సామాజిక అంశాలపై ఎల్లప్పుడూ స్పందించే ఆనంద్ మహీంద్రా ఈసారి హైదరాబాద్ స్టార్టప్ కంపెనీపై స్పందించారు. హైదరాబాద్ నగరానికికు చెందిన బాస్క్ అసోసియేట్స్ తమ మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోను మొబైల్ కాఫీ షాపుగా మార్చినట్లు మహీంద్రా ఎలక్ట్రిక్ తన ట్విటర్ ఖాతా వేదికగా పోస్టు చేసింది. ఆ పోస్టులో "ఎంటర్ప్రైజింగ్! #Hyderabad, #BaskAssociatesకు చెందిన మా #Mahindra #TreoZor కస్టమర్ తమ 5 #ఎలక్ట్రిక్ వాహనలను మొబైల్ కాఫీ షాపులుగా మార్చారు. #ZeroPollution ఈవి, ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ కాఫీ కప్పులలో ఆర్గానిక్ గా పెరిగిన మొక్కల నుంచి తయారు చేసిన కాఫీని సర్వ్ చేస్తున్నందుకు దన్యవాదలు" అని మహీంద్రా ఎలక్ట్రిక్ ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ట్రియో జోర్ అనేది మహీంద్రా గ్రూప్‌కు చెందిన కార్గో సెగ్మెంట్ కింద వచ్చిన ఎలక్ట్రిక్ ఆటో. మహీంద్రా ట్రియో జోర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.3.15 లక్షలు. ఇది 550 కిలోగ్రాముల వరకు పేలోడ్ మోసుకెళ్లగలదు. ఇందులో 48వీ బ్యాటరీ ప్యాక్, జిపిఎస్ మానిటరింగ్, ఎకానమీ & బూస్ట్ మోడ్ వంటి రెండు మోడ్స్ ఉన్నాయి. ఇది 8 కెడబ్ల్యు పీక్ పవర్, 42ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త మహీంద్రా ట్రెయో ఎలక్ట్రిక్ ఆటో భారతదేశంలో పూర్తిగా డిజైన్ చేసి అభివృద్ధి చేశారు. 55 కిలోమీటర్ల వేగంతో ఉత్తమ-ఇన్-క్లాస్ పనితీరును అందిస్తుంది. కేవలం 2.3 సెకన్లలో 0-20 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్త మహీంద్రా ట్రెయో సంవత్సరానికి 45,000 వరకు ఇంధన ఖర్చు ఆదా చేస్తుంది.
👍🏽👏🏽👏🏽👏🏽 https://t.co/JKdinZeuqQ
— anand mahindra (@anandmahindra) February 9, 2022
Comments
Please login to add a commentAdd a comment