Anant Bajaj
-
గాయత్రి డబుల్ ధమాకా
హైదరాబాద్: అనంత్ బజాజ్ స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తనయ పుల్లెల గాయత్రి సత్తా చాటింది. పీజీబీఏలో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. ఆదివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో గాయత్రి (తెలంగాణ) 21–19, 21–16తో తన్వి లాడ్‌పై కేవలం 37 నిమిషాల్లోనే గెలుపొంది కెరీర్లో తొలి సీనియర్ ర్యాంకింగ్ టైటిల్‌ను అందుకుంది. డబుల్స్ టైటిల్‌పోరులో గాయత్రి –రుతుపర్ణ (ఒడిశా) ద్వయం 19–21, 21–14, 21–10తో నాలుగో సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జోడీకి షాకిచ్చి చాంపియన్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్ తుదిపోరులో చిట్టబోయిన రాహుల్ యాదవ్ (తెలంగాణ) 25–23, 14–21, 13–21తో లక్ష్యసేన్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్ కృష్ణ ప్రసాద్ గారగ (ఆంధ్రప్రదేశ్)–ద్రువ్ కపిల(ఎయిరిండియా) ద్వయం 23–21, 21–17తో ఏడో సీడ్ శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్) జంటపై, మిక్స్డ్ డబుల్స్‌లో గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్)–మయూరి యాదవ్ (ఉత్తరప్రదేశ్) జంట 21–19, 13–21, 21–12తో కృష్ణ ప్రసాద్–అశ్విని భట్ (కర్ణాటక) జోడీపై నెగ్గి విజేతలుగా నిలిచాయి. -
ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత
ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త, బజాజ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ శేఖర్ బజాజ్ కొడుకు అనంత్ బజాజ్(41) కన్నుమూశారు. చిన్న వయసులోనే ఆయన కార్డియాక్ అరెస్ట్‌కు గురై, నిన్న సాయంత్రం ఆరు గంటలకు ముంబైలో తన తుదిశ్వాస విడిచినట్టు ఎలక్ట్రికల్స్ ఫ్యామిలీ ప్రకటించింది. అనంత్ బజాజ్ అంత్యక్రియలు నేడు ఉదయం 10.30కు కల్బదేవిలోని చందన్వాడి శ్మశానంలో జరుగనున్నట్టు పేర్కొంది. అనంత్ బజాజ్, రెండు నెలల క్రితమే బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ పదవిని అలంకరించడానికి కంటే ముందు, ఆర్గనైజేషన్‌లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను నిర్వర్తించేవారు. 1999లో బజాజ్ ఎలక్ట్రికల్స్‌లో ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్‌గా అనంత్ తన కెరీర్‌ను ప్రారంభించారు. హై-టెక్ అప్లియెన్సస్ అభివృద్ధి చేయడానికి బజాజ్ ఎలక్ట్రికల్స్‌లోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర కీలకం. అదేవిధంగా ముంబైలో డిజిటల్ సెంటర్ ఏర్పాటు చేశారు. అనంత్ ఇండియన్ మెర్చంట్స్ ఛాంబర్లో యంగ్ ఎంటర్‌ప్రిన్యూర్ వింగ్‌కు సభ్యుడు. అదేవిధంగా గ్రీన్‌పీస్ ఆర్గనైజేషన్‌లో కూడా అతను సభ్యుడే. పలు ఇతర కంపెనీల్లో కూడా అనంత్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నారు.