AP: 2 నెలల్లో 2వేల ఐటీ ఉద్యోగాలు | Jobs In IT Companies In AP | Sakshi
Sakshi News home page

AP: 2 నెలల్లో 2వేల ఐటీ ఉద్యోగాలు

Published Sun, May 7 2023 9:56 AM | Last Updated on Sun, May 7 2023 10:33 AM

Jobs In IT Companies In AP - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, అమరావతి: ఐటీ దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖపట్నానికి విస్తరిస్తుండటంతో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్న ఇన్ఫోసిస్‌తో పాటు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ (బీఈఎల్‌) సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, అమెజాన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, రాండ్‌శాండ్, టెక్నో­టాస్క్, భారీగా విస్తరిస్తున్న టెక్‌ మహీంద్రా, డబ్ల్యూఏఎన్‌ఎస్‌ వంటి కంపెనీలు పెద్ద ఎత్తున నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ఎదురుచూస్తున్నాయి.

విశాఖలో ఉన్న ఐటీ కంపెనీలకు వచ్చే రెండు నెలల్లో కనీసం రెండు వేల మంది ఐటీ నిపుణులు అవసరమవుతారని ఇన్ఫర్మేషన్‌ టెక్నా­లజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(ఐటాప్‌) అంచనా వేసింది. విశాఖలోని ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ద్వారా శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తికాగానే ఉపాధి కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకోసం రెండు నెలల్లో కనీసం రెండు వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో పలు ఐటీ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడాని­కి ముందుకువచ్చాయని, ఈ పెట్టుబడులను తక్షణం వాస్తవ రూపంలోకి తీసుకురావడంతో పా­టు ప్రస్తుత ఐటీ కంపెనీల అవసరాలను తీర్చడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అదానీ డేటా సెంటర్‌ పనులు ప్రారంభించగా, త్వరలో మిగిలిన కంపెనీలు కూడా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇది కూడా చదవండి: మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. ఏపీ ప్రభుత్వ హెల్ప్ లైన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement