TPCC Committee
-
టీపీసీసీలో చల్లారని సెగ!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో అసంతృప్తుల స్వరం పెరుగుతోంది. టీపీసీసీ కమిటీలపై నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. కొందరు నేతలు చాపకింద నీరులా తమ అసమ్మతిని వ్యక్తం చేస్తుంటే, కొందరు బహిరంగంగానే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మరికొందరు సముచిత స్థానం దక్కలేదనే ఆవేదనతో రాజీనామాల బాట పడుతున్నారు. కొండా సురేఖ, బెల్లయ్య నాయక్, భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్, గీతారెడ్డి, కోదండరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావులను అనుసరిస్తూ తాజాగా మరో ముఖ్య నేత దామోదర రాజనర్సింహ అసమ్మతి గళం విప్పారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ అధిష్టానం తీరుపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కల్చరే తెలియని వాళ్లకు పదవులా? ఏఐసీసీ ఇటీవల ప్రకటించిన టీపీసీసీ కమిటీల విషయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. పార్టీలోని కొందరు ఎస్సీ నేతలతో సమావేశమైన ఆయన, మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కమిటీల కూర్పుపై పదునైన విమర్శలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లేనంతమంది ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించారని, ఇంతటి జంబో కమిటీలు అవసరమా? అని ప్రశ్నించారు. కొత్త కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగలేదని, పీసీసీ ప్రతినిధులను ఎన్నుకున్న నాటి నుంచి ఇది కొనసాగుతోందని చెప్పారు. కొత్త కమిటీల్లో నిన్న, మొన్న వచ్చిన వాళ్లు, కాంగ్రెస్ కల్చర్ తెలియని వారే ఉన్నారని, వారికి ఏ ప్రాతిపదికన పదవులు ఇచ్చారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా కోవర్టిజం అనే రోగం పట్టుకుందని, అధిష్టానం కూడా కోవర్టులకే ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన అధిష్టానం, మనోభావాలు దెబ్బతినే విధంగా పదవులు ఇచ్చిందని, కోవర్టులకే పదవులు వచ్చాయని చెప్పారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలని ఉందో లేదో కూడా అర్థం కావడం లేదని, పార్టీలో ఎవరి ఎజెండా వారికి ఉందని అన్నారు. సంబురాలు చేసుకున్న నేతలు అసమ్మతి వ్యవహారం ఇలా ఉంటే తాజా కమిటీల్లో పదవులు దక్కిన నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జి.మధుసూదన్‌రెడ్డి మంగళవారం గాంధీభవన్‌కు వచ్చి మాజీ ఎంపీ మల్లు రవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు. బాణాసంచా కాల్చి ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వానికి మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ తర్వాత మల్లు రవి, ఈరవత్రి అనిల్, నాగరిగారి ప్రీతంలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కమిటీల కూర్పుకు తమ మద్దతు తెలియజేశారు. మల్లు రవి మాట్లాడుతూ.. కొత్త కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం దక్కిందన్నారు. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 8 శాతం, బీసీలకు 29 శాతం పదవులు ఇచ్చారని, ఉదయపూర్ డిక్లరేషన్ ఈ వర్గాలకు 50 శాతం పదవులు ఇవ్వాలని తీర్మానించిందని, కానీ టీపీసీసీ కమిటీల్లో 60 శాతం ఇచ్చామని చెప్పారు. ఎలాంటి చిన్న తప్పిదాలు జరిగినా వాటిని సవరించుకుంటామని, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత కలిసి సరి చేస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ కనుకనే నేతలు మాట్లాడగలుగుతారని, దామోదర రాజనర్సింహ చెప్పిన అన్ని విషయాలను పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందని, కోవర్టులు ఎవరో కూడా పరిశీలిస్తుందని మల్లు రవి చెప్పారు. నాగరి గారి ప్రీతం మాట్లాడుతూ ..తాజా కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్ద పీట వేశారని చెప్పారు. యువకులు, సీనియర్ల కాంబినేషన్లో కమిటీలున్నాయనేదే తమ భావన అన్నారు. త్వరలో కమిటీ విస్తరణ ఉంటుందని, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. పోరగాళ్లకు పదవులు ఇచ్చారని కొందరు విమర్శిస్తున్నారని, వారికి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. అసమర్థులకు పోస్టులు ఇచ్చారని మరొకొందరు అంటున్నారని, మరి సమర్థులైన నేతలు ఇప్పటిదాకా ఏం చేశారో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఇలావుండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తగిన ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వెళ్లిన ‘సామాజిక కాంగ్రెస్’బృందం అక్కడే మకాం వేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ముఖ్య నేతలను కలిసేందుకు ప్రయత్నిస్తోంది. కమిటీలను ప్రక్షాళన చేయాలి కమిటీల కూర్పులో చాలా తప్పిదాలు జరిగాయని, వాటిని సవరించాలని, కమిటీలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని రాజనర్సింహ డిమాండ్ చేశారు. కోవర్టులెవరో గుర్తించి కాంగ్రెస్ కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత అధిష్టానిదేనన్నారు. అధిష్టానాన్ని గౌరవిస్తామని, అదే సమయంలో ఆత్మ గౌరవం కోసం పోరాటం కూడా చేస్తామని దామోదర స్పష్టం చేశారు. కమిటీల నియామకంలో జరిగిన తప్పులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకే తాను బాధతో విలేకరుల సమావేశం పెట్టానని చెప్పారు. ఎక్కడ లోపం జరిగిందో అర్థం చేసుకుని అధిష్టానం చర్యలు తీసుకోవాలని, మున్ముందు వచ్చే కష్టాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
హైఓల్టేజ్ పాలిటిక్స్.. కాంగ్రెస్‌లో కమిటీల కాక!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోమారు విభేదాలు రాజుకున్నాయి. గత రెండురోజుల క్రితం విడుదలైన టీపీసీసీ కమిటీల కూర్పుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తగిన ప్రాధాన్యత, ప్రాతినిధ్యం దక్కని నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఆదివారం ఇది రాజీనామాలకు దారితీయగా, సోమవారం అసమ్మతి నేతలంతా భేటీ అయ్యేవరకు వెళ్లింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసం ఇందుకు వేదిక కావడం గమనార్హం. అయితే తమ భేటీ అసంతృప్తుల భేటీ కాదని, కాంగ్రెస్ ఆత్మల భేటీ అని ఈ సమావేశానికి హాజరైన నాయకులు వ్యాఖ్యానించడం రాష్ట్ర కాంగ్రెస్ పారీ్టలో చర్చనీయాంశమవుతోంది. కమిటీలపైనే చర్చ: హైదరాబాద్‌లోని భట్టి విక్రమార్క నివాసంలో సోమవారం పలువురు సీనియర్ నేతలు భేటీ అయ్యారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి, సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చెనగోని దయాకర్, డాక్టర్ కురువ విజయ్‌కుమార్‌తో పాటు పలువురు ఓయూ నాయకులు కూడా భట్టితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీపీసీసీ కమిటీల కూర్పుపైనే ప్రధానంగా నేతల మధ్య చర్చ జరిగింది. కమిటీల్లో ఉన్న పేర్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు ఏకపక్షంగా కమిటీలను ఏర్పాటు చేశారనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. సంస్థాగత వ్యవహారాలు, టికెట్ల కేటాయింపు సమయంలో సీఎల్పీ నేతను కూడా పీసీసీ అధ్యక్షుడితో సమానంగా పరిగణిస్తారని, కానీ తాజా కమిటీల విషయంలో మాత్రం సీఎల్పీ నేతను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నారని నేతలు అన్నారు. దశాబ్దాలుగా పారీ్టకి సేవలందిస్తున్న వారిని విస్మరించి, పారీ్టలోకి వచ్చి రెండేళ్లు కూడా కాని వారికి ప్రాధాన్యతతో కూడిన పదవులు ఎలా ఇచ్చారనే చర్చ కూడా వచ్చింది. ఉత్తమ్, భట్టి, జగ్గారెడ్డి లాంటి నేతలు ఉన్న జిల్లాల అధ్యక్షులను ప్రకటించకుండా నిలిపివేయడం, ఏఐసీసీ కార్యదర్శి హోదాలో ఉన్న శ్రీధర్‌బాబు జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిని కనీసం ఆయన్ను సంప్రదించకుండా ప్రకటించడం సరైంది కాదని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ కమిటీల విషయంలో ఢిల్లీ పెద్దలు వెంటనే చొరవ తీసుకోవాలని, జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని సమావేశంలో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. అభిప్రాయాలు చెబుతున్నారు: భట్టి భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. తాజా కమిటీల్లో చోటు దక్కిన వారు, దక్కని వారు కూడా తనను కలిసి వారి అభిప్రాయాలను చెబుతున్నారని వెల్లడించారు. పారీ్టలో చాలా కాలంగా పనిచేస్తున్నప్పటికీ తమకు అవకాశం ఇవ్వలేదని కొందరు చెబుతున్నారన్నారు. మొదట్నుంచీ పారీ్టలో పనిచేస్తున్న వారికి తగిన అవకాశాలు రాలేదని, కమిటీల కూర్పులో సామాజిక సమతుల్యత లేదని కొందరు చెప్పారని తెలిపారు. వారి అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. నాతో మాట్లాడలేదు.. ఎలాంటి కసరత్తు జరగకుండానే కమిటీలను ప్రకటించారని, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడితో పాటు పారీ్టలోని సీనియర్ నేతలందరినీ కూర్చోబెట్టి అందరి అభిప్రాయాలను తీసుకుంటే బాగుండేదని భట్టి అన్నారు. ఈ కమిటీల విషయంలో తనతో అధిష్టానం మాట్లాడలేదని చెప్పారు. పారీ్టకి పీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎల్పీ నాయకుడు కూడా ముఖ్యమేనని, కానీ ఈసారి ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని భట్టి వ్యాఖ్యానించారు. భట్టికి ఎంపీ కోమటిరెడ్డి ఫోన్ కమిటీల్లో కనీస ప్రాతినిధ్యం లభించని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్షంలో సభ్యుడినైన తనను కమిటీల్లో ఎందుకు చేర్చలేదో అధిష్టానం నుంచి వివరణ తీసుకోవాలని కోరినట్టు సమాచారం. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా భట్టితో ఫోన్లో మాట్లాడారని, టీపీసీసీ కార్యవర్గ కూర్పుపైనే ఇరువురు నేతలు చాలాసేపు ముచ్చటించారని సమాచారం. -
టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ రాజీనామా చేశారు. టీపీసీసీ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొండా సురేఖ రాజీనామా చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తనపేరు లేదని, అలాగే వరంగల్‌కు చెందిన ఏ ఒక్క లీడర్ పేరు కూడా లేకపోవడం మనస్థాపాన్ని కలిగించిందన్నారు. తనకంటే జూనియర్లకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో స్థానం కల్పించారని.. ఇది తనను అవమానించడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: టీపీసీసీ ‘జంబో జట్టు’ ‘ఎగ్జిక్యూటివ్ కమిటీలో నన్ను వేయడం బాధించింది. ఇందులో రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితోపాటు కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాని వారిని నామినేట్ చేసిన కమిటీలో నన్ను వేయడం అవమానపర్చినట్లుగా భావిస్తున్నాను. మాకు పదవులు ముఖ్యం కాదు. ఆత్మాభిమానం ముఖ్యం. నమ్ముకున్న వారి కోసం ఒకానొక సమయంలో మంత్రి పదవినే వద్దు అనుకున్నదాన్ని. ‘35 సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఏ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించలేదు. ఎప్పుడూ పార్టీ అభివృద్ధి కోసమే సొంత ఖర్చులతో పనిచేశాము. నమ్మిన పార్టీ కోసం ఏ చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను ఈ కమిటీలో కంటిన్యూ కాలేను. అందుకే తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా రాజీనామా చేస్తున్నాను. వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృష్టిచేస్తూ ఒక సామాన్య కార్యకర్తలా కాంగ్రెస్‌లో కొనసాగుతా’ అని కొండా సురేఖ వెల్లడించారు. చదవండి: పీసీసీ కమిటీల్లో చోటు దక్కకపోవడంపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి -
పీసీసీ కమిటీల్లో చోటు దక్కకపోవడంపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ నుంచే ఎమ్మెల్యేగా పోటీచేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలకు నెల ముందు వరకు రాజకీయాల గురించి మాట్లాడనని తెలిపారు. తెలంగాణ కోసం మంత్రి పదవినే వదిలేశానని.. పార్టీ పదవులు ఎంత అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో హైపవర్ కమిటీలు చాలా ఉన్నాయన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, కార్యకర్తలే ముఖ్యమన్నారు. కాగా తెలంగాణ పీసీసీకి చెందిన కొత్త కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి చైర్మన్‌గా 40 మందితో పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, మాణిక్యం ఠాకూర్ అధ్యక్షతన 20 మంది సభ్యులతో రాజకీయ వ్యవహారాల కమిటీలను విడుదల చేసింది. ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. ఈ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఎలాంటి పదవి దక్కలేదు. పీసీసీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రెండు కమిటీల్లోనూ చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిప్‌గా మారింది. ఈ విషయమై ఆదివారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా పార్టీకి అంటిముట్టనట్టుగా ఉండటం, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ప్రచారానికి దూరంగా ఉండటం నేపథ్యంలో వెంకట్ రెడ్డికి కొత్త కమిటీల్లో చోటు దక్కలేదని తెలుస్తోంది. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం కూడా కారణమనే చర్చ జరుగుతోంది. చదవండి: సీబీఐ ఛాయ్ బిస్కెట్ తినడానికి రాలేదు.. కవితపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ -
టి. కాంగ్రెస్‌లో ప్రక్షాళన షురూ.. ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లపై వేటు!
తెలంగాణలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఏకంగా డిపాజిట్ సైతం కోల్పోయింది. మరోవైపు.. తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ బలోపేతంపై హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే టీపీసీసీ కొత్త కార్యవర్గంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లను మార్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్లను తొలగించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో పార్టీలో అందరినీ కలుపుకునిపోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అధిష్టానం సూచించింది. కాగా, పదవుల నుంచి తొలగించిన వారికి పొలిటికల్ ఎఫైర్ కమిటీలో సర్దుబాటు చేసే విధంగా టీమ్ కూర్పు జరుగుతోంది. ఇక, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ఎఫెక్ట్‌తోనే.. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు కార్యవర్గ కూర్పు జరగలేదు. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకాలు చేయలేదు. పీసీసీ కార్యవర్గ ఏర్పాటు కోసం నేతల నుంచి డిమాండ్ వస్తున్నా.. పదవుల పంపకాల్లో తేడాలు వస్తే గ్రూప్ వార్లు పెరుగుతాయన్న కారణంతో నాన్చుతూ వచ్చారు. ఇప్పుడు ఏడాదిలోగా ఎన్నికలు ఉండటంతో పార్టీ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ఆ దిశగా కొత్త కార్యవర్గ ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని అధిష్టానం పెద్దలు సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే పార్టీ నేతలు కసరత్తు చేపట్టారు. చాలా జిల్లాలకు కొత్త అధ్యక్షుల ఎంపికపై ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. -
టీపీసీసీ సీరియస్.. మీటింగ్‌కు ఎందుకు రాలేదు?
సాక్షి, హైదరాబాద్: మీటింగ్‌కు హాజరు కాని 11 మంది అధికార ప్రతినిధులకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని టీపీసీసీ కోరింది. నిన్న(శనివారం) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి నేతృత్వంలో గాంధీభవన్‌లో కీలక భేటీ జరిగింది. సమావేశానికి హాజరుకావాల్సిందిగా పలువురు నేతలకు సమాచారం ఇచ్చారు. ఈ మీటింగ్‌కు 11 మంది ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరయ్యారు. దీంతో క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయ్యింది. వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలుంటాయని కమిటీ హెచ్చరించింది. చదవండి: రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం: చిరంజీవి -
నిలబడి.. కలబడేదెలా?.. కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో వెనుకబడిన కాంగ్రెస్ పార్టీ.. పట్టు నిలుపుకోవడం కోసం ఏం చేయాలన్న దానిపై ఫోకస్ పెట్టింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరుగుతున్న పోరాటంతో.. తమ ప్రమేయం లేకుండానే తగులుతున్న ఎదురుదెబ్బలను అడ్డుకోవడానికి మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో తామూ చురుగ్గానే ఉన్నామని చెప్పుకొనేందుకు ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక మొదలు జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన రాజకీయ పరిణామాల ప్రభావం నుంచి బయటపడటంపై కాంగ్రెస్‌లో అంతర్మథనం సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ అవగాహన ఉందని, బెంగాల్ తరహా పరిస్థితులను సృష్టించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న రాజకీయ ఆటకు చెక్‌పెట్టడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. చేతులు కాలకముందే..! రాష్ట్రంలో కేవలం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉందనే భావన నుంచి ప్రజల దృష్టి మరల్చాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలపై పోరాడి ఆకర్షించాలని.. ఇదే సమయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఉన్న అవగాహనను ఎండగట్టాలని భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావడం లేదు. చేతులు పూర్తిగా కాలకముందే.. సగం కాలిన చేతులతో అయినా ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. చేతులు పూర్తిగా కాలిపోతాయా? బాగవుతాయయా అన్నది వేచి చూడాలి..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఏం చేస్తే బాగుంటుంది? బీజేపీ, టీఆర్ఎస్ల దూకుడును దీటుగా ఎదుర్కోవడం, సమస్యలపై ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణపై చర్చించేందుకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)శనివారం జూమ్ యాప్ ద్వారా సమావేశమైంది. అంతకుముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇద్దరూ కిసాన్‌సెల్ నేతలతో సమావేశమై రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సాయంత్రం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో.. రేవంత్‌రెడ్డి, భట్టితోపాటు ముఖ్య నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, గీతారెడ్డి, మధుయాష్కీగౌడ్, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, బోసురాజు, నదీమ్ జావేద్, చిన్నారెడ్డి, షబ్బీర్‌అలీ, కోదండరెడ్డి, మల్లురవి, జి.నిరంజన్, పలు జిల్లాల డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను రేవంత్, భట్టి వివరించారు. అనంతరం ప్రజాసమస్యలపై పోరాట కార్యాచరణ గురించి నేతలు చర్చించారు. తొలిదశలో భాగంగా రైతులు, ఓబీసీ సమస్యలను చేపట్టాలని నిర్ణయించారు. రైతుల సమస్యలపై ప్రత్యక్ష పోరాటాలు చేయాలని, ఓబీసీల జనగణన అంశం, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు అంశాలపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు. కాంగ్రెస్ కార్యాచరణ ఇదీ.. రైతుల సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రైతు రుణమాఫీతోపాటు ధరణి సమస్యల పరిష్కారం, ఏపీలో జరుగుతున్న తరహా కార్యక్రమాల అమలు కోసం 21న సీఎస్‌ను కలవాలని తీర్మానించారు. అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో కలిసి రైతు సమస్యలపై వినతిపత్రం సమర్పించనున్నారు. ► రైతు సమస్యలపై.. ఈ నెల 24న మండలాలు, 30న నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ► డిసెంబర్ 5న జిల్లాస్థాయిలో ఆందోళనలు చేపట్టాలని.. స్థానికంగా ఉన్న మహా నాయకుల విగ్రహాల వద్ద నుంచి కలెక్టరేట్ల వరకు భారీ ర్యాలీలు నిర్వహించాలని తీర్మానించారు. ఈ ఆందోళనల్లో రాష్ట్రస్థాయి నాయకత్వం పాల్గొనాలని నిర్ణయించారు. ► ఇతర వర్గాలకు చెందిన సమస్యలు, తదుపరి కార్యాచరణపై మరోమారు సమావేశం కావాలని జూమ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: Bengal Style Politics: తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం! -
సభా వేదిక పేచీ: కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో జరగాల్సిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభా వేదిక మారింది. భువనగిరి పార్లమెంటు స్థానం పరిధిలోని ఇబ్రహీంపట్నం నుంచి చేవెళ్ల లోక్‌సభ పరిధిలోకి వచ్చే మహేశ్వరం సమీపానికి సభా వేదికను మార్చాలని నిర్ణయించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేసినందునే ఈ మార్పు జరిగిందని తెలుస్తోంది. ఈనెల 9న ఇంద్రవెల్లిలో సభావేదికపై నుంచే ఇబ్రహీంపట్నం సభను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కానీ, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా, తనను అడగకుండా తన పార్లమెంటు స్థానం పరిధిలోకి వచ్చే ఇబ్రహీంపట్నంలో సభ ఎలా ప్రకటిస్తారని కోమటిరెడ్డి అభ్యంతరం తెలిపారు. దీనికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ తీరుపై ఆయన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్ వరకు వ్యవహారం వెళ్లడంతో ఆయన కోమటిరెడ్డితో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. అనంతరం కోమటిరెడ్డి, రేవంత్‌లు ఫోన్లో మాట్లాడుకున్నారని, తనకు ఈనెల 17 నుంచి 21 వరకు బొగ్గు, స్టీల్ పార్లమెంటరీ స్టాం డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో స్టడీ టూర్ ఉన్నందున తాను సభకు రాలేనని, ఆ టూర్ కోసం గోవాకు వెళ్తున్నానని కోమటిరెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో సభ పెట్టి ఎంపీ కోమటిరెడ్డి హాజరుకాకపోతే సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే సభాస్థలిని మా ర్చాలని నిర్ణయించారని, ఇందుకోసం ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. గతంలో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రేవంత్ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర ముగింపు సభను ఏర్పాటు చేసిన రావిర్యాలలోనే దళిత గిరిజన దండోరా సభను కూడా నిర్వహించాలని నిర్ణయించినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ఇబ్రహీంపట్నం సభకు పోలీసులు అను మతి నిరాకరించారు. ఇక్కడ సభ నిర్వహిస్తే ట్రాఫిక్ సమస్య తలెత్తుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. -
కేసీఆర్ ముఖ్యమంత్రా.. వాసాలమర్రి సర్పంచా?
సాక్షి, హైదరాబాద్: కేసీ ఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రో లేక వాసాలమర్రి గ్రామానికి సర్పంచో చెప్పాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. ఆత్మగౌరవంతో బతకాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు ఉద్యోగాలు కల్పించి ఉంటే సీఎం ఇచ్చే రూ.10 లక్షల అవసరం ఎందుకు ఉండేదని అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన ప్రచార కమిటీ కో కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేనీ, టీపీసీసీ వీవర్స్ సెల్ చైర్మన్ శ్రీనివాస్‌తో కలసి మీడియాతో మాట్లాడుతూ ఆత్మగౌరవం, విద్యా, ఉద్యోగాలు, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అ యిందని అన్నారు. నయా నిజాంలా పాలిస్తు న్న కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తోందని చెప్పారు. హుజూరాబాద్ ఎ న్నికల కోసమే కేసీఆర్, దళితబంధు డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో టీపీసీసీ వీవర్స్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు తేలకముందే మున్సిపోల్స్‌కు షెడ్యూలా?
సాక్షి, హైదరాబాద్: వార్డుల రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా ఖరారు చేయకుండానే పురపాలిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై టీపీసీసీ కోర్‌కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణకు ముందు చేయాల్సిన ప్రక్రియను పూర్తి చేయకుండానే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడాన్ని తప్పుపట్టింది. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కోర్ కమిటీ భేటీ అయింది. ఇందులో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జెట్టి కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస్‌కృష్ణన్, సంపత్, వంశీచందర్‌రెడ్డి పాల్గొన్నారు. కనీసం వారమైనా ఇవ్వాల్సింది.. భేటీలో భాగంగా ఈనెల 28న పార్టీ వ్యవస్థాపక దినోత్సవ నిర్వహణ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ, మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేత లు చర్చించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించిన నేతలు ఎన్నికల సంఘం తీరును ఆక్షేపించారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వా త అభ్యర్థులను ఎంపిక చేసుకుని, వారు నామినేషన్ దాఖలుకు వీలుగా అన్ని పత్రాలు సిద్ధం చేసుకునేందుకు కనీసం వారం సమయం కావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఒక్కరోజు మాత్రమే గడువు ఇవ్వడం సరైంది కాదని, దీనిపై హైకో ర్టుకు వెళ్లాలని టీపీసీసీ నేతలు నిర్ణయించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపేయాలని అడగటం లేదని, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం తగిన సమయం ఇవ్వాలని మాత్రమే కోర్టును కోరాలని అభిప్రాయపడ్డారు. పార్టీ పరంగా మున్సిపల్ ఎన్నికల సమాయత్తంపై కూడా నేతలు చర్చించారు. స్థానికంగా అవసరమైన స్థానాల్లో భావసారూప్య పార్టీలతో పొత్తు పెట్టుకునే అధికారం స్థానిక నాయకత్వానికే ఇవ్వాలని కోర్‌కమిటీ నిర్ణయించింది. డీజీపీని అడిగితే డీసీపీ స్పందిస్తారా? నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వాలని తాము డీజీపీని కోరితే స్థానిక డీసీపీ స్పందించి ర్యాలీకి అనుమతి లేదనడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరసన ర్యాలీ నిర్వహించి తీరాల్సిందేనని కోర్‌కమిటీ నిర్ణయించింది. వేదిక పంచుకునేది లేదు.. ఇక నిజామాబాద్‌లో యునైటెడ్ ముస్లిం ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 27న ఎన్ఆర్సీకి వ్యతిరేకం గా నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొనడంపై కూడా కోర్‌కమిటీ సమావేశంలో చర్చించా రు. ఈ సమావేశానికి హాజరు కావాలని ఎంఐ ఎం అధినేత అసదుద్దీన్ తనకు ఫోన్ చేశారని టీపీసీసీ కోశాధికారి గూడూరు దృష్టికి తెచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్లు పాల్గొనే ఏ వేదికను కాంగ్రె స్ పంచుకునేది లేదన్నారు. కోర్‌కమిటీ సమావేశం అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలసి ఈనెల 28న తాము నిర్వహించనున్న నిరసన ర్యాలీకి అనుమతినివ్వాలని కోరారు. -
త్వరలో టీపీసీసీ కార్యవర్గం!
ఈ నెల 22 లేదా 23న ప్రకటన సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ కార్యవర్గానికి ఏఐసీసీ ఆమోదం లభించింది. ఈ నెల 22 లేదా 23న కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వీటితోపాటు దాదాపు 40 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను కూడా మార్చే అవకాశాలున్నాయి. నియోజకవర్గాల్లో పోటీచేసి ఓడిపోయినవారే ప్రస్తుతం వాటికి ఇన్చార్జిలుగా ఉన్నారు. సుమారు 40 మంది ఇన్చార్జిలు పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీకి నివేదికలు అందినట్టుగా తెలిసింది. దీంతో వీరిని ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. టీపీసీసీలో ఇప్పటిదాకా ఉన్న ఉపాధ్యక్షులు, ప్రధా న కార్యదర్శులు, అధికార ప్రతినిధుల సంఖ్యను ఏఐసీసీ పది శాతానికి పరిమితం చేసి ఆమోదించినట్టుగా తెలుస్తోంది. వంద మంది కార్యదర్శులుం డగా ఆ సంఖ్య 10కి పరిమితమైనట్టుగా సమాచారం. పార్టీ ముఖ్య నేతలు అందించిన సమాచారం ప్రకారం.. 10 మంది ఉపాధ్యక్షులు, 12 మంది అధికార ప్రతినిధులు, 10 మంది ప్రధాన కార్యదర్శులు, 10 మంది కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఉండే అవకాశముంది. ఈ జాబితాలో సగానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారు. పదవులను అలంకారప్రాయంగా వాడుకునే వారికి కాక పనిచేయడానికి ఆసక్తి, సమర్థత, అంకితభావం ఉన్నవారికే అవకాశం కల్పించినట్టుగా టీపీసీసీ ముఖ్యుడొకరు వెల్లడించారు. పని విభజన తర్వాత బాధ్యతలు పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు పని విభజన చేసి బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. ఒక్కో నాయకుడికి ఐదారు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. పార్టీ నిర్మాణం, కార్యక్రమాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు, నాయకుల వ్యక్తిగత పనితీరుపై ఎప్పటికప్పుడు టీపీసీసీకి నివేదించాల్సిన బాధ్యతలను అప్పగించనున్నారు. అధికార ప్రతినిధులకు కూడా జాతీయ, రాష్ట్ర అంశాలు, మీడియా వ్యవహారాలు, పార్టీ వైఖరిపై శిక్షణా శిబిరాలు వంటి వాటిలో పని విభజన చేయనున్నారు. ఇక పార్టీ కార్యక్రమాలతో అంటీముట్టనట్టుగా ఉంటున్న నియోజకవర్గ ఇన్చార్జిలను తప్పించనున్నారు. ఆ నియోజకవర్గాలకు కొత్తవారిని నియమించడమా, ఐదారుగురు నాయకులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడమా అన్నది త ర్వాత నిర్ణయించనున్నారు. ఈ మధ్య కొందరు నాయకులు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, అలాంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అధికార టీఆర్ఎస్కు చెందిన ఒక పత్రికలో కాంగ్రెస్ విధానానికి వ్యతిరేకంగా ఆర్టికల్ రాసిన ఒక అధికార ప్రతినిధికి షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్టుగా తెలిసింది. -
30 మందికి మించకుండా కార్యవర్గం
టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ కార్యవర్గాన్ని 30 మందికి మించకుండా ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గం అంతా కలిపి 30 లోపు ఉండేలా చూస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ముసాయిదా జాబితా కూడా సిద్ధమైందని సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో చెప్పారు. ప్రభుత్వంపై పోరాటం, ఇతర కార్యక్రమాల వల్ల కార్యవర్గం ఏర్పాటులో జాప్యం జరిగిందని, త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ఏఐసీసీలో బాధ్యతల కోసం టీపీసీసీ నుంచి జాబితాను అడిగారని ఉత్తమ్ వెల్లడించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి 8 మంది పార్టీ నేతలు ఆసక్తితో ఉన్నారని, వారి బలాబలాలపై సర్వే జరుగుతోందన్నారు. భట్టి విక్రమార్క వరంగల్ టికెట్‌ను అడగడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మాజీ ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య అభ్యర్థిత్వంపైనా చర్చ జరగలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 17న కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. 18 నుంచి 30 వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో టీపీసీసీ నేతలు పాదయాత్రలు చేస్తారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీనికి నిరసనగా నియోజకవర్గ కేంద్రాల్లో 4న ధర్నాలను నిర్వహిస్తున్నామన్నారు. కాగా, సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి ..ఉత్తమ్‌తో భేటీ అయ్యారు. నాటక ప్రదర్శనకు ఆహ్వానించడానికే ఆయనను కలిశానని చెప్పారు. ఆందోళనలకు టీ పీసీసీ పిలుపు లోక్‌సభలో తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ టీ పీసీసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేంద్రం విధానాలను ఎండగట్టేలా మంగళవారం దీక్షలు, ధర్నాలు చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించింది.