ఏపీ ప్రభుత్వంపై జగన్‌ ఒంటరిపోరు | cheruku sudhakar priced ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వంపై జగన్‌ ఒంటరిపోరు

Published Sat, Mar 25 2017 3:44 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

ఏపీ ప్రభుత్వంపై జగన్‌ ఒంటరిపోరు - Sakshi

ఏపీ ప్రభుత్వంపై జగన్‌ ఒంటరిపోరు

టీయూవీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌
సుభాష్‌నగర్‌ (నిజామాబాద్‌ అర్బన్‌): ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై 50 కిలోల బరువున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బాగానే కొట్లాడుతున్నాడని.. కానీ, తెలంగాణలో 40 కిలోల బాహుబలితో మీరెందుకు కొట్లాడటం లేదని తెలంగాణ ఉద్యమ వేదిక (టీయూవీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ తెలంగాణ ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు.

శుక్రవారం నిజామాబాద్‌లో తెలంగాణ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణలో బడుగులకు, ఉద్యమశక్తులకు రాజ్యాధికారం’అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో చెరుకు సుధాకర్‌ మాట్లాడుతూ బడుగులు, బలహీన వర్గాల నుంచి సరైన నాయకుడిని తయారు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జూన్‌ 2న కొత్త పార్టీ ఆవిర్భావానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement