shokaz notice
-
బీజేపీ షోకాజ్ నోటీసుకు రాజాసింగ్ సమాధానం.. ఏమన్నారంటే!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఇచ్చిన షోకాజు నోటీసుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. రాజసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆగస్ట్ 23న బీజేపీ అధిష్టానం షోకాజు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే జైల్లో ఉండటంతో సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని రాజాసింగ్ సతీమణి ఉషాబాయి అప్పట్లో కోరారు. ఈ క్రమంలో బీజేపీ షోకాజు నోటీసుకు రాజాసింగ్ సోమవారం సమాధానం ఇచ్చారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటానని జాతీయ నాయకత్వానికి రాజసింగ్ లేఖ రాశారు. పార్టీ ఉల్లంఘన కార్యకలాపాలకు తానెప్పుడూ పాల్పడలేదని. పార్టీ లైన్ దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ప్రజలకు, హిందువులకు సేవ చేయటానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్నందునే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్ఎస్లు కుట్రపూరితంగా తనపై 100 కేసులు పెట్టాయని తెలిపారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎం మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. చదవండి: రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంట్రాక్టరే: బండి సంజయ్ ‘పాతబస్తీలో ఎంఐఎం ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ.. హిందువులను ఇబ్బంది పెడుతున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాను. హిందులను రెచ్చగొట్టేందుకే మునావర్ ఫారుకీ షోను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. మునావర్ ఫారుకీ హిందూ దేవుళ్లను కించపరిచిన విషయాన్నే నేను ప్రస్తావించాను. ఏ మతాన్ని.. ఇతర దేవుళ్ళను కించపరచలేదు.’ అని బీజేపీకి రాసిన లేఖలో రాజాసింగ్ ప్రస్తావించారు. చదవండి: విధుల నుంచి మాజీ సీఐ నాగేశ్వరరావు తొలగింపు -
మమతకు ఈసీ మరో నోటీసు
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలపై రెచ్చగొట్టేలా, అసత్యపూరిత వ్యాఖ్యలు చేశారని ఎన్నికల సంఘం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి గురువారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా భారతీయ శిక్షాస్మృతిని, ఎన్నికల కోడ్‌ను మమతా బెనర్జీ ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని ఈసీ ఆ నోటీసుల్లో పేర్కొంది. శనివారం ఉదయం 11 గంటల్లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని మమతను ఆదేశించింది. ‘ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలను తన వ్యాఖ్యల ద్వారా అసత్యపూరితమైన వ్యాఖ్యలతో, రెచ్చగొట్టేలా, విచక్షణ రహితంగా మమత దూషించారనేందుకు, అవమానించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలతో వారిలో నైతికస్థైర్యం దెబ్బతింటుంది’ అని ఈసీ పేర్కొంది. 1980ల నుంచి ఎన్నికల్లో కేంద్ర బలగాలు విలువైన సేవ చేస్తున్నాయని గుర్తు చేసింది. ఈసీ నోటీసుపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈసీ నోటీసులను పట్టించుకోబోనన్నారు. సీఆర్పీఎఫ్పై తన ఆరోపణలను మరోసారి పునరుద్ఘాటించారు. ‘బీజేపీ కోసం పనిచేయడం ఆపి వేయనంత వరకు సీఆర్పీఎఫ్ తప్పులపై మాట్లాడుతూనే ఉంటాను. వారు ఆ పని ఆపేస్తే వారికి సెల్యూట్ చేస్తాను’ అని స్పష్టం చేశారు. ‘మీ షోకాజ్ నోటీసులను నేను పట్టించుకోను. మీరు బీజేపీ కోసం పనిచేస్తున్నారు. ఎన్నికల రోజున ప్రధాన మంత్రి ప్రచారం చేస్తే మీ దృష్టిలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు కాదా?’ అని ఈసీని ప్రశ్నించారు. జమల్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో శుక్రవారం మమత పాల్గొన్నారు. దాదాపు వారం వ్యవధిలో మమతకు ఈసీ నోటీసులు జారీ చేయడం ఇది రెండో సారి. ముస్లింలను మతపరంగా ఓట్లను అభ్యర్థిస్తున్నారన్న బీజేపీ ఫిర్యాదుపై ఇప్పటికే ఆమెకు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, బీజేపీకే ఓటేయాలని ఓటర్లను, ముఖ్యంగా మహిళలను బెదిరిస్తున్నాయని గత కొన్ని రోజులుగా మమత ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బెంగాల్లో హింసకు అమిత్ షా కుట్ర రాష్ట్రంలో హింసను రాజేసేందుకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా కుట్ర చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. అనైతిక చర్యలకు పాల్పడేలా పోలీసులను ప్రోత్సహిస్తున్నారన్నారు. షాను నియంత్రించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘ఇలాంటి గూండా హోం మంత్రిని నా జీవితంలో చూడలేదు. ఆయన పులి కన్నా ప్రమాదకరం. ఆయనతో మాట్లాడాలంటేనే ప్రజలు భయపడ్తున్నారు. షాను నియంత్రించాలని ప్రధానిని కోరుతున్నా. ఆయన వల్ల బెంగాల్లో అల్లర్లు, హింస చెలరేగే ప్రమాదముంది’ అని మమత ఒక ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. బెంగాల్ మరో గుజరాత్‌లా మారకుండా చూడాలని, బీజేపీకి ఓటు వేయవద్దని ఓటర్లను అభ్యర్ధించారు. -
షోకాజు నోటీసును పరిశీలిస్తున్నాం: నెస్లే
ముంబై: జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని నెస్లే ఇండియా వినియోగదారులకు వెంటనే బదిలీ చేయకుండా అక్రమంగా లాభాలను ఆర్జించిందంటూ లాభాపేక్ష నిరోధక విభాగం (ఎన్ఏఏ) జారీ చేసిన షోకాజు నోటీసును పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రకటించింది. రేట్ల తగ్గింపును వినియోగదారులకు బదిలీ చేయకుండా ప్రయోజనం పొందినందుకు రూ.90 కోట్లు చెల్లించాలని ఎన్ఏఏ ఈ నెల 12న జారీ చేసిన షోకాజు నోటీసులో నెస్లే ఇండియాను ఆదేశించడం గమనార్హం. గ్రాముల్లో చేసిన మార్పులకు సంబంధించిన ఆధారాలను సమర్పించినా గానీ ఈ ఆదేశాలు జారీ చేయడం ఎంతో దురదృష్టకరమని నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ బుధవారం సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ వార్తా సంస్థతో చెప్పారు. షోకాజు నోటీసును పరిశీలించాక అవసరమైతే తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేవారు. ‘‘రూ.2, రూ.5 ఉత్పత్తిపై జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం రూ.0.45, 0.55 పైసల చొప్పున బదిలీ చేయాలి. కాకపోతే కాయిన్లు అందుబాటులో లేవు. మరి ఈ ప్రయోజనాలను ఎలా బదిలీ చేస్తాం? అందుకే ఈ మేర గ్రాములను (బరువును) పెంచడం ద్వారా ప్రయోజనాన్ని బదిలీ చేశాం. అయినా ఈ ఆదేశాలు వెలువడ్డాయి’’ అని ఈ కేసు గురించి నారాయణన్ వివరించారు. -
టీడీపీకి అనుకూలంగా ప్రచారం.. మాజీమంత్రికి నోటీసులు
సాక్షి, అమరావతి: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి చెంగారెడ్డికి ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి ఓటు వేయాలని ఓటర్లను బెదిరింపులకు దిగినందుకు ఈ మేరకు నోటీసులను జారీచేసింది. టీడీపీకి ఓటువేయకపోతే సంగతి తేలుస్తా అని ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగిన ఆయన ఆడియోలు ఇటీవల బయటకు రావడంతో పార్టీ నేతలు ఈ విధంగా స్పందించారు. చెంగారెడ్డితో పాటు ఆయన కుమార్తె ఇందిర కూడా టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయడంతో ఆమెకు కుడా నోటీసులు పంపినట్లు కమిటీ తెలిపింది. పుత్తూరు,నగరి నియోజకవర్గాల్లో నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని తన కను సన్నల్లో నడిపిన రెడ్డివారి చెంగారెడ్డి ఇటీవల కాలంలో టీడీపీ అనుకూలంగా వ్యవహరించడంపై పార్టీ అధిష్టానం ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. కాగా ఎన్నికల్లో తన కుమార్తెకు నగరి టికెట్ కావాలని చెంగారెడ్డి కాంగ్రెస్ పార్టీని కోరిన విషయం తెలిసిందే. అయితే చివరి నిమిషంగా దానికి పార్టీ నిరాకరించింది. దీంతో పార్టీపై చెంగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నాకు తీరని అన్యాయం చేసిందని, చివరికి నా కుమార్తెకు సీటు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నమ్మించి మొండి చెయ్యి చూపించదన్నారు. కాంగ్రెస్ పార్టీ మాకు చేసిన అన్యాయానికి బదులుగా మేము మమ్మల్ని సాయం అడిగిన తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ విజయానికి సహకరించేందుకు నిర్ణయించుకున్నామని ఇటీవల బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
మూడ్రోజుల్లో వివరణ ఇవ్వండి..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం సాధించి టీఆర్ఎస్లోకి వెళుతున్నట్టు ప్రకటించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ గుర్తు పై గెలిచిన తర్వాత అనైతికంగా టీఆర్ఎస్లోకి వెళుతున్నారని వార్తలు వస్తున్నాయని, మీరు పార్టీ మారా రో లేదో మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ కోదండరెడ్డి పేరిట బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటీసులను ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డిలకు పంపినట్టు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. ‘మీరు కాంగ్రెస్ తరఫున గెలి చి అక్రమ మార్గంలో అనైతికంగా, నీతిబాహ్యంగా టీఆర్ఎస్లో చేరారు. మీరు పార్టీ మారుతున్నట్టు పత్రికల్లో కథ నాలు వచ్చాయి. మీరు మాట్లాడినట్టు వీడియో క్లిప్పింగ్‌లున్నాయి. మీరు ఏ విధమైన సిద్ధాంతపరమై న కారణాలు లేకుండానే కేవలం నియోజకవర్గ అభివృద్ధి అనే కారణంతో పార్టీ మారడం ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేసినట్టవుతుంది. మీరు చట్ట సభల్లో చట్టాలు చేసే బాధ్యత గల సభ్యులు. మీరు పార్టీ మారడం దురదృష్టకరం. మీరు పార్టీ మారారా లేదా అనే అంశాలపై 3 రోజుల్లో వివరణ ఇవ్వగలరు. మీ నుంచి ఎలాంటి సమాచారం రాని పక్షంలో మీరు పార్టీ మారినట్టు పరిగణించి చట్టపరంగా తగిన చర్య లు తీసుకుంటాం’ అని నోటీసులో పేర్కొన్నారు. -
శంబాజీకి షోకాజ్ నోటీసులు
సాక్షి, ముంబై : తన తోటలోని మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన హిందుత్వ నేత శంబాజీ బిదేకు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘మీ తోటలోని పళ్లు తిని మగ పిల్లల్ని సంతానంగా పొందిన జంట వివరాలు పేర్లతో సహా వెల్లడించాల్సి ఉంటుంది. మీరు చేసిన వ్యాఖ్యలను నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటూ’ నోటీసులో పేర్కొంది. కాగా రాయ్‌గఢ్‌లో మరాఠాల యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నాసిక్‌లో ర్యాలీ నిర్వహించిన శంబాజీ.. ‘మామిడి పళ్లలో మంచి పోషకాలుంటాయని, తమ తోట మామిడి పళ్లు తిన్న జంటలకు మగ పిల్లలే పుట్టారని’ వ్యాఖ్యానించారు. ‘ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా తల్లికి మినహా ఎవరికి చెప్పలేదు. నాతోటలోని మామిడి పండ్లు తిన్న 150 జంటలకు 180 మంది మగపిల్లలు జన్మించారు. ఎవరికైనా మగపిల్లలు కావాలనిపిస్తే ఈ మామిడి పండ్లు తినండి. సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు కూడా ఈ మామిడి పండు ఉపయోగపడుతోంది.’ అని శాంబాజీ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన న్యాయవాది, సామాజిక వేత్త అబా సింగ్... మూఢనమ్మకాలను ప్రచారం చేస్తోన్న శంబాజీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. -
షోకాజ్‌కు బదులిచ్చిన బాక్సర్లు
న్యూఢిల్లీ: సెలక్షన్ ట్రయల్స్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిన భారత బాక్సర్లు దినేశ్ కుమార్ (91 కేజీ), దిల్బాగ్ సింగ్ (69 కేజీ), ప్రవీణ్ కుమార్ (ప్లస్ 91 కేజీ)లు క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చారు. ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్‌లో రిఫరీలు, కోచ్‌లు రింగయ్యారని, ముడుపులు తీసుకొని అనర్హులను ఎంపిక చేశారని ఈ ముగ్గురు ఆరోపించారు. ఇవి దుమారం రేగడంతో భారత బాక్సింగ్ సమాఖ్య చీఫ్ అభిషేక్ మటోరియా క్రమశిక్షణ కమిటీని నియమించారు. కమిటీ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా... వారు వివరణ లేఖలు ఇచ్చినట్లు మటోరియా తెలిపారు. అయితే 20న జరిగే కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ముగ్గురిలో దినేశ్, ప్రవీణ్‌లు రాజీకొచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఇద్దరు క్షమాపణ కోరుతూ లేఖలిచ్చినట్లు తెలిసింది. అయితే లేఖల్లో క్షమాపణ కోరారో లేదో తనకు తెలియదని మటోరియా చెప్పుకొచ్చారు. -
అధికారులకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు