ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా తన థార్ ఎస్యూవీ ధరలను గణనీయంగా పెంచింది. తాజా ధరల పెంపు తర్వాత, భారతదేశంలో మహీంద్రా థార్ ఎస్యూవీ చాలా ఖరీదైనవిగా మారింది. 2021లో కంపెనీ తన కార్ల ధరలను పెంచడం ఇది మూడవసారి. తాజాగా పెంచిన ధరలు జూలై నుంచే అమలులోకి రానున్నాయి. స్వదేశీ ఆటోమేకర్ ప్రముఖ ఆఫ్ రోడర్ మహీంద్రా థార్ 2020లో ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ధర భారీగా పెరిగింది. మహీంద్రా థార్ ధరలు వేరియంట్ బట్టి సుమారు రూ.42,300 నుంచి రూ.1,02,000కు పెరిగాయి. ధర పెరిగినా కూడా థార్ పాపులారిటీ ఏ మాత్రం తగ్గడం లేదు.
ముఖ్యంగా సాఫ్ట్‌టాప్, కన్వర్టబుల్ అండ్ హార్డ్టాప్తో థార్ బాడీ స్టయిల్ ఎంతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. లుక్స్‌తో పాటు పవర్ఫుల్ ఇంజిన్ కూడా ఆకర్షిస్తోంది. థార్ మోడల్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో వస్తుంది. 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్.. గరిష్ఠంగా 130 పీఎస్ పవర్, 320ఎన్ఎం పీక్ టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అదే 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 150 పీఎస్ గరిష్ఠ పవర్‌ను 320 ఎన్ఎం పీక్ టార్క్యూను జెనరేట్ చేస్తుంది. ఈ రెండు ఇంజిన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మ్యానువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మహీంద్రా థార్ ధర మోడళ్లను బట్టి రూ.15.13 (ఢిల్లీలో ఆన్‌రోడ్ ధరలు) నుంచి రూ.18.19 లక్షల మధ్య ఉంది. వీటితో పాటు మహీంద్రా ఎస్యూవీ 500, మహీంద్రా ఎస్యూవీ కేయువీ 100, మహీంద్రా కేయువీ 100 నెక్స్ట్ మోడల్స్ ధరలను కూడా పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment