ఈ టైర్ ఎప్పుడూ పంక్చర్ కాదు! | this tyre never puncture | Sakshi
Sakshi News home page

ఈ టైర్ ఎప్పుడూ పంక్చర్ కాదు!

Published Wed, Oct 29 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

ఈ టైర్ ఎప్పుడూ పంక్చర్ కాదు!

ఈ టైర్ ఎప్పుడూ పంక్చర్ కాదు!

మేకులపై నడిచినా.. గాజుముక్కలు దిగినా ఈ సైకిల్ టైరు ఎప్పుడూ పంక్చర్ కాదు! దీనిలో గాలి కూడా ఉండదు. రబ్బరుకు బదులుగా అతితేలికగా, దృఢంగా ఉండే నానోఫోమ్ అనే పాలిమర్‌తో లండన్‌కు చెందిన టానస్ కంపెనీ దీనిని తయారు చేసింది. బరువు అంతే. సుమారు 430 గ్రాములు ఉంటుంది. మేకులు, ఇతర వస్తువులు గుచ్చుకున్నప్పుడు ఒత్తిడిని తట్టుకోవడం వల్ల పంక్చర్ కాకుండా ఇది ఎప్పుడూ స్థిరంగా ఉంటుందట. ైటె రుకు గుచ్చుకున్న మేకులను అప్పుడప్పుడూ పీకిపారేస్తే సరి.. సుమారు 10 వేల కి.మీ. ప్రయాణం వరకూ చెక్కుచెదరదట. ఒక జత టైర్లకు రూ.8,800. వీటిని పెద్ద ఎత్తున తయారుచేసి మార్కెట్లోకి తెచ్చేందుకు టానస్ సన్నాహాలు చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement