
హైదరాబాద్: ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలన్నారు మంత్రి సీతక్క. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ అధికారం అనేది వస్తుంది.. పోతుంది. కానీ 140 ఏళ్లుగా దేశానికి పార్టీ సేవలు చేస్తుంది.పార్టీ అనేది తల్లి లాంటిది. తల్లి లేకపోతే పిల్లలు అనాథలు అవుతారు. కాబట్టి క్షేత్ర స్థాయిలో పార్టీ జెండా పండగ కార్యక్రమాలు చేయాలి.
గ్రామ గ్రామాన ప్రభుత్వ కార్యక్రమాలు వివరించాలి. అర్హులకు పథకాలు అందేలా చూడాలి. ప్రజల్లోకి విస్తృతంగా ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకు వెళ్ళాలి. భవిష్యత్ లో పార్టీ బలోపేతం కు ఉపయోగ పడుతుంది. రాహుల్ గాంధీ చరిత్మకమైన భారత్ జోడొ యాత్ర చేశారు. నిర్మాణాత్మకంగా పార్టీ పటిష్టత కోసం పని చేయాలి. మరో వందేళ్లు పార్టీ నిలబడేలా కార్యాచరణ తీసుకోవాలి. పార్టీ లోకి కొందరు వస్తుంటారు పోతుంటారు.. అవేవీ పట్టించుకో వద్దు’ అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.