సాక్షి, న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో పూర్తిస్థాయి లాజిస్టిక్స్ సేవలను పొందేందుకుగాను మహీంద్రా లాజిస్టిక్స్ (ఎంఎల్‌ఎల్)తో బజాజ్ ఎలక్ట్రికల్స్ (బెల్), ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎండ్ టు ఎండ్ రీడిజైన్ సహా పూర్తిస్థాయి లాజిస్టిక్స్ సేవల కోసం ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టుపై రెండు కంపెనీలూ సంతకాలు చేశాయి. దేశీ పరిశ్రమలోనే అత్యున్నత లాజిస్టిక్స్ సర్వీసులను మహీంద్రా లాజిస్టిక్స్ అందించనున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ పేర్కొంది. (గుడ్ న్యూస్ : 1000 ఇంజీనీర్ ఉద్యోగాలు)
ఐదేళ్లలో డీల్ విలువ రూ. 1,000 కోట్లకుపైగా చేరవచ్చని అంచనా వేసింది. తద్వారా ఏడాదికి 25 శాతానికిపైగా రవాణా సంబంధ వ్యయాలను ఆదా చేయనున్నట్లు తెలియ జేసింది. డీల్‌లో భాగంగా బజాజ్ ఎలక్ట్రికల్స్ కోసం రీడిజైన్ చేసిన కన్సాలిడేటెడ్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మహీంద్రా లాజిస్టిక్స్ అందించనుంది. తాజా డీల్ ద్వారా తమ లాజిస్టిక్స్ విభాగం భారీ మార్పులకు లోనుకానున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ పొద్దార్ పేర్కొన్నారు. దీంతో పోటీతత్వాన్ని పెంచుకోవడంతోపాటు కస్టమర్లకు సేవలు, లాభదాయకత వంటివి మెరుగుపరచుకోనున్నట్లు తెలియజేశారు. (వినియోగదారులకు హెచ్‌డీఎఫ్‌సీ శుభవార్త)
Comments
Please login to add a commentAdd a comment