
అనంత్ బజాజ్ (ఫైల్ ఫోటో)
ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త, బజాజ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ శేఖర్ బజాజ్ కొడుకు అనంత్ బజాజ్(41) కన్నుమూశారు. చిన్న వయసులోనే ఆయన కార్డియాక్ అరెస్ట్‌కు గురై, నిన్న సాయంత్రం ఆరు గంటలకు ముంబైలో తన తుదిశ్వాస విడిచినట్టు ఎలక్ట్రికల్స్ ఫ్యామిలీ ప్రకటించింది. అనంత్ బజాజ్ అంత్యక్రియలు నేడు ఉదయం 10.30కు కల్బదేవిలోని చందన్వాడి శ్మశానంలో జరుగనున్నట్టు పేర్కొంది.
అనంత్ బజాజ్, రెండు నెలల క్రితమే బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ పదవిని అలంకరించడానికి కంటే ముందు, ఆర్గనైజేషన్‌లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను నిర్వర్తించేవారు. 1999లో బజాజ్ ఎలక్ట్రికల్స్‌లో ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్‌గా అనంత్ తన కెరీర్‌ను ప్రారంభించారు. హై-టెక్ అప్లియెన్సస్ అభివృద్ధి చేయడానికి బజాజ్ ఎలక్ట్రికల్స్‌లోనే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర కీలకం. అదేవిధంగా ముంబైలో డిజిటల్ సెంటర్ ఏర్పాటు చేశారు. అనంత్ ఇండియన్ మెర్చంట్స్ ఛాంబర్‌లో యంగ్ ఎంటర్‌ప్రిన్యూర్ వింగ్‌కు సభ్యుడు. అదేవిధంగా గ్రీన్‌పీస్ ఆర్గనైజేషన్‌లో కూడా అతను సభ్యుడే. పలు ఇతర కంపెనీల్లో కూడా అనంత్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment