సాక్షి, హైదరాబాద్: మీటింగ్‌కు హాజరు కాని 11 మంది అధికార ప్రతినిధులకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని టీపీసీసీ కోరింది. నిన్న(శనివారం) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి నేతృత్వంలో గాంధీభవన్‌లో కీలక భేటీ జరిగింది.
సమావేశానికి హాజరుకావాల్సిందిగా పలువురు నేతలకు సమాచారం ఇచ్చారు. ఈ మీటింగ్‌కు 11 మంది ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరయ్యారు. దీంతో క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయ్యింది. వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలుంటాయని కమిటీ హెచ్చరించింది.
చదవండి: రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం: చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment