న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈ ఆర్థికసంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 63 కోట్లకు చేరింది.
గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 53 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం పుంజుకుని రూ. 1,302 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 1,244 కోట్లకు చేరా యి. కన్జూమర్ ప్రొడక్టుల విభాగం ఆదాయం 31 శాతం జంప్‌చేసి రూ. 1035 కోట్లను తాకగా.. ఈపీసీ బిజినెస్ 37 శాతం క్షీణించి రూ. 267 కోట్లకు పరిమితమైంది.
బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు బీఎస్‌ఈలో 1 శాతం నీరసించి రూ. 1,092 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment