తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముంబైలో తెలంగాణ ప్రజల సంక్షేమార్థం తెలంగాణ భవన్ నిర్మాణానికి కృషిచేస్తామనితెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరకు సుధాకర్ వ్యక్తం చేశారు.
సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముంబైలో తెలంగాణ ప్రజల సంక్షేమార్థం తెలంగాణ భవన్ నిర్మాణానికి కృషిచేస్తామనితెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరకు సుధాకర్ వ్యక్తం చేశారు. ముంబైలోని ములుండ్‌లో ‘తెలంగాణ పునర్నిర్మాణం, వలసబిడ్డల సమస్యల భవిష్యత్తు-చర్చాగోష్టి, ఆకుల భూమయ్య సంస్మరణ సభ’ కార్యక్రమం జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న వీరిద్ద రూ ప్రత్యేక తెలంగాణ తొందర్లోనే ఏర్పాటు అవుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రజాసామ్య పద్దతిలోనే ఏర్పడుతున్న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు వచ్చిందన్నారు. ఆంక్షలు లేని తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు.
వారం రోజుల్లో ఏర్పాటు
ప్రత్యేక తెలంగాణ మరో వారం రోజుల్లో ఏర్పాటు అవుతుందన్న ధీమాను చెర కు సుధారకర్ వ్యక్తం చేశారు కాంగ్రెస్, ఇతర పార్టీలు తెలంగాణ ఇచ్చేందుకు ముందుకు రావడానికి మన ఉద్యమాలే కారణమని ఆయన చెప్పారు. 2014లో జరగబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణ కోసం పోరాడుతున్న ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాైటె న తర్వాత నగరంలోని వలసబిడ్డల సమస్యలను పరిష్కరిం చేందుకు ముంబైలో ప్రత్యే క తెలంగాణ భవనం నిర్మించేలా చూస్తామన్నారు. అంతకుముందు తెలంగాణ పోరాట యోధుడైన ఆకుల భూమయ్యకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ కళామంచ్ సభ్యులు ఆలపించిన గీతాలు ఆహూతులను ఉత్తేజ పరిచాయి. తెలుగు కార్మిక అసోసియేషన్, రిల యన్స్ కార్మిక సమాఖ్య, శ్రమజీవి సంఘం, ధారావి యాద వ్ సంఘం, వడాలా కోలివాడ ఎస్సీ సంఘం, ములూండ్ కార్మిక సంఘం, పవాయి కార్మిక సమా ఖ్య, తెలంగాణ రచయితల వేదిక, విలేపార్లె కష్టకరి సంఘం, గోరేగావ్ శ్రీనివాస్ ఎంటర్‌ప్రెజైస్ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వడాల మహిళ సంఘం సభ్యులతోపాటు ఇతర ప్రాంతాల మహిళలు పాల్గొన్నా రు. ఈ కార్యక్రమంలో అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి మచ్చ ప్రభాకర్, గ్యార శేఖర్, సంగపంగ సైదులు, పల్లె గోవింద్, జి. రమేష్, అక్కనపెల్లి దుర్గేష్, మారంపెల్లి రవి, లింగం, వెంకటేష్, గడుగుంట్ల దశరథ్, నగేష్, సంగవేని రవి, గుర్‌నాథ్, పుష్కర జాల, కంటె అశోక్, సైదులు పాల్గొన్నారు.