జీడీపీ వృద్ధిలో చైనాను దాటిన భారత్ | Q4 GDP growth at 7.5%; economy grows at 7.3% in FY15 | Sakshi
Sakshi News home page

జీడీపీ వృద్ధిలో చైనాను దాటిన భారత్

Published Mon, Jun 1 2015 4:02 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

Q4 GDP growth at 7.5%; economy grows at 7.3% in FY15

  25/05/15
 మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కొత్త వేరియంట్

 మహీంద్రా కంపెనీ ఎక్స్‌యూవీ 500 స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పుష్ బటన్ స్టార్ట్, ఆరు విధాలుగా అడ్జెస్ట్ చేసుకునే సీట్లు, తదితర ప్రత్యేకతలున్నాయని మహీంద్రా అండ్ మహీం ద్రా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌లోని ఎంట్రీ లెవల్ వేరియంట్ డబ్ల్యూ4 ధర రూ.11.21 లక్షలని, హై ఎండ్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలని(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వివరించారు.
 
   26/05/15
 8 కోట్ల కుటుంబాలకు సామాజిక భద్రత

 కేంద్రం ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన సామాజిక భద్రత పథకాల్లో ఇప్పటిదాకా సుమారు 8 కోట్ల కుటుంబాలు చేరినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలి పారు. దేశవ్యాప్తంగా 25 కోట్ల కుటుంబాలు ఉండగా.. గడచిన 10-12 రోజుల్లో 7.5-8 కోట్ల కుటుంబాలు జీవిత బీమా, ప్రమాద బీమా పథకాలు తీసుకున్నాయని ఆయన వివరించారు. సంపన్న దేశాల తరహాలో పేద ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
 
 25/05/15
 స్నాప్‌డీల్ చేతికి మార్ట్‌మోబీ

 దేశంలోని ఈ-కామర్స్ కంపెనీల్లో ఒకటైన స్నాప్‌డీల్.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ మార్ట్‌మోబీ.కామ్‌ను కొనుగో లు చేసింది. ఈ కొనుగోలుకు ఎంత ధర చెల్లించిందనేది మాత్రం 2 సంస్థలూ వెల్లడించలేదు. ప్రస్తుతానికి ధర చెప్పలేమని మార్ట్‌మోబీ వ్యవస్థాపకుడైన సత్య కృష్ణ గన్ని చెప్పారు. ఎం-కామర్స్ (మొబైల్ ఫోన్ల ద్వారా వ్యాపారం) చేస్తున్న సంస్థలకు వెబ్‌సైట్లు, యాప్‌లను ఈ సంస్థ తయారు చేస్తుంది. ఇప్పటికే యూఎస్, యూకే, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, దక్షిణాఫ్రికా, హాంకాంగ్, సింగపూర్ వంటి 20 దేశాలకు చెందిన సంస్థలకిది వెబ్‌సైట్లు, యాప్‌లు తయారు చేసింది.
 
 25/05/15
 ఐసీఐసీఐ బ్యాంకు వాయిస్ పాస్‌వర్డ్

 ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వాయిస్ ఆధారిత సేవలను ప్రవేశపెట్టింది. దీంతో కాల్ సెంటర్ ద్వారా ఫోన్ బ్యాం కింగ్ లావాదేవీలు జరిపేటప్పుడు  పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఖాతాదారుల వాయిసే పాస్‌వర్డ్‌గా ఉపయోగపడుతుంది. ఇందుకోసం, కస్టమర్ల వాయిస్ ప్రింట్‌ను బ్యాంకు ముందుగా సేకరిస్తుంది. బ్యాంకులో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ నుంచి వారెప్పుడు కాల్ చేసినా.. వాయిస్ ప్రింట్‌తో సరిపోల్చి చూసుకుని తదుపరి లావాదేవీలకు అనుమతినిస్తుంది.
 
   26/05/15
 విశాఖలో వాల్‌మార్ట్ స్టోర్

 అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్ ఏపీలోని విశాఖపట్నం, పంజాబ్‌లోని లూధియానల్లో 2 హోల్‌సేల్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. తమ బృందం స్టోర్ల ఏర్పాటు కోసం కావాల్సిన అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకునే పనిలో ఉందని వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్ క్రిష్ అయ్యర్ తెలిపారు.
 
   26/05/15
 ఆన్‌లైన్ సేవలపై పన్నుల మోత

 ఈ-కామర్స్ సర్వీసుల విషయంలో ప్రత్యేక ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) కింద పన్ను వసూలు చేసే అంశాన్ని పరిశీలి స్తోంది ఆదాయ పన్ను విభాగం. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా వివిధ సర్వీసులు పొందినందుకుగాను కంపెనీలు చెల్లించే చెల్లిం పుల మీద టీడీఎస్ విధించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
   29/05/15
 బీఎండబ్ల్యూ నుంచి కొత్త ‘6 సిరీస్ గ్రాన్ కూపే’

 జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన ‘6 సిరీస్ గ్రాన్ కూపే’లో మరో అప్‌డేట్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కారు ‘640డి ఎమినెన్స్’, ‘640డి డిజైన్’ అనే రెండు వేరియంట్లలో లభించనుంది. వీటి ధరలు (ఢిల్లీ ఎక్స్‌షోరూం) వరుసగా రూ.1.14 కోట్లు, రూ.1.21 కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది 15 మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ తెలిపారు.
 
   29/05/15
 ఆన్‌లైన్‌లోనూ లోన్ దరఖాస్తు

 రుణాలకు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా దాఖలు చేసుకునే వీలు కల్పించింది ఎస్‌బీఐ. ఈ మేరకు ఒక అప్లికేషన్‌ను బ్యాంక్ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ప్రారంభించారు. ఈ ఆన్‌లైన్ సొల్యూషన్ ద్వారా  కస్టమర్లు గృహ, కారు, విద్య, వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు.
 
   29/05/15
 భారత వృద్ధి రేటు 7.5 శాతం

 వృద్ధిరేటులో చైనాను అధిగమించాం. గడచిన ఆర్థిక సంవత్సరం (2014-15, ఏప్రిల్-మార్చి) చివరి త్రైమాసికం జనవరి-మార్చి మధ్య భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.5%గా నమోదయ్యింది. ఇదే త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 7%. తయారీ, సేవల రంగాల పనితీరు దీనికి ప్రధాన కారణం. అయితే వ్యవసాయ రంగం మాత్రం నిరాశాజనకమైన ఫలితాలను అందించింది.  కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేసిన లెక్కల ప్రకారం మార్చి త్రైమాసికంలో తయారీ రంగం 8.4% వృద్ధిని సాధించింది. వ్యవసాయ రంగం మాత్రం కేవలం 1.4% వృద్ధినే నమోదు చేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement