Rapid
-
కోవిడ్ తర్వాత పెరిగిన పర్యాటకరంగ ఉపాధి!
కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టాక దేశంలో పర్యాటకరంగంలో ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగాయి. 2033 నాటికి అంటే రాబోయే తొమ్మిదేళ్లలో ట్రావెల్ అండ్ టూరిజం రంగంలో దేశంలో 5.82 కోట్ల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. కరోనా సమయంలో అంటే 2020లో పర్యాటక రంగంలో 3.9 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది దేశంలోని మొత్తం ఉపాధిలో 8 శాతం.తాజాగా ఎన్ఎల్బి సర్వీసెస్ నివేదిక ప్రకారం మహమ్మారి నుండి కోలుకున్న తర్వాత పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ఈ రంగం 2023 క్యాలెండర్ సంవత్సరంలో 16 లక్షల అదనపు ఉద్యోగాలను అందించింది. జనవరి 2023 నుండి ప్రయాణ, పర్యాటక రంగంలో రోజువారీ వేతన ఉద్యోగాలు 14 శాతం మేరకు పెరిగాయి. అనువాదకులు, ఫోటోగ్రాఫర్లు, టూర్ గైడ్లకు ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. వచ్చే రెండేళ్లలో పర్యాటక రంగంలో ఉద్యోగాలు 20 శాతం మేరకు పెరుగుతాయని అంచనా.ఎన్ఎల్బి సర్వీసెస్ నివేదికలోని డేటా ప్రకారం పర్యాటక రంగం 2022లో భారతదేశ జీడీపీకి 15.9 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించింది. అదే సమయంలో ఇది విదేశీ మారకద్రవ్యానికి ముఖ్య వనరుగా నిలిచింది. ఎన్ఎల్బి సర్వీసెస్ సీఈఓ సచిన్ అలగ్ మీడియాతో మాట్లాడుతూ పర్యాటకరంగంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణె, కొచ్చి, జైపూర్, అహ్మదాబాద్, చండీగఢ్‌లో ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగాయి.పర్యాటకరంగంలో సేల్స్ లో18 శాతం, బిజినెస్ డెవలప్మెంట్లో 17 శాతం, చెఫ్ విభాగంలో15 శాతం, ట్రావెల్ కన్సల్టెంట్లో 15 శాతం మేరకు ఉపాధి పెరగవచ్చనే అంచనాలున్నాయి. అలాగే టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హోటళ్లు, గైడ్లు , వన్యప్రాణి నిపుణులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి. -
ఢిల్లీ వాసులకు ‘హై స్పీడ్’ ప్రయాణం
‘ప్రయాణానికి తక్కువ సమయం, కుటుంబానికి ఎక్కువ...!’. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రీజనల్ రైల్ సరీ్వస్‌కు సంబంధించిన ఆకర్షణీయమైన నినాదాల్లో ఇదొకటి! ర్యాపిడ్ ఎక్స్‌గా పిలుస్తున్న ఈ తొలి సెమీ హై స్పీడ్ ప్రాంతీయ రైలు దేశ రాజధాని ప్రాంత (ఎన్సీఆర్) వాసులకు అందుబాటులోకి రానుంది. మొత్తం 82 కిలోమీటర్ల మేర చేపట్టిన ఢిల్లీ–గాజియాబాద్–మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) కారిడార్‌లో 17 కి.మీ. ప్రస్తుతం సిద్ధమైంది. సాహిబాబాద్–దుహై స్టేషన్ల మధ్యనున్న ఈ కారిడార్‌ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ర్యాపిడ్ ఎక్స్ రైలుకు నమోభారత్‌గా గురువారం నామకరణం చేశారు. శనివారం నుంచి ఇది ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. కారిడార్‌లో కొత్తగా నిర్మించిన స్టేషన్లలో అందమైన కుడ్యచిత్రాలు, ఆకర్షణీయమైన నినాదాలు అలరిస్తున్నాయి. అంతేనా...! ఈ ర్యాపిడ్ ఎక్స్ హై స్పీడ్ రైల్వే వ్యవస్థ విశేషాలు అన్నీ ఇన్నీ కావు... గంటకు 160 కి.మీ. వేగం! ► ర్యాపిడ్ ఎక్స్ ద్వారా రాజధాని వాసులకు ప్రయాణ సమయం ఏకంగా మూడో వంతు దాకా తగ్గనుంది. ► ప్రయోగాల సందర్భంగానే ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు గంటకు 160 కి.మీ. వేగాన్ని సులువుగా అందుకున్నాయి! ► అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఈ రైళ్ల సొంతం. ► ఒక్కో రైల్లో ఆరు కోచ్‌లుంటాయి. వీటిలో 1,700 మంది ప్రయాణించవచ్చు. ► ప్రతి రైల్లో ఒక మహిళా కోచ్‌తో పాటు వారికి దివ్యాంగులకు, వృద్ధులకు కొన్ని సీట్లు ప్రత్యేకిస్తారు. ► రెండు వరుసల్లో, వరుసకు రెండు చొప్పున సీట్లుంటాయి. నిలబడేందుకు విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది. ► ల్యాప్‌టాప్, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, లగేజీ ర్యాక్‌లు, అభిరుచికి అనుగుణంగా లైటింగ్‌ను మార్చుకునే వెసులుబాటు, సీట్ పుష్ బ్యాక్, కోట్ తగిలించుకునే హుక్, ఫుట్ రెస్ట్, ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సాయపడేందుకు అసిస్టెంట్, స్నాక్స్, డ్రింక్స్ కొనుక్కునేందుకు వెండింగ్ మెషీన్ల వంటివెన్నో ఇందులో ఉన్నాయి. ► ఉదయం ఆరింటి నుంచి రాత్రి 11 దాకా ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. ► డిమాండ్‌ను, అవసరాన్ని బట్టి మున్ముందు ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు నడుపుతారు. ► చార్జీలు స్టాండర్డ్ కోచ్‌లో రూ.20–రూ.40, ప్రీమియం కోచ్‌లో రూ.40–రూ.100. ► ప్రతి స్టేషన్నూ ఆకర్షణీయమైన రంగులతో కూడిన కుడ్య చిత్రాలు, నినాదాలతో ఆకట్టుకునేలా తయారు చేశారు. ళీ ఈ ర్యాపిడ్ ఎక్స్ ప్రాజెక్టును ఢిల్లీ, హరియాణా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతో కలిసి కేంద్రం సంయుక్తంగా చేపట్టింది. ► ఢిల్లీ–గాజియాబాద్–మీరట్ మధ్య 81.15 కి.మీ. ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ 2025 కల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ► ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.30 వేల కోట్లు. ‘ఏఐ’ బ్యాగేజ్ స్కానింగ్ ర్యాపిడ్ ఎక్స్ రైళ్ల ఉద్దేశమే ప్రయాణ సమయం తగ్గించడం. అందుకు అనుగుణంగా కారిడార్‌లోని స్టేషన్లలో బ్యాగేజీ తనిఖీ సమయాన్ని బాగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ ఆధారంగా పని చేసే సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. నియంత్రిత, నిషేధిత వస్తువులుంటే అది వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ► ఇందులో డ్యుయల్ వ్యూతో కూడిన ఎక్స్ రే బ్యాగేజీ తనిఖీ వ్యవస్థ ఉంటుంది. దాంతో బ్యాగేజీ తాలూకు పై, లోపలి భాగాలు స్క్రీన్‌పై విడిగా, స్పష్టంగా కని్పస్తాయి. ► ఈ స్టేషన్లలో తక్షణ స్పందన బృందం, బాంబ్ డిటెక్షన్–డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వంటివాటిని యూపీ పోలీసులు అందుబాటులో ఉంచనున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
టెస్టుకు ముందు పళ్ల రసాలు.. కరోనా రిజల్ట్ తారుమారు?
కరోనా వైరస్, రెండో దఫా లాక్డౌన్ ప్రభావంతో మూతపడ్డ విద్యాసంస్థల్ని.. కొన్ని దేశాలు తెరవాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఇంగ్లండ్‌లో బడికి వెళ్లడం ఇష్టంలేని కొందరు పిల్లలు హుషారుతనం ప్రదర్శిస్తున్నారు. పండ్ల రసాల్ని, కెచప్‌లను ఉపయోగించి కరోనా పాజిటివ్ సర్టిఫికెట్లు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ స్కూల్ యాజమాన్యం.. తల్లిదండ్రులకు పంపిన హెచ్చరిక సందేశం ద్వారా అసలు విషయం బయటపడింది. లండన్: మెర్సెసైడ్‌లోని బెల్లె వాలేలో ఉన్న గేట్‌ఎకర్ స్కూల్ యాజమాన్యం తాజాగా పేరెంట్స్‌కి ఒక మెయిల్ పెట్టింది. ల్యాటెరల్ ఫ్లో టెస్ట్ (ర్యాపిడ్ తరహా టెస్ట్) టైంలో చాలామంది పిల్లలు ఆరెంజ్, కచెప్.. ఇతరత్రా పండ్లరసాలు తాగుతున్నారని, దాంతో స్వాబ్ నమూనాలు మారిపోయి.. ఫలితం తేడా వస్తోందని తెలిపింది. దాని ద్వారా అంతా బాగానే ఉన్న పిల్లలకు కరోనా పాజిటివ్ రిజల్ట్ వస్తోందని, ఇలాంటి తప్పుడు పనులను తాము సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆ మెయిల్లో హెచ్చరించింది. జూన్ 21 సోమవారం నుంచి నిర్వహిస్తున్న టెస్టుల్లో వరుసబెట్టి ఆ స్కూల్ పిల్లలకు పాజిటివ్ రిపోర్టులు వచ్చాయట. ఆ అనుమానంతోనే ఈ మెయిల్ పంపింది స్కూల్. అయితే వాళ్లలో ఎంత మంది ఇలాంటి పనికి పాల్పడ్డారనేది తేలాల్సి ఉంది. అదే టైంలో బ్రిటన్ వ్యాప్తంగా చాలా స్కూళ్లలో స్టూడెంట్స్ ఇలాంటి చేష్టలకు పాల్పడినట్లు రుజువైందని, అందుకే తమ స్కూల్ పిల్లలపై కూడా అనుమానంతోనే ఆ మెయిల్ పంపామని స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. అంతేకాదు ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టులనే తాము నమ్ముతామని పేరెంట్స్‌కి స్పష్టం చేసింది. మరోవైపు పండ్ల రసాలు, ఫిజ్జీలాంటి జ్యూస్‌లతో ఇలాంటి చేష్టలకు పాల్పడుతూ కొందరు టిక్‌టాక్‌లు చేస్తుండడంతో స్టూడెంట్స్పై ప్రభావం పడుతోందని అధికారులు భావిస్తున్నారు. చదవండి: వుహాన్ ల్యాబ్‌కు ఈ ఏడాది నోబెల్!! -
కిట్..హాంఫట్..!
రాష్ట్రంలో ఓ కీలక నేతకు చెందిన మెడికల్ కాలేజీ, దాని అనుబంధ ఆసుపత్రిలో కరోనా చికిత్సలు జరుగుతున్నాయి. తనకున్న పలుకుబడితో ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఆర్టీ–పీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను బెదిరించి తీసుకెళ్తున్నాడు. అలా ఉచితంగా తీసుకెళ్లిన కిట్లతో పరీక్షలు చేస్తూ రూ. 3,500 చొప్పున వసూలు చేస్తున్నాడు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిట్లకు కొరత ఏర్పడింది. ఉన్నతస్థాయిలో ఫిర్యాదు చేయాలంటే ఆసుపత్రి వర్గాలు భయపడుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని ఓ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో రోజుకు కనీసం 50 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తుంటారు. కానీ ఒక్కోసారి 30 పరీక్షలు మాత్రమే చేసి మిగిలిన కిట్లను అక్కడి డాక్టర్ సొంత క్లినిక్‌కు తీసుకెళ్తున్నాడు. టెస్టుల కోసం వచ్చే బాధితులకేమో ఆ రోజు కోటా అయిపోయిందని చెబుతూ రికార్డుల్లో మాత్రం 50 టెస్ట్‌లు చేసినట్లు చూపుతున్నాడు. అలా మిగిలిన 20 కిట్లను తన క్లినిక్‌కు తీసుకెళ్లి ఒక పరీక్షకు రూ. 3 వేల చొప్పున వసూలు చేస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విరివిగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన లక్షల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను కొందరు డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు పక్కదారి పట్టిస్తున్నాయి. సాధారణంగా యాంటిజెన్ కిట్ ధర రూ.500 మాత్రమే ఉంటే, వాటిని తమ సొంత క్లినిక్‌లలో వాడుతూ రూ.3,000–3,500 వసూలు చేస్తూ పరీక్షలు చేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి తన బోధనాసుపత్రిలో టెస్టులు చేసేందుకు బలవంతంగా ఒక జిల్లా ఆసుపత్రి నుంచి యాంటిజెన్ సహా ఆర్టీ–పీసీఆర్, యాంటి జెన్ కిట్లను తీసుకెళ్తుండటంపై ఆ జిల్లాలో దుమారం నెలకొంది. ఆ జిల్లా ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోవాలంటే పలుకుబడి కలిగిన వారితో పైరవీలు చేయించుకోవాల్సిందేనన్న ఫిర్యాదులున్నాయి. ఇళ్లకు తీసుకుపోతున్న వీఐపీలు కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలను కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 1,076 ప్రభుత్వాసుపత్రులు, కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టులకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, లేబొరేటరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కిట్లను అక్కడి సిబ్బందిని ప్రలోభపెట్టి కాజేస్తున్నాయి. ఇక ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే కొందరు డాక్టర్లు కూడా వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. ఇక కొందరు వీఐపీలు, నేతల ఇళ్లలోనూ కిట్లు కనిపిస్తున్నాయి. వారు టెక్నీషియన్లను పిలిపించుకొని టెస్టులు చేయించుకుంటున్నారు. ర్యాపిడ్ పరీక్ష అక్కడికక్కడే చేయడానికి వీలుండటంతో ఇలా ఎవరికివారు యాంటిజెన్ కిట్లను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దొంగ ఓటీపీలు.. దొంగ రిజిస్ట్రేషన్లు ఒక యాంటిజెన్ పరీక్ష చేయాలంటే.. పరీక్షకు వచ్చిన బాధితుడి ఫోన్ నంబర్‌ను సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేయాలి. ఆపై ఆ నంబర్‌కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దాన్ని మళ్లీ ఎంటర్ చేశాకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. అప్పుడు మాత్రమే బాధితుడికి టెస్టు చేయాలి. ఇంత పకడ్బందీ వ్యవస్థను కూడా కొందరు వైద్య సిబ్బంది ధ్వంసం చేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఉదాహరణకు ఎలాంటి సెల్‌ఫోన్ లేని సాధారణ వ్యక్తి వచ్చి టెస్ట్ చేయమంటే, అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం స్థానికంగా ఉండే ఆరోగ్య కార్యకర్త ఫోన్ నంబర్ ఇచ్చే వెసులుబాటు ఉంది. ఈ పరిస్థితిని కిట్లను కొట్టేసేందుకు కొందరు వైద్య సిబ్బంది తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. తద్వారా రికార్డుల్లో అన్ని పరీక్షలు చేసినట్లుగానే ఉంటుంది కానీ కిట్లు మాయమైపోతున్నాయి. -
మళ్లీ కిట్లు పోయాయ్
కాకినాడ క్రైం: కరోనా రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శవంతమైన సేవలను అందిస్తుంటే ఆ సేవలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందకుండా అవినీతిపరులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో కనీస విచక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారు. కరోనా ర్యాపిడ్ కిట్ల వ్యవహారంలో తాజాగా చోటు చేసుకున్న ఉదంతం కలకలం రేపింది. ఇప్పటికే ఓ సారి కరోనా కిట్లు చోరీకి గురికావడం జిల్లాను కుదిపేసింది. దానికి కొనసాగింపుగా ఆదివారం మరో మారు కరోనా ర్యాపిడ్ కిట్లు చోరీకి గురయ్యాయి. కిట్ల చోరీపై డీఎంహెచ్ఓ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలేం జరిగింది? ఆరోగ్యశ్రీ సమన్వయకర్త పర్యవేక్షణలో డీపీఎంయూ ఆదేశాలతో రెగ్యులర్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ డ్రైవర్ వ్యాక్సిన్ వ్యాన్‌తో శనివారం కాకినాడ నుంచి విజయవాడ వెళ్లారు. అక్కడ ఆరోగ్యశ్రీ సీఈవో కార్యాలయం నుంచి కరోనా నిర్థారణకు వినియోగించే ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లను తీసుకొని రాత్రి 10.30 సమయంలో బయల్దేరాడు. ఆదివారం తెల్లవారు జామున కాకినాడ చేరుకున్నాడు. నైట్ డ్యూటీ విధుల్లో ఉన్న హెల్త్ సూపర్వైజర్, హెల్త్ అసిస్టెంట్, డ్రైవర్ కలిసి ఆ కిట్లను అదనపు డీఎంహెచ్ఓ గదికి తరలించి భద్రపరిచారు. ఉదయం కార్యాలయ సిబ్బంది ఆరోగ్యశ్రీ మేనేజర్ సమక్షంలో విజయవాడ నుంచి వచ్చిన 13 కార్టూన్లను తెరిచారు. అప్పుడు అసలు విషయం వెల్లడైంది. అలా తెరిచిన పెట్లలో 50 కిట్లు మాయమైనట్టు గుర్తించారు. వెంటనే సిబ్బంది డీఎంహెచ్ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరికి తెలిపారు. ఎస్కార్ట్ లేకుండానే.... కిట్లను తీసుకొచ్చేందుకు ఆరోగ్యశ్రీ అధికారులు కేవలం డ్రైవర్ని పంపారు. నిబంధనలు అనుసరించి ఎస్కార్ట్‌గా ఓ ల్యాబ్ టెక్నీషియన్ లేదా ఫార్మసిస్టుని పంపాల్సి ఉన్నా ఆ నిబంధనలు ఏవీ పాటించలేదు. వ్యాక్సిన్ వ్యాన్‌తో తానొక్కడినే వెళ్లానని తనతో ఎవరినీ అధికారులు పంపలేదని డ్రైవర్ చెప్పాడు. ఆ విషయాన్ని సంబంధిత అధికారులూ నిర్థారించారు. కిట్ల మాయం వ్యవహారంపై డ్రైవర్‌ను డీఎంహెచ్ఓ డాక్టర్ సుబ్రహ్మణేశ్వరి ప్రశ్నించగా అతడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. కార్టూన్లలో కిట్ల మాయం గురించి తనకేమీ తెలియదన్నాడు. తాను తెచ్చిన 13 కార్టూన్లు తెరిచే ఉన్నాయని, వాటిని మూసి వేస్తూ ఎటువంటి సీలు విజయవాడ సిబ్బంది వేయలేదని చెప్పాడు. ఆ విషయంపై స్పష్టత కోసం డీఎంహెచ్ఓ విజయవాడ కార్యాలయ అధికారులను ఫోనులో వివరణ కోరారు. -
బ్లాక్‌లో ర్యాపిడ్ కిట్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పలుచోట్ల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు బ్లాక్‌లో అమ్ముడవుతున్నాయి. హైదరా బాద్ నుంచే కొన్ని కంపెనీల డీలర్ల ద్వారా క్లినిక్‌లకు, ల్యాబ్‌లకు, చివరకు వ్యక్తి గతంగా కొందరి చేతుల్లోకి చేరుతు న్నాయి. ఆపై వీటిని ‘బ్లాక్’ చేస్తూ, వాస్తవ ధర కంటే రెండింతలకు అమ్ముతూ కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వా స్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడానికి చాలామంది భయపడుతుండటం, ఒకవేళ చేయించుకున్నా ట్రేసింగ్, వైద్య సిబ్బంది హడావుడితో నలుగురికి తెలిస్తే బాగుం డదన్న భావనతో చాలామంది యాంటిజెన్ టెస్టులకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ కిట్లకు డిమాండ్ పెరిగి బ్లాక్ అవుతున్నాయి. ఇది జిల్లా వైద్యాధికారుల దృష్టికొచ్చినా పట్టించు కోవట్లేదనే ఆరోపణలున్నాయి. ర్యాపిడ్ టెస్టులకు ప్రైవేట్‌లో అనుమతే లేదు తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులకు, లేబొరేటరీలకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేసేందుకు అనుమతి లేదు. కేవలం ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేసేందుకే 23 ప్రైవేట్ లేబొరేటరీలకు, కొన్ని ఆసుపత్రులకు అనుమతి ఉంది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో 16 చోట్ల ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. అయితే ఈ పరీక్ష ఫలితాల వెల్లడికి ఒక్కోసారి వారం వరకు సమయం పడుతోంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు, లేబొరేటరీలకు కేంద్రం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు అనుమతినిచ్చింది. దీనిద్వారా కరోనా నిర్ధారణ అరగంటలోపే జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కిందిస్థాయి వరకు వందలాది కేంద్రాల్లో ప్రభుత్వమే యాంటిజెన్ టెస్టులు చేస్తోంది. పైగా ఈ టెస్టు చేయడం చాలా తేలిక. గొంతు లేదా ముక్కులోంచి స్వాబ్ నమూనాలు తీసి, సంబంధిత ద్రావణంలో ముంచి కిట్టుపై పెడితే నిమిషాల్లో పాజిటివా? నెగెటివా? అనేది తెలుస్తుంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లేకపోవడంతో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లకు కొన్ని కంపెనీలు డీలర్ల ద్వారా అక్రమంగా కిట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నాయి. జిల్లాల్లోని చాలా ప్రైవేట్ క్లినిక్‌లు, లేబొరేటరీలకు కూడా వీటిని సరఫరా చేస్తున్నారు. ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేసే కొన్ని ల్యాబ్‌లు, ఆసుపత్రులు గుట్టుగా యాంటిజెన్ టెస్టులు చేస్తూ భారీగా వసూలు చేస్తున్నాయి. ఆచితూచి యాంటిజెన్ టెస్ట్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో శాంపిళ్ల సేకరణ కీలకం. గొంతు/ముక్కులోంచి స్వాబ్ నమూనా సరిగా తీయకుంటే ఫలితం తారుమారవుతుంది. శిక్షణ కలిగిన టెక్నీషియన్లు మాత్రమే స్వాబ్ నమూనాలు తీయాలి. తీసిన శాంపిళ్లను గంటలోపే పరీక్షించాలి. లేదంటే ఆ శాంపిల్ పనికిరాదు. కొందరైతే ఇళ్లలో తామే స్వాబ్ తీసుకొని పరీక్షించుకుంటున్నారు. ఇదింకా ప్రమాదకరం. దీనివల్ల ఫలితం తారుమారయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఇక యాంటిజెన్ టెస్ట్‌కు ఉన్న ప్రధాన లోపం నెగెటివ్ వస్తే దాని కచ్చితత్వం 50 నుంచి 70 శాతమే. పాజిటివ్‌కు మాత్రమే కచ్చితత్వం ఉంది. నెగెటివ్ వచ్చి లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయాలన్నది ఐసీఎంఆర్ కీలక నిబంధన. కానీ నెగెటివ్ వచ్చిన చాలామంది లక్షణాలున్నా కూడా తమకు వైరస్ సోకలేదంటూ జనంలో తిరిగేస్తున్నారు. దీంతో వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. వరంగల్‌కు చెందిన జయరాం.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్కరకొస్తుందని భావించి తనకు తెలిసిన ఓ ప్రైవేట్ ల్యాబ్ యజమాని వద్ద నాలుగు యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొన్నాడు. వాటి వాస్తవ ధర ఒక్కోటి రూ. 500 కాగా రూ. 800 చొప్పున వెచ్చించాడు. హైదరాబాద్‌లో క్లినిక్ నడిపే డాక్టర్ రఘురామయ్య (పేరు మార్చాం).. కరోనా లక్షణాలతో క్లినిక్‌కు వస్తున్న వారికి తన టెక్నీషియన్ ద్వారా స్వాబ్ శాంపిల్ తీసి పరీక్షలు చేయిస్తున్నాడు. బ్లాక్‌లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను కొని ఒక్కో పరీక్షకు రూ.1,500 తీసుకుంటున్నాడు. పావుగంటకే ఫలితం వస్తుండటంతో జనం ఎగబడుతున్నారు. -
తెలంగాణలో మొదలైన ర్యాపిడ్ కరోనా టెస్టులు
-
లక్ష కిట్లు వచ్చాయ్
-
కరోనా కట్టడి
-
స్కోడా కొత్త రాపిడ్-8.34 లక్షలు
ముంబై: ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌కు చెందిన ‘స్కోడా ఆటో’ తాజాగా తన ప్రముఖ సెడాన్ ‘రాపిడ్’లో కొత్త వెర్షన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.8.34-రూ.12.78 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ కొత్త వెర్షన్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్సమిషన్ రకాల్లో 1.6 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది రాపిడ్ వాహన విక్రయాల్లో 30-40 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు స్కోడా ఇండియా చైర్మన్ సుధీర్ రావు తెలిపారు. రాపిడ్ అమ్మకాలు గతేడాది 11,000 యూనిట్లు కాగా... ఈ ఏడాది 15,000 యూనిట్లుగా, వచ్చే ఏడాది 20,000 యూనిట్లుగా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారాయన. వచ్చే ఏడాది కొత్తగా ఐదు ఔట్లెట్లను ఏర్పాటు చేస్తామని, దీంతో మొత్తం ఔట్లెట్ల సంఖ్య 70కి చేరుతుందని చెప్పారు.