ఈ టైర్ ఎప్పుడూ పంక్చర్ కాదు!
మేకులపై నడిచినా.. గాజుముక్కలు దిగినా ఈ సైకిల్ టైరు ఎప్పుడూ పంక్చర్ కాదు! దీనిలో గాలి కూడా ఉండదు. రబ్బరుకు బదులుగా అతితేలికగా, దృఢంగా ఉండే నానోఫోమ్ అనే పాలిమర్‌తో లండన్‌కు చెందిన టానస్ కంపెనీ దీనిని తయారు చేసింది. బరువు అంతే. సుమారు 430 గ్రాములు ఉంటుంది. మేకులు, ఇతర వస్తువులు గుచ్చుకున్నప్పుడు ఒత్తిడిని తట్టుకోవడం వల్ల పంక్చర్ కాకుండా ఇది ఎప్పుడూ స్థిరంగా ఉంటుందట. ైటె రుకు గుచ్చుకున్న మేకులను అప్పుడప్పుడూ పీకిపారేస్తే సరి.. సుమారు 10 వేల కి.మీ. ప్రయాణం వరకూ చెక్కుచెదరదట. ఒక జత టైర్లకు రూ.8,800. వీటిని పెద్ద ఎత్తున తయారుచేసి మార్కెట్లోకి తెచ్చేందుకు టానస్ సన్నాహాలు చేస్తోంది.