సాక్షి,హైదరాబాద్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షో కాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ నెల 12లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కుల గణాంక నివేదికను కాల్చివేయడంపై పార్టీ కార్యకర్తలు, ఓబీసీ సంఘాల నుండి అనేక ఫిర్యాదులు, అభ్యంతరాలు అందాయి. మీరు కుల గణన సర్వేపై అభ్యంతరకర భాషను ఉపయోగించారు. కులగణన సర్వే రాహుల్ గాంధీ ఆలోచన. తెలంగాణ రాష్ట్రం కేవలం 50 రోజుల్లో కుల గణాంకాన్ని పూర్తిచేసి చరిత్రలో నిలిచింది. ఈ గణాంకాలు 56 శాతం జనాభా వెనుకబడిన వర్గాలకు చెందినవారిగా, అందులో 10 శాతం ముస్లిం మైనారిటీలుగా నిర్ధారించాయి.
రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ ఈ కుల గణాంకాలను 50 రోజుల్లో పూర్తి చేయడాన్ని, ఎస్సీలను మూడు వర్గాలుగా వర్గీకరించడాన్ని ప్రశంసించారు. కానీ మీరు పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీగా పార్టీ నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. గౌరవించాల్సిన నియమాలను విస్మరించారు. ఇది పార్టీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. మీకు ఈ షోకాజ్ నోటీసు అందిన తేదీ నుండి ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలి. లేదంటే మీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లకు పంపిన షోకాజు నోటీసుల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment