సాక్షి, విశాఖపట్నం: ఐటీ నోటీసులపై చంద్రబాబు నాయుడు సంబంధం లేని సమాధానాలు దాటవేస్తున్నారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు.
రెండు రోజులుగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ షో కాజ్ నోటీసుల గురించి జాతీయ మీడియా కథనాలు ఇస్తున్నాయి. అయినా ఆయన తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వడం లేదు. పైగా పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారు. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఐటీ నోటీసుల ద్వారా స్పష్టమవుతోంది. అలాంటప్పుడు ఐటీ నోటీసులకు ఎందుకు సమాధానం ఇవ్వరు. ప్రజలకు నీతులు చెప్పే చంద్రబాబు.. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలి కదా అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.
చంద్రబాబు రాజకీయమంతా చీకటి చరిత్ర. ఆయన ఎదుగుదల.. ముందు వెనుక ఆస్తుల గురించి జనానికి తెలుసు. బాబు రాజకీయం అంతా కుట్రలు.. కుతంత్రాలే. చంద్రబాబు నేరుగా నాయకుడిగా ఎదగలేదు. వెన్నుపోటు ద్వారానే రాజకీయంగా ఎదిగారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకునిపై ఇన్ని కుంభ కోణాలు లేవు.
నారా వారి పల్లి నుంచి జూబ్లీ హిల్స్ వరకు ఆయనదో అవినీతి సామ్రాజ్యం. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరు. అన్నాహజారే వారసుడినంటూ చెప్పుకునే చంద్ర బాబు.. ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించరు.
బాబు మీరు దొరికి పోయారని మీకు తెలుసు. ఇప్పటి వరకు బయటకు వచ్చింది తీగ.. ఇంక డొంక కదలాలి. ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టిన విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి అంటూ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.
స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్
2020 నుంచి జూన్ వరకు నాలుగు నోటీసులు ఇచ్చారు...సంబంధం లేని వివరణ ఇస్తారు. 46 పేజీల షోకాజ్ నోటీసు ఇస్తే తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదునేను మీ జూరిడిక్షన్ లో లేను అంటారు. ఎంవిపి అనే వ్యక్తి కంపెనీ ల నుంచి అవినీతి సొమ్ము వసూలుకు మీడియేటర్ గా పని చేసినట్టు తేలింది. 2019లో చంద్రబాబుని ఎంవీపిని కలవడం ఆయన పీఏ శ్రీనివాస్ ప్రకారం పని చేయమని చెప్పడం జరిగింది. మొత్తం 118 కోట్లు చంద్రబాబు అందినట్టు నోటీసుల్లో వుంది.
మీ పీఏ శ్రీనివాస్ మీ అక్రమాల గురించి చెబితే నా పేరు లేదంటారు. మీ కొడుకు పేరు కూడా నోటీసులో వుంది. చంద్ర బాబు స్కిల్డ్ క్రిమినల్ .అన్ స్కిల్డ్ పొలిటీషియన్
ఆధాయ పన్నుశాఖ దర్యాప్తులో విషయం బయట పడింది. సీమెన్స్ అనే సంస్థలో ఓ వ్యక్తి ద్వారా రూ. 3,356 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పి ప్రభుత్వ వాటా రూ. 350 కోట్లు మళ్లించారు. యూరో లాటరీ మాదిరిగా సీమెన్స్ పేరిట మోసం చేశారు. ఈ 350 కోట్లు అత్యవసర క్యాబినెట్ ద్వారా మళ్లించారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ పేరిట ..అమరావతి పేరిట ఎన్నో అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు ప్రజా కోర్టులో సమాధానం చెప్పాలి.. అవినీతి బాబు కథ విచారణకు ఈడీ జోక్యం చేసుకోవాలి అని మంత్రి అమర్నాథ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment