bajaj electricals
-
బజాజ్ ఎలక్ట్రికల్స్ సీఈవో రాజీనామా
బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనూజ్ పొద్దార్ తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 30న ఆయన పదవి నుంచి వైదొలగుతారని కంపెనీ మీడియా ప్రకటనలో వెల్లడించింది.పరివర్తన కాలంలో అనూజ్ బాధ్యతలను కంపెనీ ఛైర్మన్ శేఖర్ బజాజ్ నిర్వర్తించనున్నారు. 2022 మార్చిలో మొదటిసారిగా బజాజ్ ఎలక్ట్రికల్స్‌ను నికర రుణ రహితంగా మార్చడంలో కృషి చేసిన పొద్దార్, కంపెనీని సవాలుతో కూడిన దశలో నడిపించడం, దాని కార్యకలాపాలను పునర్నిర్మించడంలో ఘనత పొందారు.పొద్దార్ నాయకత్వంలో, బజాజ్ ఎలక్ట్రికల్స్ తన ఫ్లాగ్షిప్ బ్రాండ్ 'బాజాజ్'ని పునరుద్ధరించింది, 'హౌస్ ఆఫ్ బ్రాండ్స్' నిర్మాణాన్ని రూపొందించింది, 'మార్ఫీ రిచర్డ్స్' బ్రాండ్ కోసం దీర్ఘకాలిక లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకం చేసింది. ఆయన పదవీకాలంలో కంపెనీ పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలను మెరుగుపరిచింది."బోర్డు ఆయన రాజీనామాను ఆమోదించింది. అలాగే గత ఐదున్నర సంవత్సరాలుగా కంపెనీ పరివర్తన, వృద్ధి ప్రయాణాన్ని రూపొందించడంలో అనుజ్ అందించిన అద్భుతమైన సహకారాన్ని గుర్తించింది" అని బజాజ్ ఎలక్ట్రికల్స్ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొన్న కాలంలో పొద్దార్ నాయకత్వాన్ని బజాజ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ శేఖర్ బజాజ్ కొనియాడారు. -
బజాజ్ ఎలక్ట్రికల్స్ లాభం రూ.62 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, ఉపకరణాల తయారీ దిగ్గజం బజాజ్ ఎలక్ట్రికల్స్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.62 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.62.5 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ 6.81 శాతం తగ్గి రూ.1,159 కోట్లుగా ఉంది. కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆదాయం 2.45 శాతం తగ్గి రూ.883 కోట్లు, లైటింగ్ సొల్యూషన్స్ విభాగం 3.73 శాతం క్షీణించి రూ.276 కోట్లు, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ 39.4 శాతం పడిపోయి రూ.67 కోట్లకు వచ్చి చేరింది. ఆర్డర్ బుక్ అక్టోబర్ 1 నాటికి రూ.1,554 కోట్లు ఉందని కంపెనీ వెల్లడించింది. క్రితం ముగింపుతో పోలిస్తే బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు ధర బీఎస్ఈలో మంగళవారం 0.47 శాతం పెరిగి రూ.1,158.55 వద్ద స్థిరపడింది. -
బజాజ్ ఎలక్ట్రికల్స్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈ ఆర్థికసంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 63 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 53 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం పుంజుకుని రూ. 1,302 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 1,244 కోట్లకు చేరా యి. కన్జూమర్ ప్రొడక్టుల విభాగం ఆదాయం 31 శాతం జంప్‌చేసి రూ. 1035 కోట్లను తాకగా.. ఈపీసీ బిజినెస్ 37 శాతం క్షీణించి రూ. 267 కోట్లకు పరిమితమైంది. బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు బీఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 1,092 వద్ద ముగిసింది. -
బజాజ్ ఎలక్ట్రికల్స్, మహీంద్రా లాజిస్టిక్స్ డీల్
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో పూర్తిస్థాయి లాజిస్టిక్స్ సేవలను పొందేందుకుగాను మహీంద్రా లాజిస్టిక్స్ (ఎంఎల్ఎల్)తో బజాజ్ ఎలక్ట్రికల్స్ (బెల్), ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎండ్ టు ఎండ్ రీడిజైన్ సహా పూర్తిస్థాయి లాజిస్టిక్స్ సేవల కోసం ఔట్సోర్సింగ్ కాంట్రాక్టుపై రెండు కంపెనీలూ సంతకాలు చేశాయి. దేశీ పరిశ్రమలోనే అత్యున్నత లాజిస్టిక్స్ సర్వీసులను మహీంద్రా లాజిస్టిక్స్ అందించనున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ పేర్కొంది. (గుడ్ న్యూస్ : 1000 ఇంజీనీర్ ఉద్యోగాలు) ఐదేళ్లలో డీల్ విలువ రూ. 1,000 కోట్లకుపైగా చేరవచ్చని అంచనా వేసింది. తద్వారా ఏడాదికి 25 శాతానికిపైగా రవాణా సంబంధ వ్యయాలను ఆదా చేయనున్నట్లు తెలియ జేసింది. డీల్‌లో భాగంగా బజాజ్ ఎలక్ట్రికల్స్ కోసం రీడిజైన్ చేసిన కన్సాలిడేటెడ్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మహీంద్రా లాజిస్టిక్స్ అందించనుంది. తాజా డీల్ ద్వారా తమ లాజిస్టిక్స్ విభాగం భారీ మార్పులకు లోనుకానున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ పొద్దార్ పేర్కొన్నారు. దీంతో పోటీతత్వాన్ని పెంచుకోవడంతోపాటు కస్టమర్లకు సేవలు, లాభదాయకత వంటివి మెరుగుపరచుకోనున్నట్లు తెలియజేశారు. (వినియోగదారులకు హెచ్డీఎఫ్సీ శుభవార్త) -
బీఏఎస్ఎఫ్- బజాజ్ ఎలక్ట్రికల్స్ జోరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో స్పెషాలిటీ కెమికల్స్ రంగ దిగ్గజం బీఏఎస్ఎఫ్ ఇండియా కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడంతో ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ కంపెనీ బజాజ్ ఎలక్ట్రికల్స్ కౌంటర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బీఏఎస్ఎఫ్ ఇండియా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో బీఏఎస్ఎఫ్ ఇండియా నికర లాభం రూ. 412 కోట్లను అధిగమించింది. గతేడాది(2019-20) క్యూ2లో కేవలం రూ. 2.3 కోట్ల లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 2067 కోట్ల నుంచి రూ. 2,463 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో కన్ స్ట్రక్షన్ కెమికల్స్ బిజినెస్ విక్రయం ద్వారా రూ. 465 కోట్లకుపైగా లాభం ఆర్జించింది. ఫలితాల నేపథ్యలో ప్రస్తుతం బీఏఎస్ఎఫ్ షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 1,525 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 15 శాతంపైగా ర్యాలీ చేసింది. రూ. 1,557ను అధిగమించింది. బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో బజాజ్ ఎలక్ట్రికల్స్ రూ. 53 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2లో రూ. 36.5 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 11 శాతం పెరిగి రూ. 1,218 కోట్లకు చేరింది. రూ. 73 కోట్ల ఇబిటా ఆర్జించింది. గత క్యూ2లో రూ. 29 కోట్ల పన్నుకు ముందు నష్టం నమోదైంది. ఈ నేపథ్యంలో బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్ చేసి రూ. 510 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 515 వరకూ ఎగసింది. -
నాలుగు రెట్లు పెరిగిన బజాజ్ ఎలక్ట్రికల్స్ లాభం
న్యూఢిల్లీ: బజాజ్ ఎలక్ట్రికల్స్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19)మార్చి క్వార్టర్లో నాలుగు రెట్లు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.7 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.29 కోట్లకు పెరిగిందని బజాజ్ ఎలక్ట్రికల్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,606 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.1,773 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ శేఖర్ బజాజ్ చెప్పారు. మొత్తం వ్యయాలు రూ.1,496 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.1,755 కోట్లకు పెరిగాయని వివరించారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. స్థూల లాభంలో ఎలాంటి వృద్ధి లేదని నిర్వహణ లాభం రూ.38 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.46 కోట్లకు పెరిగిందని వివరించారు. రెట్టింపైన ఏడాది లాభం.... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.84 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రెండు రెట్లు పెరిగి రూ.167 కోట్లకు పెరిగిందని శేఖర్ బజాజ్ చెప్పారు. మొత్తం అమ్మకాలు రూ.4,716 కోట్ల నుంచి 41 శాతం పెరిగి రూ.6,673 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రాజీవ్ బజాజ్‌ను అదనపు డైరెక్టర్‌గా నియమించామని, ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బజాజ్ ఎలక్ట్రికల్స్ షేర్ 2 శాతం నష్టంతో రూ.550 వద్ద ముగిసింది. -
మార్కెట్లోకి బజాజ్ మిక్సర్లు
హైదరాబాద్: కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తయారీ కంపెనీ బజాజ్ ఎలక్ట్రికల్స్ కొత్తశ్రేణి మిక్సర్ గ్రైండర్లను విపణిలోకి విడుదల చేసింది. బజాజ్ స్ట్రోమిక్స్ ఎంజీ, ట్విస్టర్ డీఐఎక్స్ ఎంజీ, మేవ్రిక్ ఎంజీ, ట్విస్టర్ ఫ్రూటీ ఎంజీ, హెక్సాగ్రిడ్ ఎంజీ, డబ్ల్యూఎక్స్1 వెట్ గ్రైండర్లను ఏపీ, తెలంగాణ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకేసారి 6 ఉత్పత్తులను విడుదల చేయడం తొలిసారని.. మిక్సర్ గ్రైండర్ల మార్కెట్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 40 శాతం వరకుంటుందని కంట్రీ హెడ్ అతుల్ శర్మ తెలిపారు. అనవసర పాలసీలు అమ్మితే కఠిన చర్యలు: భారతీ ఆక్సా హైదరాబాద్: తప్పుడు కాల్స్‌తో వినియోగదారులను తప్పుదోవ పట్టించి అనవసర ఉత్పత్తులు అంటగట్టే చర్యలకు వ్యతిరేకంగా జీవిత బీమా సంస్థ భారతీ ఆక్సా లైఫ్ పలు చర్యలు తీసుకుంటోంది. దేశీయ బీమా రంగానికి ఈ తరహా కాల్స్ పెద్ద సమస్యగా మారాయని భారతీ ఆక్సాలైఫ్ ఎండీ, సీఈవో వికాస్‌సేత్ తెలిపారు. బాధ్యతగల బీమా కంపెనీగా ఈ తరహా అనైతిక చర్యల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, తమ విక్రయ బృందాలు కస్టమర్లకు అన్ని వివరాలు తెలియజేసి సరైన పాలసీ తీసుకునే విషయంలో అవగాహన కల్పిస్తారని చెప్పారు. 6జీబీ, 128 జీబీల్లో నోకియా 8.1 హైదరాబాద్: ఇప్పుడు నోకియా 8.1 స్మార్ట్ ఫోన్లు 6 బీజీ, 128 జీబీ ర్యామ్లల్లో కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని అన్ని ప్రముఖ మొబైల్ రిటైల్ స్టోర్లతో పాటూ అమెజాన్‌లో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ధర రూ.29,999 -
ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత
ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త, బజాజ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ శేఖర్ బజాజ్ కొడుకు అనంత్ బజాజ్(41) కన్నుమూశారు. చిన్న వయసులోనే ఆయన కార్డియాక్ అరెస్ట్‌కు గురై, నిన్న సాయంత్రం ఆరు గంటలకు ముంబైలో తన తుదిశ్వాస విడిచినట్టు ఎలక్ట్రికల్స్ ఫ్యామిలీ ప్రకటించింది. అనంత్ బజాజ్ అంత్యక్రియలు నేడు ఉదయం 10.30కు కల్బదేవిలోని చందన్వాడి శ్మశానంలో జరుగనున్నట్టు పేర్కొంది. అనంత్ బజాజ్, రెండు నెలల క్రితమే బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ పదవిని అలంకరించడానికి కంటే ముందు, ఆర్గనైజేషన్‌లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను నిర్వర్తించేవారు. 1999లో బజాజ్ ఎలక్ట్రికల్స్‌లో ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్‌గా అనంత్ తన కెరీర్‌ను ప్రారంభించారు. హై-టెక్ అప్లియెన్సస్ అభివృద్ధి చేయడానికి బజాజ్ ఎలక్ట్రికల్స్‌లోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర కీలకం. అదేవిధంగా ముంబైలో డిజిటల్ సెంటర్ ఏర్పాటు చేశారు. అనంత్ ఇండియన్ మెర్చంట్స్ ఛాంబర్లో యంగ్ ఎంటర్‌ప్రిన్యూర్ వింగ్‌కు సభ్యుడు. అదేవిధంగా గ్రీన్‌పీస్ ఆర్గనైజేషన్‌లో కూడా అతను సభ్యుడే. పలు ఇతర కంపెనీల్లో కూడా అనంత్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నారు. -
స్టాక్స్ వ్యూ
ఆదిత్య బిర్లా క్యాపిటల్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ధర: రూ.140, టార్గెట్ ధర: రూ.199 ఎందుకంటే: ఆదిత్య బిర్లా క్యాపిటల్ కంపెనీ జీవిత బీమా, అసెట్ మేనేజ్మెంట్, ప్రైవేట్ ఈక్విటీ, కార్పొరేట్ లెండింగ్, సాధారణ బీమా బ్రోకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, ఈక్విటీ, కరెన్సీ, కమోడిటీ బ్రోకింగ్.ఆన్లైన్ పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, హౌసింగ్ ఫైనాన్స్, పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్, వైద్య బీమా తదితర 13 రంగాల్లో సేవలందిస్తోంది. 1.42 లక్షల మంది ఏజెంట్లు, 12 వేల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వేగంగా వృద్ధి సాధించే ఆర్థిక సేవలనందించడం ద్వారా లాభదాయకత పెంచుకుంటోంది. పటిష్టమైన మాతృసంస్థ కారణంగా, మూలధన నిధులు పుష్కలంగా సమీకరించగలదు. వడ్డీరేట్లు పెరగనుండడం ప్రతికూలమే అయినా, వివిధ రంగాలకు రుణాలివ్వడం, ప్రైసింగ్ పవర్ వల్ల కంపెనీ మార్జిన్లపై ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని భావిస్తున్నాం. అందుబాటు ధరల్లో గృహాలు అందించడానికి కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఈ కంపెనీ హౌసింగ్ ఫైనాన్స్ విభాగానికి ప్రయోజనం కలిగించేదే. పటష్టమైన ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన కంపెనీ కావడం, కంపెనీ రుణాలకు రిస్క్ తక్కువగా ఉండడం, క్రాస్ సెల్లింగ్ కారణంగా అవకాశాలు పెంచుకోగల వీలుండటం సానుకూలాంశాలు. రెండేళ్లలో షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 30% చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో 13%గా ఉన్న రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 17%కి పెరగగలదని భావిస్తున్నాం. ఈ కంపెనీ వ్యాపారాలన్నీ సానుకూల ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉన్నవే. ఆర్థిక మందగమన పరిస్థితులు చోటు చేసుకుంటే అది ఈ కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. బజాజ్ ఎలక్ట్రికల్స్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.537, టార్గెట్ ధర: రూ.650 ఎందుకంటే: బజాజ్ ఎలక్ట్రికల్స్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ప్రాజెక్ట్‌ల అమలు జోరు పెరగడంతో ఈపీసీ విభాగం 44 శాతం వృద్ధి చెందింది. దీంతో కంపెనీ ఆదాయం 27 శాతం పెరిగి రూ.1,606 కోట్లకు ఎగసింది. వినియోగ వస్తువుల ఆదాయం 15 శాతం పెరిగింది. డిమాండ్ పూర్తిగా క్షీణించడంతో సీఎఫ్ఎల్ బిజినెస్‌కు సంబంధించి స్టార్‌లైట్ లైటింగ్లోని రూ.89 కోట్ల పెట్టుబడులకు వన్‌టైమ్ రైట్ ఆఫ్ కారణంగా నికర లాభంపై ప్రభావం పడింది. స్థూల మార్జిన్ తక్కువగా ఉన్నప్పటికీ, కంపెనీ నిర్వహణ మార్జిన్ పటిష్టంగా ఉంది. ఉద్యోగ వ్యయాలు తక్కువగా ఉండటం కలసివచ్చింది. ఈపీసీ సెగ్మెంట్ ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. వీటిల్లో అధిక మార్జిన్లు లభించే ఆర్డర్లు అధికంగా ఉన్నాయి. ఇటీవలనే ఉత్తర ప్రదేశ్‌లో రూ.5,962 కోట్ల గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్ట్‌ను సాధించింది. ఈ విభాగం అమ్మకాలు రెండేళ్లలో 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. వర్షాలు బాగా ఉంటాయనే అంచనాల కారణంగా గ్రామీణ మార్కెట్లు పుంజుకోవడంతో వినియోగ వస్తువుల విభాగం మంచి ఆదాయం సాధిస్తుందని భావిస్తున్నాం. రెండేళల్లో ఈ విభాగం ఆదాయం 14 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని అంచనా. గత ఏడాది డిసెంబర్ నాటికి 1,30,000గా ఉన్న రిటైల్ అవుట్లెట్లను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 1,60,000కు పెంచుకోనుండటం, జీఎస్టీ అమలు తర్వాత అసంఘటిత రంగం నుంచి మార్కెట్ వాటా ఈ కంపెనీకి పెరగనుండటం, పటిష్టమైన డీలర్ల నెట్వర్క్... ఇవన్నీ సానుకూలాంశాలు. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
నీట మునిగిన షాపులు
-
ఎల్ఈడీ లైట్ల ధరలు దిగొస్తున్నాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ దీపాల (లైటింగ్) పరిశ్రమ భారత్‌లో 10-12 శాతం వృద్ధి రేటుతో రూ.3,000 కోట్లకు చేరుకుంది. ఇందులో ఎల్ఈడీ లైటింగ్ వాటా 30% ఉన్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ తెలియజేసింది. పాతవారితో పాటు కొత్త కస్టమర్లు ఎల్ఈడీకి అప్‌గ్రేడ్ అవుతుండడంతో ఈ విభాగం 50% వార్షిక వృద్ధి నమోదు చేస్తోందని కంపెనీ లైటింగ్ బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ ఆర్.సుందరరాజన్ వెల్లడించారు. డాట్ నెక్స్ట్ శ్రేణి లైటింగ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా శుక్రవారమిక్కడ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుతో పాటు సబ్సిడీతో బల్బులను సరఫరా చేస్తుండటం పరిశ్రమకు ఊతమిస్తోందన్నారు. ‘ధరలు దిగివస్తుండటం వల్ల రెండేళ్లలో ఎల్ఈడీ లైట్ల వాటా 80%కి చేరుకుంటుంది. మూడేళ్ల క్రితంతో పోలిస్తే ధరలు 50% పైగా తగ్గాయి. వినియోగం పెరుగుతుండడంతో రానున్న రోజుల్లో మరింత దిగొస్తాయి. వీటితో విద్యుత్ బిల్లు సగం ఆదా చేసుకోవచ్చు’ అని చెప్పారు. ఆన్‌లైన్‌కు ప్రత్యేకంగా.. బజాజ్ సొంత వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో లైట్లతోపాటు పలు ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి కంపెనీలతో రానున్న రోజుల్లో చేతులు కలపనుంది. మున్ముందు ఈ-కామర్స్ కంపెనీల కోసం ప్రత్యేక ఉత్పత్తులను రూపొందించాలన్నది బజాజ్ ఆలోచన. కాగా, ముంబైలో నిర్మిస్తున్న పరిశోధన, అభివృద్ధి కేంద్రం 8-10 నెలల్లో అందుబాటులోకి వస్తుందని సుందరరాజన్ వెల్లడించారు. -
ప్రపంచ మార్కెట్లు క్రాష్
సెన్సెక్స్ 350 పాయింట్లు డౌన్ 26,000 దిగువన ముగింపు 116 పాయింట్లు పతనమైన నిఫ్టీ రెండు నెలల కనిష్టానికి మార్కెట్ సూపర్‌లీడ్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై పెరుగుతున్న అనుమానాలు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. వెరసి ఆసియా నుంచి అమెరికా వరకూ ఇండెక్స్‌లు అమ్మకాలతో దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ సైతం 350 పాయింట్లు పతనమైంది. రెండు నెలల తరువాత మళ్లీ 26,000 పాయింట్ల దిగువకు చేరింది. నిఫ్టీ సైతం 7,750 స్థాయిని కోల్పోయింది! జర్మనీ మాంద్యంలోకి జారడం, యూరప్ దేశాల రుణ సంక్షోభం మళ్లీ తెరమీదకు రావడం, నిరవధికంగా పడుతున్న చమురు ధరలు, చైనా వృద్ధి అంచనాలు తగ్గడం వంటి అంశాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. ఇవి చాలవన్నట్లు ప్రాణాంతక వ్యాధి ఎబోలా అతివేగంగా విస్తరించనుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు షాకిచ్చాయి. దీంతో బుధవారం అమెరికా, యూరప్ మార్కెట్లు భారీగా పతనంకాగా, గురువారం ఆసియా మార్కెట్లు సైతం నీరసించాయి. ఈ బాటలో దేశీయంగానూ అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 25,999 వద్ద ముగిసింది. నిఫ్టీ 116 సైతం పాయింట్లు దిగజారి 7,748 వద్ద నిలిచింది. ఆశించిన స్థాయిలో స్పెయిన్ బాండ్లను విక్రయించలేకపోవడం, గ్రీస్, ఐర్లాండ్, పోర్చుగల్, ఇటలీ వంటి దేశాల రుణ భారం నేపథ్యంలో బాండ్ల ఈల్డ్స్ పెరగడం వంటి అంశాలు తాజాగా సెంటిమెంట్‌ను బలహీనపరచాయని విశ్లేషకులు వివరించారు. తొలుత ఓకే ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల సంకేతాలున్నప్పటికీ తొలుత దేశీ మార్కెట్లు లాభాలతో నిలదొక్కుకున్నాయి. టోకు, రిటైల్ ధరలు తగ్గడం, చమురు ధరలు దిగిరావడం, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీకి సానుకూలత కనిపించడం వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్లు భారీ నష్టాలకులోనుకావడంతో దేశీయంగానూ సెన్సెక్స్, నిఫ్టీ ఉన్నట్టుండి కుదుపునకు లోనయ్యాయి. సమయం గడిచేకొద్దీ అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలు పెరిగాయి. రెండు నెలల కనిష్టంవద్ద మార్కెట్లు ముగిశాయి. ఇతర విశేషాలివీ... * గత మూడు రోజుల్లో రూ. 2,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్ఐఐలు తాజాగా రూ. 1,128 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. దేశీ ఫండ్స్ రూ. 664 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. * బజాజ్ ఎలక్ట్రికల్స్, వీఐపీ, టైటన్, సింఫనీ, బ్లూస్టార్, వర్ల్‌పూల్ 6-3% మధ్య పతనంకావడంతో వినియోగ వస్తు సూచీ అత్యధికంగా 4.3% జారింది. * చైనా నుంచి డిమాండ్ క్షీణిస్తుందన్న అంచనాలు మెటల్ షేర్లను పడగొట్టాయ్. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెసాస్టెరిలైట్, జిందాల్ స్టీల్, టాటా స్టీల్ 5.5-3.5% మధ్య పడ్డాయి. * పవర్ షేర్లలో జీఎంఆర్ ఇన్ఫ్రా, రిలయన్స్ ఇన్ఫ్రా, టొరంట్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, టాటా పవర్, సీఈఎస్సీ 8-3% మధ్య తిరోగమించాయి. * ఆటో షేర్లలో అపోలో టైర్స్, ఎంఅండ్ఎం, భారత్ ఫోర్జ్, మదర్సన్సుమీ, ఎంఆర్ఎఫ్, హీరోమోటో 5-2% మధ్య క్షీణించాయి. -
దేశ వ్యాప్తంగా బజాజ్ వరల్డ్స్
చెన్నై, సాక్షి ప్రతినిధి : బజాజ్ ఎలక్ట్రికల్స్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 75 బజాజ్ వరల్డ్స్ పేరిట షోరూంలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రదీప్ టాండన్ తెలిపారు. చెన్నైలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడుతూ, బజాజ్ ఎలక్ట్రికల్స్‌లోని అన్ని ఉత్పత్తులను ఒకేగూటికి తేవడమే ఈ కొత్త షోరూంల ప్రత్యేకతగా ఆయన చెప్పారు. ఇప్పటికే 66 షోరూంలు ప్రారంభించామన్నారు. ఒక్క లైట్ల విషయంలో మినహా అన్ని గృహోపకరణాల్లో తమ సంస్థ దేశంలోనే *38 వేల కోట్ల టర్నోవర్‌తో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. తమిళనాడు మార్కెట్లో నవంబరు నాటికి 112 కోట్ల టర్నోవర్ సాధించామని, ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి అంటే వచ్చే ఏడాది మార్చికి 200 కోట్లకు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో నూతన పోకడలకు తగ్గట్లుగా అధునాతన ఉత్పత్తులను తయారు చేసేందుకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. భారతీయుల విభిన్నమైన శైలిని అధ్యయనం చేసి గృహోపకరణ ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించామని తెలిపారు.