తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని టఫ్ రాష్ట్ర కన్వీనర్ విమలక్క ఆరోపించారు.
రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారు: విమలక్క
కొడంగల్: తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని టఫ్ రాష్ట్ర కన్వీనర్ విమలక్క ఆరోపించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన ధూం ధాంలో ఆమె మాట్లాడారు. దోపిడీ, అణచివేతల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలను మించి పోయిందని మండిపడ్డారు.
సకల జనులు ప్రాణాలకు తెగించి సాధించుకున్న రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వం.. బలవంతపు భూసేకరణ చేస్తోం దన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి ప్రసాద్ కుమార్, ఉద్యమవేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ పాల్గొన్నారు.