
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఇచ్చిన షోకాజు నోటీసుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. రాజసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆగస్ట్ 23న బీజేపీ అధిష్టానం షోకాజు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే జైల్లో ఉండటంతో సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని రాజాసింగ్ సతీమణి ఉషాబాయి అప్పట్లో కోరారు. ఈ క్రమంలో బీజేపీ షోకాజు నోటీసుకు రాజాసింగ్ సోమవారం సమాధానం ఇచ్చారు.
బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటానని జాతీయ నాయకత్వానికి రాజసింగ్ లేఖ రాశారు. పార్టీ ఉల్లంఘన కార్యకలాపాలకు తానెప్పుడూ పాల్పడలేదని. పార్టీ లైన్ దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ప్రజలకు, హిందువులకు సేవ చేయటానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్నందునే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్ఎస్‌లు కుట్రపూరితంగా తనపై 100 కేసులు పెట్టాయని తెలిపారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎం మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
చదవండి: రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంట్రాక్టరే: బండి సంజయ్
‘పాతబస్తీలో ఎంఐఎం ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ.. హిందువులను ఇబ్బంది పెడుతున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాను. హిందులను రెచ్చగొట్టేందుకే మునావర్ ఫారుకీ షోను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. మునావర్ ఫారుకీ హిందూ దేవుళ్లను కించపరిచిన విషయాన్నే నేను ప్రస్తావించాను. ఏ మతాన్ని.. ఇతర దేవుళ్ళను కించపరచలేదు.’ అని బీజేపీకి రాసిన లేఖలో రాజాసింగ్ ప్రస్తావించారు.
చదవండి: విధుల నుంచి మాజీ సీఐ నాగేశ్వరరావు తొలగింపు
Comments
Please login to add a commentAdd a comment