సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూములను అమ్మి సేకరించిన నిధుల్లో రాష్ట్ర మౌలిక అభివృద్ధికి ఖర్చు పెట్టిందెంతో మంత్రి కేటీఆర్ వివరించాలని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్డిమాండ్చేశారు. హైదరబాద్చుట్టూ 344 క.మీ రీజినల్రింగ్రోడ్‌అలైన్మెంట్లో రింగు తిప్పుతున్నది భూ మాఫియా పెద్దలేనని ఆదివారం ఒక ప్రకనటలో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్‌ఇచ్చిన ప్రాజెక్టులు, రింగ్రోడ్డుకు అవసరమైన భూమి కంటే ఎన్నో రెట్లు రైతుల నుండి ఎందుకు సేకరించారని నిలదీశారు.
తాము కొన్న భూముల జోలికి పోకుండా చూసుకుంటూ, రైతుల నుండి ఎక్కువ భూమి తమ అధీనంలోకి తీసుకోవడానికి అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మల్లన్నసాగర్, కాళేశ్వరం కాలువ పనుల్లో వేల ఎకరాల భూమి కోల్పోయిన ప్రజలకు పరిహారం అందలేదని, ఆందోళన చేస్తున్న రైతులను కేసీఆర్ ప్రభుత్వం నిర్భందంతో అణిచివేస్తున్నదని చెరుకు సుధాకర్‌ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment