
సాక్షి,ఢిల్లీ: సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం సభ వాయిదా పడింది. శనివారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. తన పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజా నోటీసుల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ జరపడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈడీ వరుసగా పంపిన సమన్లను కేజ్రీవాల్ తిరస్కరించడంతో కోర్టు ద్వారా తాజాగా ఈడీ ఆయనకు సమన్లు పంపిన విషయం తెలిసిందే. దీంతో 19న ఈడీ ముందు విచారణకు కేజ్రీవాల్ హాజరవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.