చెన్నై, సాక్షి ప్రతినిధి :
బజాజ్ ఎలక్ట్రికల్స్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 75 బజాజ్ వరల్డ్స్ పేరిట షోరూంలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రదీప్ టాండన్ తెలిపారు. చెన్నైలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడుతూ, బజాజ్ ఎలక్ట్రికల్స్‌లోని అన్ని ఉత్పత్తులను ఒకేగూటికి తేవడమే ఈ కొత్త షోరూంల ప్రత్యేకతగా ఆయన చెప్పారు. ఇప్పటికే 66 షోరూంలు ప్రారంభించామన్నారు. ఒక్క లైట్ల విషయంలో మినహా అన్ని గృహోపకరణాల్లో తమ సంస్థ దేశంలోనే *38 వేల కోట్ల టర్నోవర్‌తో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు.
తమిళనాడు మార్కెట్‌లో నవంబరు నాటికి 112 కోట్ల టర్నోవర్ సాధించామని, ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి అంటే వచ్చే ఏడాది మార్చికి 200 కోట్లకు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో నూతన పోకడలకు తగ్గట్లుగా అధునాతన ఉత్పత్తులను తయారు చేసేందుకు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. భారతీయుల విభిన్నమైన శైలిని అధ్యయనం చేసి గృహోపకరణ ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించామని తెలిపారు.
దేశ వ్యాప్తంగా బజాజ్ వరల్డ్స్
Published Sat, Dec 21 2013 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement