సాక్షి, హైదరాబాద్: భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికకు తాను పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
'ఉపఎన్నిక కసరత్తు మీటింగ్‌కు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ఏ మీటింగ్ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. నాకు ఆహ్వానం లేని మీటింగ్‌కు నేను ఎందుకు వెళ్తా. చండూరులో సభలో అసభ్యంగా తిట్టించారు. హోంగార్డుతో పోల్చారు. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. నన్ను అవమానిస్తే పార్టీ నుంచి వెళ్లిపోతాను అనుకున్నారు. నన్ను వెళ్లగొట్టి కాంగ్రెస్‌ను ఖాళీ చేద్దామనుకుంటున్నారు. అన్ని విషయాలు సోనియా, రాహుల్‌తో మాట్లాడతా. ఉప ఎన్నిక వస్తుంది కాబట్టే కేసీఆర్ కొత్త పెన్షన్లు ఇస్తున్నారు' అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
చదవండి: (Telangana-IPS Officers: పోస్టింగ్ లేదు.. వెళ్లిపోదాం!)
Comments
Please login to add a commentAdd a comment