centinary
-
Vetapalem: బండ్ల బాపయ్య విద్యాసంస్థకు వందేళ్లు
వేటపాలెం (బాపట్ల జిల్లా): వేటపాలెం బండ్ల బాపయ్య విద్యాసంస్థ వందేళ్లు పూర్తిచేసుకుంది. ఈ బడిని 1921 నవంబర్ 4న బండ్ల బాపయ్య శెట్టి హిందూ మాధ్యమిక పాఠశాల పేరుతో నెలకొల్పారు. దీనికి ఐదెకరాల స్థలం కేటాయించి అందులో శాశ్వత భవనం నిర్మించారు. దీనికి అప్పట్లో ప్రభుత్వం రూ.12,457 గ్రాంటు కూడా మంజూరు చేసింది. అప్పటి నుంచి పాఠశాల దినదినాభివృద్ధి చెందింది. బడికి అనుబంధంగా 1946లో హైస్కూలు, 1961లో హయ్యర్ సెకండరీ స్కూల్, 1969లో జూనియర్ కళాశాల, 1981లో డిగ్రీ కళాశాల ఏర్పాటయ్యాయి. ఈ పాఠశాలలోని ఒక భాగంలో కొంత కాలం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల శిక్షణ తరగతులూ నిర్వహించారు. 400 మంది ఉపాధ్యాయులు ఇక్కడ శిక్షణ పొందారు. పూర్వం ఈ పాఠశాలను అందరూ ఇంగ్లిషు బడి అని పిలిచేవారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి ఎందరో విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. ఇక్కడ చదువుకున్న ఎందరో ఉన్నతస్థానాలు అధిరోహించారు. విదేశాల్లోనూ ఉన్నత స్థితికి చేరారు. చేయూతగా రాధాకృష్ణయ్య హాస్టల్ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నం భోజనం పథకం తరహాలో ఈ పాఠశాలలో స్వాతంత్య్రం రాక పూర్వం నుంచి విద్యార్థులకు భోజనం పెట్టేవారు. గొల్లపూడి రాధాకృష్ణయ్య ఈ విధానానికి నాంది పలికారు. 1933లో పాఠశాలకు అనుసంధానంగా ఉచిత భోజన హాస్టల్ ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికీ రాధాకృష్ణయ్య వారసుల ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతుండడం విశేషం. నవంబర్‌లో శతజయంత్యుత్సవాలు బండ్ల బాపయ్య విద్యా సంస్థ నెలకొల్పి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శత జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా జరపనున్నారు. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు, కాలేజీలో చదివి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వవిద్యార్థులు పాల్గొననున్నారు. ఇంగ్లిష్ బాగా చెప్పేవారు నేను 1971–73లో వేటపాలెం బండ్ల బాపయ్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదివాను. అప్పట్లోనే అధ్యాపకులు ఇంగ్లిషు బోధించారు. అందువల్ల నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఇంగ్లిష్‌లో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. గొల్లపూడి రాధాకృష్ణయ్య హాస్టల్లో మధ్యాహ్న భోజనం చేసేవాడిని. అది నా అదృష్టం. – డాక్టర్ సజ్జా లోకేశ్వరరావు, గుండె శస్త్ర చికిత్స నిపుణుడు, స్టార్ హాస్పిటల్, హైదరాబాద్ ఉపాధ్యాయ వృత్తికి పునాది ఇక్కడే ఈ పాఠశాలలో ప్రవేశానికి ఎంట్రన్స్ నిర్వహించేవారు. 1940లో 4వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాశాను. పాసై బడిలో చేరాను. మా తల్లిదండ్రులు ఇంగ్లిష్ బడిలో చదువుతున్నానని గొప్పగా చెప్పుకునేవారు. ఈ విద్యా సంస్థల్లోనే విద్యనభ్యసించి, 37 ఏళ్లపాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను. విద్యా సంస్థల్లో చదువుకున్న ఎందరో ఉన్నత పదవుల్లో ఉన్నారు. – లొల్లా శ్రీరాం మూర్తి, విశ్రాత ప్రధానోపాధ్యాయుడు -
ఆయన జీవితంలో ఎన్ని సింగిడీలో!
కొందరి జీవితాన్ని బయోపిక్‌గా రీల్‌కు ఎక్కించాలన్నా, బయోగ్రఫీగా అక్షరబద్దం చేయాలన్నా సులువు కాదు. సూర్యాపేటలో 1922 ఫిబ్రవరి15న కల్లు గీసే ముత్తిలింగం –గోపమ్మలకు పుట్టిన బొమ్మగాని భిక్షం సమాజ సేవ బహుముఖీనం. జీవించిన 90 ఏండ్లూ ఆయన ఆరడుగుల ఎర్రజెండా... బడుగు జనుల విముక్తి ఎజెండా. ఆయన అనుభ వాల్ని కొంపెల్లి వెంకట్ మాట–ముచ్చటగా తీసు కొచ్చిండు. ‘‘ఇంత ఉద్యమ చరిత్రలో ఎన్నడూ కంట కన్నీరు కార్చి నోణ్ణి కాదు. నేను ఆ రోజుల్లో అన్క్వశ్చన్డ్ లీడర్ని రా నాయనా! ప్రజా ఉద్యమాలు ఎల్లప్పుడూ ఉంటాయి. వాళ్ళలో లీనం గావాలే, అన్ని థాట్స్ హ్యుమాన్ బీయింగ్‌కు అవ సరం...’’ ఇవన్నీ జీవన చరమాంకంలో ఆయన వలపోత, కలబోత. ఇందులో ఎన్ని సింగిడీలో! ఆయన పార్లమెంట్ ఎన్నికలకు మా నాయన, సుద్దాల హన్మంతుతో పాటు గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థులుగా మేమూ పాల్గొన్నాం. హిమాయత్‌నగర్‌లో మఖ్దూమ్ భవన్‌కు ముగ్గుబోయక ముందు మా ఇంట్లో ఎన్నోసార్లు సేద తీరినప్పుడూ, ఉపన్యాసం ఇచ్చినప్పుడూ అట్లా తదేకంగా చూడడం నా జీవితంలో కలి గిన గొప్ప అవకాశం. ఆయన నల్ల గొండ పార్లమెంట్‌కు మళ్ళీ 1996లో పోటీ చేసినప్పుడు... జల సాధన కోసం జలఖడ్గం విసిరినట్లుగా తెలంగాణ ఆర్తి చెప్పడానికి 480 మంది అభ్యర్థుల్ని దుశర్ల సత్యనారాయణ, మేము నిలబెట్టినం. 89 ఏళ్ల వయస్సులో తొంటి విరిగి ఇన్ఫెక్షన్తో పోరా డుతూ 2011 మార్చి 26న ఆయన చని పోయిండ్రు. అదే రోజు నల్లగొండ జిల్లా సంగెంలో రాత్రి తెలంగాణ ఆట–పాట– మాట సభ నిర్వహించుకొని నేను, సాంబ శివుడు తిరిగి వస్తూ పొద్దున అంత్యక్రియలకు హాజరవుదామని అనుకున్నాం. దారిలో సాంబశివుడు హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న సాంబశివుణ్ణి ఆసుపత్రికి, ఇంటికి తరలించే పనిలో ధర్మభిక్షం చివరి చూపు కరువయింది. 15 ఫిబ్రవరి 2021లో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రారంభమయిన శత జయంతి వార్షికోత్సవాలు, 2022లో నేడు రవీంద్ర భారతిలో ముగుస్తాయి. -చెరుకు సుధాకర్ వ్యాసకర్త ఇంటిపార్టీ అధ్యక్షుడు -
భయపడితే... చూపుడువేలైనా బెదిరిస్తుంది!
1975 జూన్ రోజులు. ఆనాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఎమ ర్జెన్సీలో భాగంగా పత్రికా వార్తలపై సెన్సార్షిప్ మొదలైంది. వాటితో పాటే నా కార్టూన్లూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ పర్యవేక్షణ క్రింద ఉంచబడ్డాయి. నేను నా తెలివి తేటలు ఉపయోగించి అరటి తొక్క మీద కాలు వేసి జారిపోయే ముతక హాస్యము, చీరల కొట్టులో మహిళామణుల బేరసారాల వెకిలి హాస్యాల కార్టూన్లు కొన్ని పట్టుకుని సరాసరి ప్రధా నిని కలిశా. ఈ సెన్సార్షిప్ నుంచి నాకు మినహా యింపు ఇవ్వమని కోరుకున్నాను. ఆవిడ చాలా ఓపిగ్గా ఈ అప్పడాల కర్ర కార్టూన్లు అన్ని పరిశీ లించి నా కార్టూన్లు బొత్తిగా నిరపాయకరమనీ, నేను కార్టూన్లను పత్రికలో నిరభ్యంతరంగా ప్రచు రించుకోవచ్చనీ అభయం ఇచ్చారు. ఢిల్లీ నుండి బొంబాయికి తిరిగి రాగానే నేను ప్రధానమంత్రి ముందు ఒలకబోసిన దొంగ వేషం కట్టిపెట్టి ఒకటీ రెండు రోజులు అప్పడాల కార్టూన్లు వంటివి వేసినా, 3వ రోజునుండి నా అసలు రంగు చూపిం చడం మొదలు పెట్టాను. మొదట కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే కార్టూనులు, ఆ పై ఎమర్జెన్సీని తూర్పారపట్టే కార్టూనులు... ఒకదాని తరువాత మరొకటిగా నిప్పు రగిలిస్తున్నా. చండీగఢ్‌లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెషన్ ప్రారంభమైన రోజున టైమ్స్ మొదటి పేజీలో కాంగ్రెస్ అధ్యక్షుడు దేబ్ కాంత్ బరూవా – ఎమర్జెన్సీలను కలిపి కార్టూన్ అచ్చయింది. బరువాకు కార్టూన్ సెగ బాగా తగిలింది. వీసీ శుక్లా అప్పుడు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. బరువా, శుక్లాని తన దగ్గరికి పిలిపించుకుని నా కార్టూన్ చూపించి నానా చీవాట్లు పెట్టారు. శుక్లా సరాసరి ఢిల్లీ నుండి బొంబాయి వచ్చారు నా సంగతి కనుక్కోడానికి! కట్ చేస్తే శుక్లా బసచేసిన తాజ్ హోటల్ సూట్లో నేను ఉన్నాను. హలో, హాయ్, నమస్తే వంటి పరామర్శ ఏమీ లేదు. కనీసం నన్ను కూచో మని అన్నది కూడా లేదు. ఒకే మాట ‘ఇంకోసారి ఇటువంటి పిచ్చి గీతలు గీస్తే నిన్ను అత్తారింటికి పంపిస్తా ఏమనుకుంటున్నావో... గెటవుట్’ చూపుడు వేలు ఆడిస్తూ శుక్లా పరమక్రూరంగా! నా కాళ్ళు గజగజ వణికిపోయాయి. నాకు భయం వేసింది, దుఃఖం అనిపించింది, అవమానంగా ఉంది, కడుపు రగిలిపోతోంది. ఇంటికి తిరిగి రాగానే నా భార్య కమలని పిలిచి విషయం చెప్పాను: ‘ఈ పొలిటికల్ కార్టూనింగ్ పనంటూ చేస్తే వెన్నెముక విరుచుకుని పనిచేయాలి, లేదా అసలు ఈ పనే చేయకూడదు, ఇప్పుడు అదే దశ వచ్చింది. నేను ఇక ఈ ఉద్యోగం చేయను, రాజీనామా ఇచ్చేస్తాను’. మా ఆవిడ తెగ సంతోష పడింది. ‘ఎందుకులెద్దూ వెధవ లంపటమూ, ముప్ఫయ్ ఏళ్ళు చేశారు. ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. హమ్మయ్య!’ సాయంకాలం ఆఫీస్‌కు వెళ్ళి దీర్ఘకాలిక సెల వుకు దరఖాస్తు చేశాను. అక్కడి నుండి సరాసరి ఒక ట్రావెల్ ఏజన్సీకి వెళ్ళి మా దంపతులిరువురి పేరిట మారిషస్‌కు టిక్కెట్లు కొన్నాము. మూడు వారాల పాటు అక్కడ ఉండాలనేది మా ఆలోచన. ఆ దీవిలో ఆ సముద్ర తీరాన బేఫికర్‌గా జీవితాన్ని అస్వాదిం చాము. అక్కడి విదేశీయులు నా భార్య కమల చీర కట్టు గురించీ, నుదుటన దాల్చిన సిందూరం గురించీ ప్రశ్నలు అడగడమే తరువాయి ‘మా దేశం, మా ప్రాచీన సంస్కృతి, మా సంప్రదాయం’ అంటూ రొమ్ము విరుచుకుని వాళ్ళకు జవాబు ఇవ్వ డంలో గొప్ప ఆనందాన్ని పొందేవాణ్ణి. ఒకరోజు మా సాయంకాలపు వాహ్యాళి ముగించుకుని ఇసుక తీరంలోని ఒక కాటేజ్‌లో విశ్రాంతిగా కూర్చు న్నాము. మాకు సమీపంలో ఒక నల్లజాతీయుడు కూచుని ఉన్నాడు. మాకు మాటా మాటా కలిసింది. అతనికి లెబనాన్‌లో ఏదో ఎగుమతి చేసే వ్యాపారం ఉంది. ఆయన నన్ను అడిగాడు: ‘ఇంతకూ మీరేం పని చేస్తారో చెప్పనే లేదు?’ ‘నేనా? వార్తా పత్రికలో పని చేస్తా, పాత్రికే యుణ్ణి.’ ‘ఓ పత్రికా పనా! గుడ్. అది చాలా గొప్ప వృత్తి, సంపాదకీయాలు అవీ రాస్తారా మీరు?’ ‘రాస్తాను.’ ‘మరి మీరిక్కడ సెలవులో ఉంటే అక్కడ మీ పత్రికలో సంపాదకీయాలు ఎలా రాస్తారు? అది చాలా ముఖ్యమైన పని కదా?’ ‘మహాశయా! నేను వ్రాయను, నేను కార్టూన్లు గీస్తాను.’ ‘కార్టూన్లా! అంటే వ్యంగ్య చిత్రాలు! అబ్బో, అది చాలా అద్భుతమైన కళ, ఇంతకు మీరు ఏ పత్రికలో పని చేస్తారో?’ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా.’ ‘నాకు తెలుసుగా ఆ పత్రిక! మీ పేరు?’ ‘లక్ష్మణ్’ ‘వావ్! యూ సెడ్ ఇటా?’ నేను అదిరి పోయాను. భారత దేశానికి అయిదు వేల మైళ్ల దూరంలోని ఒక ప్రదేశంలో, అటు ఆ దేశానికీ, ఇటు ఈ దేశానికీ చెందని ఒక వ్యక్తి నోటి నుండి నేను రోజూ వేసే కార్టూన్ శీర్షిక, అతని యాసలో! ‘మీకు ఎలా తెలుసు?’ ‘లెబనాన్‌లో మీ దేశపు రాయబారి ఎల్కే సింగ్ ఉంటారు. అతనికి, నాకు పరిచయం. నేను అతని వద్దకు వెళ్లినప్పుడల్లా మీ కార్టూన్లు చూపిస్తారు. చూపిస్తూ ఇలా అంటారు: ‘‘చూశావా! మా ప్రజా స్వామ్యం గొప్పతనం! మా దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ, పత్రికా స్వేచ్ఛకు మాత్రం అడ్డం లేదు. అక్కడ మా కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ ఎమర్జెన్సీలో కూడా అక్కడి రాజకీయ నాయకుల డొక్క చింపుతున్నాడు. ఆ నాయకులు కూడా ప్రజా స్వామ్యాన్ని గౌరవిస్తూ ఆ కార్టూన్లని ప్రచురించ డానికి తల ఒగ్గి ఉన్నారు. అదీ మా దేశ మంటే! సారే జహా సే అచ్ఛా’. దేవుడా! బహుశా ఆ కార్టూన్లు నేను దేశం వదిలి వచ్చేముందు గీసినవి అయి ఉంటాయి. వాటి ఆధారంగా పరాయి దేశంలో మా పత్రికా స్వేచ్ఛని, మా కార్టూనిస్టుల పదును నైజాన్ని, నా దేశపు ప్రజాస్వామ్యపు స్వేచ్ఛని నిరూపించడానికి దేశం కాని దేశంలో వాటిని భద్రంగా ఉపయోగి స్తున్నారు. ఇక్కడ ఒక విదేశీయుడు వాటి ఆధా రంగా మమ్మల్ని, మా ధైర్యాన్ని గానం చేస్తున్నాడు. నేనేం చేస్తున్నాను? ఒక చూపుడు వేలు బెదిరింపు నకు వణికిపోయి ఇక్కడికి వచ్చి కూచున్నాను. లేచి నిలబడి బట్టలకంటిన ఇసుక దులుపుకొన్నాను. కమల అడిగింది: ‘ఎక్కడికి, హోటల్ రూం కా?’ ‘కాదు, సెలవు ముగిసింది, వెళ్ళి ఇక కార్టూన్లు వేయాలి.’ – ఆర్కే లక్ష్మణ్ అంతరంగ కథనం: అన్వర్ (ఇండియన్ పొలిటికల్ కార్టూన్ అంటే ప్రపంచమంతా తలతిప్పి ఆర్ కే లక్ష్మణ్ అనే సంతకం వైపు చూస్తుంది. అక్టోబర్ 24న రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్ శతజయంతి) -
పీవీ ఒక కీర్తి శిఖరం, ఆయనను ఎంత స్మరించుకున్న తక్కువే: కేసీఆర్
-
హైదరాబాద్: పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
-
పీవీ ఒక కీర్తి శిఖరం: సీఎం కేసీఆర్
కడుపు నిండిపోయింది... తెలంగాణ బిడ్డ పీవీ విగ్రహాన్ని చూస్తుంటే కడుపు నిండిపోయింది. నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్‌గా నామకరణం చేయడం సంతోషం. భవిష్యత్తులో అనేక పథకాలకు పీవీ పేరు పెట్టుకుందాం. – సీఎం కేసీఆర్ పీవీ ఓ విద్యానిధి... పీవీ తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ ఏ పాత్ర పోషించినా సంస్కరణలకు పెద్దపీట వేశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా గురుకుల, నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేశారు. పీవీ ప్రారంభించిన గురుకుల పాఠశాలలో చదివిన డీజీపీ మహేందర్‌రెడ్డి తరహాలో ఎంతో మంది పీవీని ప్రతినిత్యం స్మరించుకుంటారు. పీవీ విద్యానిధి, సాహిత్య పెన్నిధి. కవి పండితుడు, బహుభాషా కోవిదుడు, సమున్నత సాహితీ స్ఫూర్తి. ఆయన వల్లే పెట్టుబడులు... దేశం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నర్సింహారావు అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. విదేశీ మారక నిల్వలు తరిగి బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితులను సవాలుగా తీసుకుని చేపట్టిన సంస్కరణలతో ఇప్పుడు దేశానికి పెట్టుబడులు వస్తున్నాయి. – సీఎం కేసీఆర్ ఒక గొప్ప ఆభరణం... నెక్లెస్ రోడ్‌కు పీవీ విగ్రహం ఒక గొప్ప ఆభరణం. ఈ భూమి పుత్రుడికి దక్కిన గౌరవం. పీవీ కాంగ్రెస్‌కు చెందిన వాడైనా తన ఆత్మకథను ఆవిష్కరించే అవకాశం మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఇచ్చారు. మానవ హక్కులపై ఐక్య రాజ్య సమితిలో ప్రసంగించే అవకాశం కూడా వాజ్‌పేయికి కల్పించారు. – గవర్నర్ తమిళిసై సాక్షి, హైదరాబాద్: ‘మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు ఒక కీర్తి శిఖరం.. ఒక దీప స్తంభం.. పరిపూర్ణ సంస్కరణశీలి. ఆయనను ఎంత స్మరించుకున్నా, ఎంత గౌరవించుకున్నా, ఎంత సన్మానించుకున్నా తక్కువే’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో కలసి సీఎం సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ (పీవీ మార్గ్) లోని జ్ఞానభూమిలో నిర్వహించిన పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నా ఏడాది కాలం గా రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు నేతృత్వంలోని కమిటీ ఘనంగా కార్యక్రమాలు నిర్వహించిందని ముఖ్యమంత్రి చెప్పారు. భూ సంస్కరణలకు మార్గదర్శకం ‘పీవీ చేపట్టిన భూ సంస్కరణలను ఇతర రాష్ట్రాలు మార్గదర్శకంగా తీసుకున్నాయి. తనకున్న 800 ఎకరాల భూమిని ప్రజలకు ధారాదత్తం చేసి నిబద్ధ తను చాటుకుంటూ భూ సంస్కరణలు అమలు చేశారు. పీవీ స్మరణ, స్ఫూర్తిని భావితరాలకు చాటే లా కాకతీయ విశ్వవిద్యాలయంలో పీవీ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నం. వర్సిటీ వీసీ తాటికొండ రమేశ్ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తుంది. పీవీ అనేక పుస్తకాలు రాయడంతో పాటు రచనలను అధ్యయనం చేశారు. ఆయన ఆర్థిక సంస్కరణలతో నే దేశానికి పెట్టుబడులు వస్తున్నాయి. మాజీ ప్రధా ని మన్మోహన్సింగ్ కూడా పీవీని తండ్రిగా, గురువుగా స్మరించుకునేవారు’అని కేసీఆర్ అన్నారు. సోమవారం పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్. చిత్రంలో కె.కేశవరావు, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులు పుట్టిన, పెరిగిన ఊరులో విగ్రహాలు.. ‘పీవీ పుట్టిన, పెరిగిన ఊరు, ఇతర చోట్ల విగ్రహావిష్కరణలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీవీ సమాధి ఉన్న జ్ఞానభూమిలోనూ న్యాయపరమైన చిక్కులు లేకుండా స్మారకం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన కుటుంబాన్ని గౌరవించుకునేందుకు ఆయన కుమార్తె సురభి వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. పీవీ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన ఆదర్శాలు, సంస్కరణశీల భావజాలాన్ని ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ సమాజ అభ్యున్నతికి దోహద పడటమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి’అని సీఎం అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు పీవీ: కేటీఆర్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జ యంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని పీవీ అభివృద్ధి పథంలో నిలిపారని పేర్కొన్నారు. ఆయన గొప్ప దార్శనికుడు, బహుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ అని కొనియాడారు. ఈ మేరకు సోమవారం కేటీఆర్ ట్వీట్ చేశారు. అరుదైన వ్యక్తిత్వం..: గవర్నర్ ‘మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మహానేత, బహుముఖ ప్రజ్ఞాశాలి. పేద ప్రజల పెన్నిది. సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కర్త’అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ‘ఆయనను నేను ఎంతో గౌరవిస్తా. పీవీపై రూపొందించిన పుస్తకాలు వచ్చే తరాలకు విలువైన సమాచారాన్ని అందిస్తాయి. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వం పీవీది. పీవీ రాజకీయాలకంటే దేశాన్ని ఎక్కువగా ప్రేమించారు అని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పిన మాటలు అక్షర సత్యం. ప్రధాని మోదీ చెప్పినట్లు పీవీ దేశ ఆత్మను, విలువలను ప్రేమించారు. దక్షిణ భారతదేశం నుంచి ఆయన మొదటి ప్రధాని కావడం గర్వకారణం. పీవీ విజయాలను చూసి తెలంగాణ తల్లి ఎంతో సంతోషిస్తోంది’అని గవర్నర్ తమిళిసై అన్నారు. పీవీ విగ్రహం, పుస్తకాల ఆవిష్కరణ.. ఈ సందర్భంగా నెక్లెస్‌రోడ్‌ను ‘పీవీ మార్గ్’గా నామకరణం చేస్తూ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని, పీవీ జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీవీపై రూపొందించిన తొమ్మిది పుస్తకాలను గవర్నర్ తమిళిసైతో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవీ చిత్రపటానికి గవర్నర్, సీఎం నివాళి అర్పించగా.. కీర్తనలు, సర్వ మత ప్రార్థనలు జరిగాయి. ఏడాది కాలంగా జరిగిన పీవీ శత జయంతి వేడుకల కార్యక్రమాలను ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే.కేశవరావు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పాల్గొన్నారు. -
నిత్యనూతన విప్లవ స్ఫూర్తి
‘ప్రపంచ విప్లవాల వేగుచుక్క’ అక్టోబర్ విప్లవానికి నేటితో శత వసంతాలు నిండాయి. మూడు శతాబ్దాలపాటు రష్యా సామ్రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా ఏలిన జార్ చక్రవర్తుల నిరంకుశ పాలనను అంతమొందించిన ఆ విప్లవం అన్నివిధాలా విశిష్ట మైనది. చరిత్రలో అంతక్రితం 1776లో జరిగిన అమెరికన్ విప్లవం బ్రిటన్ పెత్తనాన్ని తుత్తునియలు చేసి ఉండొచ్చు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ‘పారిస్ కమ్యూన్’గా ఆవిష్కరించి చూపిన 1789నాటి ఫ్రెంచ్ విప్లవం రాజరికానికి చర మగీతం పలికి ఉండొచ్చు. కానీ అవి స్వల్పకాలానికే కడతేరిపోయాయి. తమ తమ పరిధుల్లోనే, పరిమితుల్లోనే ఉండిపోయాయి. ఒక సంపన్న వర్గం స్థానంలో మరో సంపన్న వర్గ ఆధిపత్యాన్ని మాత్రమే నెలకొల్పాయి. కానీ రష్యాలో బోల్షివిక్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమై 1917 అక్టోబర్‌లో విజయం సాధించిన మహా విప్లవానికి అంతకు 70 ఏళ్లక్రితం మార్క్స్, ఏంగెల్స్‌లు రూపొందించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో స్ఫూర్తి ఉంది. చరిత్రలో జరిగిన అనేక పోరాటాల నుంచి తీసుకున్న గుణపాఠాలు న్నాయి. అన్నిటికీ మించి వేర్వేరు సామ్రాజ్యాలు పరస్పరం సంఘర్షించుకుంటూ జన జీవితాలను సంక్షోభంలోకి నెట్టిన వర్తమానం ఉంది. సిద్ధాంతబలం పుష్కలంగా ఉన్న రష్యన్ సోషల్ డెమొక్రటిక్ వర్కర్స్ పార్టీ(ఆర్ఎస్డీ డబ్ల్యూపీ) ఉంది. దాని వెనక పిలుపు ఇచ్చినంతనే ముందుకురికే మెరికల్లాంటి బోల్షివిక్ విప్లవ శ్రేణులు న్నాయి. పటిష్టమైన వ్యూహం, ఎత్తుగడలూ రూపొందించగల లెనిన్ నాయకత్వ ముంది. అందుకే 1917 ఫిబ్రవరిలో జార్ చక్రవర్తి స్థానంలో మరో సంపన్న వర్గానికి అధికారం కట్టబెట్టిన ప్రజాతంత్ర విప్లవం అచిరకాలంలోనే మహా విప్లవంగా రూపు దిద్దుకుంది. అక్టోబర్ నెలాఖరు నాటికల్లా(కొత్త క్యాలెండర్ ప్రకారం అది నవంబర్ 7) ఆ పాలకులను గద్దె దింపి కార్మిక వర్గ ఆధిపత్యాన్ని నెలకొల్పింది. అది ఈనాటికీ పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద పాలకులను ప్రపంచంలో ఏదో ఒక మూల చికాకు పరుస్తూనే ఉంది. ఇదంతా లెనిన్‌కు సునాయాసంగా చిక్కలేదు. ఆర్ఎస్డీ డబ్ల్యూపీలో తమతో పాటు పనిచేస్తున్న మెన్షివిక్కులతో సైద్ధాంతిక పోరాటం జరిపాడు. జార్ పాలనలో విధించిన ప్రవాస శిక్ష నుంచి ఏప్రిల్‌లో స్వదేశానికొచ్చేసరికి లెనిన్ అనుచరులైన బోల్షివిక్లలోనే ఫిబ్రవరి విప్లవంపై సానుకూలత ఉంది. జార్ చక్రవర్తి ఆరంభించిన యుద్ధానికి ముగింపు పలకని ఈ కొత్త పాలకుల వల్ల దేశంలో నిజమైన ప్రజాతంత్ర పాలన ఏర్పడదని, కార్మికవర్గ నియంతృత్వమే అందుకు జవాబని లెనిన్ వాదిం చాడు. దేశంలోఅందరికీ తిండి, శాంతి, సుస్థిరత ఏర్పడాలంటే అల్ప సంఖ్యాకుల పాలనను అంతమొందించక తప్పదని ప్రకటించాడు. ఏళ్ల తరబడి ప్రవాసంలో ఉన్న లెనిన్‌కు స్థానిక పరిస్థితులు అవగాహన కాలేదని బోల్షివిక్లే మొదట్లో భావించారు. ఒకానొక సమయంలో లెనిన్ దాదాపు ఒంటరయ్యాడు. కానీ అందరి అంచనాలనూ రష్యా ప్రజలు తారుమారు చేశారు. కార్మికులు, సైనికులు, రైతులు లెనిన్ నాయ కత్వంలోని బోల్షివిక్ పార్టీ వెనక సమీకృతులై ప్రపంచంలోనే తొలి సోషలిస్టు వ్యవస్థను స్థాపించుకున్నారు. భూస్వాముల చేతుల్లో ఉండే లక్షల ఎకరాల భూమి ప్రజల పరమైంది. కార్మికులు రోజుకు ఎనిమిది గంటలు మించి పనిచేయనక్కర లేదన్న ఉత్తర్వు వెలువడింది. వివిధ జాతులకు విడిపోయే స్వేచ్ఛనిచ్చారు. అలా విడి పోతామన్న ఫిన్లాండ్కు స్వాతంత్య్రం ప్రకటించారు. నిరంకుశ రష్యా రాజ్యం అంత రించి వివిధ రిపబ్లిక్ల సమాఖ్యగా ఉన్న యునైటెడ్ సోవియెట్ సోషలిస్టు రిపబ్లిక్స్ (యూఎస్ఎస్ఆర్) ఆవిర్భవించింది. అక్టోబర్ విప్లవ ప్రభావం ఎల్లలు దాటి ప్రవహించింది. ప్రపంచాన్ని వాటాలేసి పంచుకోవడానికి సంఘర్షిస్తున్న సామ్రాజ్యవాద దేశాలను ఈ విప్లవం విస్మయ పరిచింది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాడు తున్న దేశాల్లోని ప్రజలందరికీ ఆ విప్లవం వేగుచుక్కగా కనబడింది. మన దేశంలో అప్పటికే సాగుతున్న స్వాతంత్య్ర పోరాటానికి బోల్షివిక్ పార్టీ, లెనిన్‌ల మద్దతు లభించింది. అలాగే అక్టోబర్ విప్లవ విజయాన్ని, లెనిన్ నాయకత్వాన్ని బాలగంగా ధర్ తిలక్వంటి జాతీయ నాయకులు, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి రచయితలు కీర్తించారు. బ్రిటిష్ పాలకులపై పోరాడి 23 ఏళ్ల వయసులోనే ఉరికంబం ఎక్కిన భగత్‌సింగ్ తదితర యువకిశోరాలకు గదర్ పార్టీతోపాటు అక్టోబర్ విప్లవమే స్ఫూర్తి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో దండెత్తి వచ్చిన హిట్లర్ సైన్యాలను మట్టికరిపించి ప్రపంచాన్ని నాజీయిజం ముప్పు నుంచి తప్పించింది సోవియెట్ రాజ్యమే. అక్టోబర్ విప్లవాన్ని సాధించిన గడ్డపై ఇవాళ దాని ఊసే లేదు. రష్యా చరిత్రలో అసలు అలాంటి పెను మార్పు జరిగిందన్న స్పృహే లేనట్టు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రవర్తిస్తున్నారు. మేధావులు చర్చలు, సెమినార్లు నిర్వహించుకుంటారుగానీ సాధారణ పౌరులకు దాంతో పని లేదని ఇప్పటికే ఆయన ప్రకటించారు. ‘లెనిన్ తపస్సు, స్టాలిన్ సేద్యం’ సోవియెట్ యూనియన్ నిండా 70 ఏళ్లు కూడా నిలబడలేదు. అక్కడ స్టాలిన్‌తోనే సామ్యవాదం అంతరించి పెట్టుబడిదారీ విధానం వచ్చిందనేవారు కొందరైతే... 1992లో గోర్బచెవ్ అసమర్ధ పాలనవల్లే సోవియెట్ కుప్పకూలిందని, అప్పటివరకూ అక్కడ సోషలిజం వర్ధిల్లిందని వాదించేవారు మరికొందరు. అయితే మానవేతిహాసంలో వందేళ్లనేది చాలా స్వల్పకాలం. అన్ని సమాజాల్లోనూ కనబడుతున్న అసమానతలను అధ్యయనం చేసి, వాటి పుట్టు పూర్వోత్తరాలను వెలికితీసి, అవి వర్థిల్లడానికి కారణమవుతున్న శక్తులనూ, వాటి మూలాలనూ పట్టుకుని సిద్ధాంతీకరించింది మార్క్స్, ఏంగెల్స్‌లు. ఆ సిద్ధాంతాలను ఆచరించి అధిక సంఖ్యాకుల ప్రయోజనాలను కాపాడే వ్యవస్థల నిర్మాణం సాధ్యమేనని నిరూపించినవాడు లెనిన్. ఈ ఆచరణ ప్రపంచవ్యాప్తంగా పాలకుల వైఖరిలో మార్పు తీసుకొచ్చింది. జన సంక్షేమాన్ని కాంక్షించే ఆచరణ లేకపోతే పుట్టగతులుండవన్న స్పృహ ఏర్పరిచింది. అక్టోబర్ విప్లవ స్ఫూర్తి అజరామరం. ప్రపంచంలో ఏదో ఒక మూల, ఏదో ఒక రూపంలో అది అందరినీ ప్రభావితం చేస్తూనే ఉంటుంది. -
ఉస్మానియా వర్సిటీకి పవన్ వందనం!
హైదరాబాద్: ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీ శతవసంతాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభకాంక్షలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీకి వందనమంటూ ఆయన పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతవసంతాల వేడుకలు బుధవారం ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరవుతున్న సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించి.. వాహనాల దారి మళ్లించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలోని భద్రతపై పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.