
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆడియో ప్రకారం.. ఉప ఎన్నికలో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని పార్టీ నేతలకు ఫోన్ చేశారు కోమటిరెడ్డి. పార్టీలను చూడొద్దని, రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ ఓడితే.. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్ అవుతానంటూ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రమంతా పాదయాత్ర చేసి, తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని తెలిపారు. అప్పుడు పార్టీకి సాయం చేయాలని కోరారు. కానీ వ్యక్తిగతంగా ఈ ఒక్కసారికి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని తెలిపారు. పార్టీలు చూడవద్దని, ఏమైనా ఉంటే తాను చూసుకుంటానని వెంకట్ రెడ్డి అన్నారు. మనవాళ్లు వచ్చి కలుస్తారని, 25 ఏళ్ల వీళ్లంతా నుంచి తమ ఫ్యామిలీ మెంబర్స్ అని పార్టీ నేతతో సంభాషించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దీనిపై స్పందించేందుకు వెంకటరెడ్డి అందుబాటులో లేరు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు కోమటిరెడ్డి ప్రచారానికి రాకపోగా.. కుటుంబ సభ్యులతో కలిసి పది రోజుల హాలీడే ట్రిప్ కోసం గురువారం రాత్రి ఆస్ట్రేలియా వెళ్లారు.
చదవండి: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. టీఆర్‌ఎస్‌లోకి తిరిగి వలసలు
Comments
Please login to add a commentAdd a comment