లక్నో : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న కొద్ది పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ.. హద్దులు దాటుతున్నారు. ఇలా హద్దు దాటిన వారిపై కేంద్రం ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యాన్ని ‘మోదీ కీ సేనా’ అంటూ వ్యాఖ్యానించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. జాగ్రత్తగా మాట్లాడండి.. హద్దులు మీరకండి.. భవిష్యత్తులో మీ ఉచ్ఛారణ పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించండి అంటూ ఈసీ ఆదిత్యనాథ్‌ను హెచ్చరించింది. అంతటితో ఊరుకోక షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.
గత ఆదివారం ఘజియాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కురిపించాడు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి.. జీ అని గౌరవిస్తే.. మోదీ సేన మాత్రం వారి చేత బుల్లెట్లు తినిపించిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన విపక్షాలు యోగిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి. దాంతో ఏప్రిల్ 5లోపు ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ.. ఆదిత్యనాథ్‌ను కోరింది. అయితే ఆయన చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో.. ఆదిత్యనాథ్‌కు హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment