభ్యుడైనా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. ► అనంతరం తీర్మానంపై చర్చ, అధికార–విపక్షాల మధ్య సంవాదం జరుగుతాయి. ప్రభుత్వ లోపాలు, తప్పిదాలు తదితరాలను విపక్షాలు ఎత్తిచూపుతాయి. వాటిని ఖండిస్తూ అధికార పక్షం తమ వాదన విని్పస్తుంది. ► చర్చ అనంతరం అంతిమంగా తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. ► లోక్‌సభకు హాజరైన ఎంపీల్లో మెజారిటీ, అంటే సగం మంది కంటే ఎక్కువ తీర్మానానికి మద్దతుగా ఓటేస్తే అది నెగ్గినట్టు. అంటే ప్రభుత్వం సభ విశ్వాసం కోల్పోయినట్టు. అప్పుడు మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం పడిపోతుంది. ప్రభుత్వమే పరీక్షకు నిలిస్తే.. విశ్వాస తీర్మానం ► అలాగే 1997లో హెచ్డీ దేవెగౌడ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచి్చన 10 నెలలకే బలపరీక్షకు వెళ్లింది. కేవలం 158 మంది ఎంపీలే దానికి మద్దతిచ్చారు. 292 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో ప్రభుత్వం కుప్పకూలింది. ► ఇక 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం చివరి క్షణంలో అన్నాడీఎంకే ప్లేటు ఫిరాయించి వ్యతిరేకంగా ఓటేయడంతో అనూహ్యంగా ఓడి ప్రభుత్వం పడిపోయింది. ► 1990లో రామమందిర అంశంపై బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో లోక్‌సభలో బలం నిరూపించుకునేందుకు వీపీ సింగ్ ప్రభుత్వం విశ్వాస తీర్మానం పెట్టింది. తీర్మానానికి అనుకూలంగా కేవలం 142 ఓట్లు రాగా వ్యతిరేకంగా ఏకంగా 346 ఓట్లు రావడంతో ప్రభుత్వం పడిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న ఇండియా కూటమి
-
2025 కాదు 2050లో కూడా బీజేపీ గెలవదు.. కేజ్రీవాల్ జోస్యం..
న్యూఢిల్లీ: బీజేపీపై ధ్వజమెత్తారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీలో బుధవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలం నిరూపించుకున్న అనంతరం ఆయన కమలం పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానానికి 14 సీట్లు అవసరం కాగా.. బీజేపీకి 8 మంది సభ్యులే ఉన్నారని, అయినా ఆప్ ఎమ్మెల్యేలను బెదిరించి తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. సత్యేంజర్ జైన్, మనీశ్ సిసోడియాలా మిమ్మల్ని కూడా అరెస్టు చేస్తామని ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ భయపెట్టిందన్నారు. అయినా తమ ఎమ్మెల్యేలు లొంగకపోవడంతో అవిశ్వాస తీర్మానం ఆలోచనను బీజేపీ విరమించుకుందని చెప్పారు. అందుకే తానే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. 'మాకు 62 మంది ఎమ్మెల్యేలున్నారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ప్రస్తుతం మాతో లేరు. మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల ఢిల్లీలో లేరు. ఇప్పుడు అసెంబ్లీలో 56 మంది ఎమ్మెల్యేలమున్నాం. ఈడీ, సీబీఐ ఈ ఎమ్మెల్యేలను కదిలించలేవు. మేం ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. మా తప్పులను ప్రతిపక్షం గుర్తిస్తే సరిదిద్దుకుంటాం. 2017లో కూడా ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారు. 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్నారు. కానీ అది ఎలా సాధ్యమో నాకు అర్థం కాలేదు. అమిత్‌షా మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని జర్నలిస్టు మిత్రులు నాతో చెప్పారు. బీజేపీ నేతలు మీకు ఇంకా సిగ్గు ఉంటే మా వైపు చూడకండి. మేం ఆమ్ ఆద్మీ పార్టీ. భగత్‌సింగ్ వారసులం. అవసరమైతే ఉరికంభం ఎక్కుతాం కానీ దేశానికి నమ్మకద్రోహం చేయం.' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 'అవినీతిపరులంతా ఒకే వేదికపైకి వచ్చారని ప్రధాని మోదీ ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు. కానీ బీజేపీలో అనినీతి నేతలను ఈడీ, సీబీఐ కాపాడుతున్నాయి. దేశంలోని గజ దొంగలంతా కమలం పార్టీలోనే ఉన్నారు. కాలం మారుతుంది. ఏదో ఒకరోజు మోదీ అధికారం కోల్పోక తప్పదు. ఆరోజు భారత్ అవినీతి రహిత దేశం అవుతుంది. బీజేపీ నేతలంతా జైలుకు వెళతారు..' అని కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే నేతలు కాదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. 2025లో తమకు 67 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ 2025లో కాదు 2050లో కూడా ఢిల్లీలో అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. చదవండి: బాంబే హైకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురు! -
Jhalda: విశ్వాస పరీక్షలో ఓడిన టీఎంసీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికార పక్షానికి ఎదురు దెబ్బ తగిలింది. విశ్వాస పరీక్షలో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైంది. అయితే అది బెంగాల్ శాసన సభలో కాదు!.. బెంగాల్ రాజకీయాలకు 2023 పంచాయితీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. అంతకంటే ముందే అధికార టీఎంసీకి ఝలక్ తగిలింది. పురూలియా జిల్లా ఝల్దా మున్సిపాలిటీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో తృణమూల్ పార్టీ ఓడింది. అంతకు ముందు.. ఇక్కడ విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందేనంటూ అధికార పక్షానికి మొట్టికాయలు వేసింది కోల్‌కతా హైకోర్టు. దీంతో 12 వార్డులు ఉన్న ఝల్దా మున్సిపాలిటీలో సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించారు. మొత్తం 12 వార్డుల్లో ఐదు తృణమూల్, మరో ఐదు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. ఇంకో రెండు చోట్ల ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కైవసం చేసుకున్నారు. సోమవారం జరిగిన ఓటింగ్‌లో స్వతంత్రులు, కాంగ్రెస్ సభ్యులు పాల్గొనడంతో.. సంఖ్యా బలం ఆధారంగా టీఎంసీ ఓటమి పాలైంది. ఇండిపెండెంట్ అభ్యర్థులిద్దరూ కాంగ్రెస్‌కే మద్ధతు ఇచ్చారు. ఇదిలాఉంటే.. ఝల్దా మున్సిపాలిటీ చైర్మన్ సురేష్ అగర్వాల్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ప్రతిపక్ష కౌన్సిలర్లు. ఇందుకు సంబంధించి కేసు నమోదు కావడంతో.. హైకోర్టు సైతం విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఝల్దా బోర్డును ఆదేశించింది కూడా. మద్ధతు వెనక్కి.. ఝల్దా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ తపన్ కండు మరణంతో ఉప ఎన్నిక జరిగింది. మార్చి 13వ తేదీన తపన్ హత్యకు గురికాగా.. ఆ ప్లేసులో ఆయన మేనల్లుడు మిథున్ విజయం సాధించారు. ఈలోపే స్వతంత్ర అభ్యర్థి షీలా ఛటోపాధ్యాయ మద్దతుతో మున్సిపల్ బోర్డును ఏర్పాటు చేసింది టీఎంసీ. దీనిపై ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే.. దుర్గా పూజ తర్వాత షీలా తన మద్ధతు ఉపసంహరించుకోవడంతో ఝుల్దా మున్సిపాలిటీ అధికారం ఊగిసలాటకు చేరుకుంది. అభివృద్ధి కొరవడిందని కారణంతో షీలా తన మద్దతును వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాతే బోర్డుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో 108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా.. 102 స్థానాలకు సొంతం చేసుకుంది టీఎంసీ. సీపీఐ(ఎం) ఒక్కస్థానంలో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇక బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు. నాలుగు స్థానాల్లో హంగ్ ఫలితం వచ్చింది. ఇక ఇప్పుడు 101లో ఝల్దా విశ్వాస పరీక్షలో ఓటమి ద్వారా ఒక స్థానం కోల్పోయింది టీఎంసీ. ఓడింది ఒక్క స్థానమే అయినా.. అదీ మున్సిపాలిటీ అయినా.. దాని వెనుక జరిగిన రాజకీయం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రముఖ నేతలంతా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. అయితే హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకోవడంతో పాటు ఆపై విశ్వాస పరీక్షలో ఓడి ఝల్దాను చేజార్చుకుంది టీఎంసీ. -
కోట్లమంది నమ్మకంగా ఉన్నా... కోట్లిస్తే మన ఎమ్మెల్యేలు నమ్మకంగా ఉండరనిపిస్తుంది సార్!
కోట్లమంది నమ్మకంగా ఉన్నా... కోట్లిస్తే మన ఎమ్మెల్యేలు నమ్మకంగా ఉండరనిపిస్తుంది సార్! -
విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం భగవంత్‌మాన్
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీలో ఇవాళ(మంగళవారం) కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని సర్కార్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ సభ్యుల గోల నడుమ, బీజేపీ సభ్యుల వాకౌట్ నిరసనల మధ్య తీర్మానం ప్రవేశపెట్టారాయన. స్పీకర్ కుల్టార్‌సింగ్ సంధ్వాన్ అసెంబ్లీలో మాన్ ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మాన ప్రకటన చేయడంతో.. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. విశ్వాస పరీక్ష, ఇతర పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను అక్టోబర్ 3వ తేదీ వరకు పొడిగించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ)లో నిర్ణయించినట్లు స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 22వ తేదీనే ప్రత్యేక సమావేశాల కోసం ఆప్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే.. కేవలం విశ్వాస తీర్మానం కోసమని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ అందుకు అంగీకరించలేదు. సభ నిబంధనలు అందుకు అంగీకరించవని బీజేపీ, కాంగ్రెస్ గవర్నర్‌ను కోరడంతో.. ఆయన న్యాయ అభిప్రాయం తీసుకున్నారు. ఈలోపు ఆప్ ప్రభుత్వం గవర్నర్ నిర్ణయంపై, కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడింది. మరోవైపు బీజేపీతో పాటు కాంగ్రెస్ సైతం గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే.. విశ్వాస తీర్మానంతో పాటు సభలో చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని ప్రభుత్వం నివేదించడంతో.. గవర్నర్ సెప్టెంబర్ 27(ఇవాళ) నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. బీజేపీ తమ పార్టీలోని కనీసం పది మంది ఎమ్మెల్యేలను బీజేపీ పాతిక కోట్ల చొప్పున ఒక్కొక్కరికి ఇచ్చి పార్టీ మార్పించేందుకు ప్రయత్నించిందని, ఆపరేషన్ లోటస్‌ను తాము భగ్నం చేశామంటూ ఆప్ ప్రకటించుకుంది. ఈ క్రమంలోనే బలనిరూపణకు సిద్ధపడింది కూడా. అయితే పంజాబ్ బీజేపీ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. ఆరు నెలల ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నాటకాలాడుతోందని విమర్శించింది బీజేపీ. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీపై ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలతో ఈమధ్యే బలనిరూపణలో నెగ్గింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఇదీ చదవండి: పాస్‌పోర్ట్ కోసం... ఆన్లైన్లోనే పీసీసీ దరఖాస్తు -
సీఎంకు చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన గవర్నర్
సాక్షి,న్యూఢిల్లీ: పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. సెప్టెంబర్ 22న పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి అనుమతి నిరాకరించారు. విశ్వాస పరీక్ష ఎదుర్కొనేందుకు సీఎం భగవంత్ మాన్ ఈ సెషన్ నిర్వహించనున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు గవర్నర్ నిర్ణయంతో షాక్‌కు గురయ్యారు. అసెంబ్లీ సెషన్‌కు గవర్నర్ అనుమతి నిరాకరించడంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. సభ నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందని, రెండు రోజుల క్రిత అనుమతి ఇచ్చిన గవర్నర్ ఇప్పుడు చివరి నిమిషంలో ఆదేశాలను ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. పంజాబ్‌లో ఆపరేషన్ లోటస్ విఫలమైందని, అందుకే కేంద్రం నుంచి ఒత్తిడితోనే గవర్నర్ ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25కోట్లు ఆశజూపారని పంజాబ్ మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలోనే తమ బలం నిరూపించుకునేందుకు విశ్వాస పరీక్ష ఎదుర్కొంటామని, ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తామని సీఎం భగవంత్ మాన్ ఇటీవల ప్రకటించారు. ఇదే ఆరోపణలతో ఢిల్లీ అసెంబ్లీలో సెప్టెంబర్ మొదటివారంలోనే విశ్వాసపరీక్ష ప్రవేశపెట్టి బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. తమ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు -
ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఫోన్! విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న సీఎం
చండీగఢ్: ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల మొదట్లో ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 22న(గురువారం) పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. పంజాబ్ ప్రజల కలలను సాకారం చేసేందుకు ఆప్ ఎమ్మెల్యేలు కృత నిశ్చయంతో ఉన్నారని రుజువు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఈమేరకు వీడియో సందేశం పంపారు. ਲੋਕਾਂ ਦੇ ਵਿਸ਼ਵਾਸ ਦੀ ਦੁਨੀਆਂ ਦੀ ਕਿਸੇ ਕਰੰਸੀ ਵਿੱਚ ਕੋਈ ਕੀਮਤ ਨਹੀਂ ਹੁੰਦੀ …22 September ਦਿਨ ਵੀਰਵਾਰ ਨੂੰ ਪੰਜਾਬ ਵਿਧਾਨ ਸਭਾ ਦਾ ਸਪੈਸ਼ਲ ਸ਼ੈਸ਼ਨ ਬੁਲਾ ਕੇ ਵਿਸ਼ਵਾਸ ਮਤਾ ਪੇਸ਼ ਕਰਕੇ ਕਾਨੂੰਨੀ ਤੌਰ ‘ਤੇ ਇਹ ਗੱਲ ਸਾਬਤ ਕਰ ਦਿੱਤੀ ਜਾਵੇਗੀ…ਇਨਕਲਾਬ ਜ਼ਿੰਦਾਬਾਦ..! pic.twitter.com/VM2zA1upDP — Bhagwant Mann (@BhagwantMann) September 19, 2022 తమ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదిస్తోందని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ ఛీమ ఇటీవలే ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. దాదాపు 11 మంది ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ నుంచి ఫోన్ వచ్చినట్లు చెప్పారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. కాగా.. ఈ నెలలోనే ఢిల్లీ అసెంబ్లీలో బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. అనంతరం ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ ప్రలోభాలకు తలొగ్గలేదని చెప్పారు. ఈ విశ్వాస పరీక్షలో ఆప్‌కు 58 ఓట్లు వచ్చాయి. మరో నలుగురు ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాలతో అసెంబ్లీకి హాజరు కాలేదు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు కాగా.. ఆప్‌కు 62, బీజేపీకి 8 మంది సభ్యులున్నారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశి థరూర్! సోనియాతో కీలక భేటీ