భోపాల్ : బాబ్రీ మసీదు కూల్చివేతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు ఆదివారం ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. డిసెంబర్ 6, 1992లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసంలో మసీదును కూల్చిన బృందంలో తానూ ఉన్నానని, ఈ ఉద్యమంలో పాలుపుంచుకున్నందుకు గర్వపడుతున్నానని శనివారం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
బాబ్రీ విధ్వంసంలో పాల్గొనే అవకాశం తనకు దక్కినందుకు గర్వంగా ఉందని, అలదే ప్రాంతంలో రామ మందిర నిర్మాణం జరిగేలా చూస్తామని ఆ ఇంటర్వ్యూలో సాధ్వి ప్రజ్ఞా సింగ్ చెప్పుకొచ్చారు. భోపాల్ లోక్‌సభ అభ్యర్ధిగా ప్రజ్ఞా సింగ్‌ను బీజేపీ ఖరారు చేసిన అనంతరం ఈసీ ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేయడం ఇది రెండవసారి కావడం గమనార్హం. తనను వేధించిన మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే తాను శపించడం వల్లే ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారని ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఈసీ వివరణ కోరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment