కార్గో సేవలను ప్రారంభించిన మహీంద్రా | Mahindra Logistics Launches Edel Services | Sakshi
Sakshi News home page

కార్గో సేవలను ప్రారంభించిన మహీంద్రా

Published Tue, Jan 12 2021 3:32 PM | Last Updated on Tue, Jan 12 2021 5:06 PM

Mahindra Logistics Launches ‘Edel’ Services - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఇంటిగ్రేటెడ్ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థ మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్(ఎంఎల్ఎల్) కొత్తగా కార్గో సేవలను ప్రారంభించింది. "ఈడెల్" పేరుతో కార్గో సేవల రంగంలోకి అడుగుపెట్టింది. ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ తదితర విభాగాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సంస్థ తాజాగా కార్గో రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలిపింది. వినియోగదారుల అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈడెల్ సేవలు దేశంలోని బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, కోల్‌కతా వంటి 6 ప్రధాన నగరాల్లో లభించనున్నట్లు పేర్కొంది. రాబోయే 12 నెలల్లోనే ఈ సేవలను 14 నగరాలకు విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు సంస్థ ఎండీ, సీఈవో రాం ప్రవీన్ స్వామినాథన్ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement