సెల్‌ఫోన్లు తెచ్చిందీ నేనే
నంద్యాల, చిత్తూరుల్లో చంద్రబాబు
బొమ్మలసత్రం/సాక్షి, చిత్తూరు: హైదరాబాద్ అభివృద్ధికి తానే కారణమని.. అందువల్లే ఐటీ కంపెనీలు డబ్బులు సంపాదిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రధాని వాజ్‌పేయిని ఒప్పించి అద్దంలాంటి రహదారులు వేయించానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు శనివారం నంద్యాల, చిత్తూరుల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ్ముళ్లు సెల్‌ఫోన్ వాడుతున్నారంటే దానికి కారణం తానేనన్నారు. తెలుగు తమ్ముళ్లు నష్టపోతారని అమరావతిని రాజధానిగా ప్లాన్ చేశానన్నారు. హైదరాబాద్ కంటే అమరావతిని బెస్ట్ సిటీగా మార్చాలని భావించానని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఆడవాళ్లు ఉద్యోగాలకెళ్తే మగవాళ్లు వంట చేసే రోజులు వస్తాయన్నారు. పోలవరం 72 శాతం పూర్తి చేసి.. ఆ నీటిని బనకచర్లకు అనుసంధానం చేయాలని చూశానన్నారు. తన చివరి శ్వాస ఉన్నంతవరకు పేదవాళ్ల అభివృద్ధి కోసమే పనిచేస్తానని తెలిపారు. రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చానన్నారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి రెండింతలు అభివృద్ధి చేశానని వెల్లడించారు. కోవిడ్ సమయంలో కూడా వర్చువల్ సమావేశాలు పెట్టి ప్రజల కోసం పనిచేశానన్నారు. కాగా, నంద్యాలలో చంద్రబాబు సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఆయన మాట్లాడుతున్నప్పుడే కార్యకర్తలు వెనుదిరిగారు.
చంద్రబాబు రోడ్ షోలో డిగ్రీ విద్యార్థి మృతి
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో శుక్రవారం చంద్రబాబు నిర్వహించిన రోడ్డు షోలో అపశ్రుతి చోటు చేసుకుంది. చంద్రబాబు కాన్వాయ్‌లోని ఒక వాహనం ఫుట్‌పాత్‌పై నిలబడి ఉన్న డిగ్రీ విద్యార్థి కాట్రగడ్డ సాయికృష్ణ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కిందపడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన అతడిని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేరి్పంచారు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కాట్రగడ్డ సాయికృష్ణను మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన విద్యారి్థగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment