![mahindra finance partners with india post payments bank over customer loan - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/19/sfj.jpg.webp?itok=z2C8XZiO)
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ (Mahindra Finance) సర్వీస్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌తో (IPPB) భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా ఇకపై మహీంద్రా కస్టమర్లకు లోన్లు ఈజీగా అందుబాటులో రానున్నాయి.
వీరివురు భాగస్వామ్యంతో ఇకపై.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్యాసింజర్ వాహనాలు, త్రీ-వీలర్, ట్రాక్టర్ , వ్యాపార వాహనాల లోన్ కేటగిరీల కోసం మహీంద్రా ఫైనాన్స్‌కు లీడ్ రిఫరల్ సేవలను అందిస్తుంది. ఇప్పటికే ఉన్న మహీంద్రా ఫైనాన్స్ కస్టమర్‌లకు పోస్టాఫీసులలో నగదు ఈఎంఐ( EMI )డిపాజిట్ సౌకర్యాన్ని కూడా అందించనుంది. ప్రయోగాత్మకంగా ఈ సేవలను మొదటగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్‌లలో అందించనున్నారు. రాబోయే నాలుగు-ఆరు నెలల్లో ఇతర రాష్ట్రాలలో విస్తరించాలని భావిస్తున్నారు. దీంతో, పేమెంట్స్ బ్యాంక్ కూడా తన ఫైనాన్షియల్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో సర్వీసులను విస్తరించాలని భావిస్తోంది.
చదవండి: జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా: ఆ ప్లాన్‌లతో రీచార్జ్, ఈ బెనిఫిట్స్ అన్నీ మీకే!
Comments
Please login to add a commentAdd a comment