ఆత్మకూర్/అమరచింత/వనపర్తి: ఆహారం విషతు ల్యమై.. 60 మంది విద్యా ర్థినులు అనారోగ్యానికి గురికాగా.. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వనపర్తి జిల్లా అమరచింతలోని కేజీబీవీలో గురువారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగితే.. శుక్రవా రం ఉదయం వరకు బాధిత విద్యా ర్థినులకు కనీ సం వైద్యం అందించలేకపోయారు. అమరచింతలోని కేజీబీవీలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం 340 మంది విద్యా ర్థినులు చదువుకుంటున్నారు.
గురువారం హాజరైన 270 మంది విద్యా ర్థినులు రాత్రి 7.30 గంటలకు అన్నం, పప్పు, సాంబార్, వంకాయకూర, మజ్జిగతో భోజనాలు చేశారు. అయితే అర్ధరాత్రి 2 గంటల నుంచి విద్యార్థినులకు కడుపునొప్పి రావడంతో వెంటనే అందుబాటులో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. ఏఎన్‌ఎం, ఇతర సిబ్బంది లేకపోవడంతో.. కోలుకుంటారని ఉదయం వరకు నిరీక్షించారు.
కానీ, ఉదయం విద్యా ర్థినులు హాహాకారాలు చేయడంతో అంబులెన్స్‌లో ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొదట 10 మందితో మొదలైన బాధితుల తరలింపు 50 మందికి చేరుకుంది. అమరచింతలోని డీఎంఆర్ ఆస్పత్రిలో మరో 10 మంది విద్యా ర్థినులను చేరి్పంచారు. ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యానికి వనపర్తి జనరల్ ఆస్పత్రికి తరలించారు.
ఎస్‌వో తొలగింపు.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్
అమరచింత కేజీబీవీలో విద్యా ర్థినులు అస్వస్థతకు గురైన సంఘటనను కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తీవ్రంగా పరిగణించారు. కేజీబీవీ ఎస్‌వో స్వప్నరాణిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ, ఇన్‌చార్జ్ డీఈవో గోవిందరాజులు, జీసీడీవో సుబ్బలక్ష్మికి శుక్రవారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
వంట ఏజెన్సీని తక్షణమే మార్చాలని ఆదేశించారు. కొన్ని రోజులుగా సాయంత్రం విధులకు హాజరు కాకపోవడం.. పరిశీలనకు వెళ్లిన కలెక్టర్‌కు మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నట్లు కనిపించిన ఏఎస్‌డబ్ల్యూవో సేవ్యానాయక్‌ను.. రూరల్ ఎస్‌ఐ నాగన్నతో డ్రంకెన్ టెస్ట్ నిర్వహించి సస్పెండ్ చేశారు. కొన్నిరోజులుగా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న కొత్తకోట ఎస్సీ హాస్టల్ వార్డెన్ సంతో‹Ùను కూడా సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment