
ఉస్మానియా వర్సిటీకి పవన్ వందనం!
హైదరాబాద్: ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీ శతవసంతాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభకాంక్షలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీకి వందనమంటూ ఆయన పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ శతవసంతాల వేడుకలు బుధవారం ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరవుతున్న సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించి.. వాహనాల దారి మళ్లించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలోని భద్రతపై పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.