రాష్ట్రంలో టీఆర్‌ఎస్ చాటున టీడీపీ పాలన సాగుతోందని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ అన్నారు.
చెరుకు సుధాకర్
హన్మకొండ: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ చాటున టీడీపీ పాలన సాగుతోందని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ అన్నారు. ఆదివారం హన్మకొండలో తెలంగాణ స్ఫూర్తి యాత్ర చర్చాగోష్టి నిర్వహించారు. సీఎం కేసీఆర్ పూర్వాశ్రమం టీడీపీ నాయకులతో కూడిన ప్రభుత్వమే రాష్ట్రంలో సాగుతోందని, ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా నడుస్తోందన్నారు. ప్రశ్నిం చే వారు ఉండకూడదనే ఉద్దేశంతోనే విపక్ష ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారన్నారు. పార్టీలు మారడం వెనుక రూ.వందల కోట్ల డీల్ నడుస్తోందన్నారు.
ప్రశ్నించే నాయకులు లేకున్నా, తెలంగాణ ఉద్యమ వేదిక, తెలంగాణ ఉద్యమ జేఏసీ ప్రజల పక్షాన నిలుస్తాయన్నారు. గ్రామ జేఏసీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, తెలంగాణ ఉద్యమ జేఏసీగా మలచడానికే ఈ యాత్ర చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపడంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం విఫలమయ్యూరని మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు.