
హైదరాబాద్: వివిధ సమస్యలపై పోరాటం చేస్తున్న టీజేఏసీ చైర్మన్ కోదండరాం కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఎందుకు కలుపుకోవడం లేదని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడేం దుకు ఉద్యమ శక్తుల పునరేకీకరణ జరగాలన్నారు. కోదండరాం నాయకత్వంలో పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఉద్యమ శక్తులను కలుపుకోకుండా ఆయన ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టం చేయాలన్నారు.