![ఎయిర్ ఇండియాకు తప్పిన ముప్పు](/styles/webp/s3/article_images/2017/09/3/51434363744_625x300.jpg.webp?itok=G87kVJyw)
ఎయిర్ ఇండియాకు తప్పిన ముప్పు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. శ్రీనగర్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వే పై విమానం టైరు ఒక్కసారిగా పేలడంతో భయాందోళన నెలకొంది. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు.
విమానంలోని ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. రన్ వే ను క్లియర్ చేయడానికి కనీసం గంట సమయం పడుతుందని, దీని మూలంగా మిగిలిన విమానాలకు ఆలస్యమయ్యే అవకాశం వుందని పేర్కొన్నాయి. అందుకే కొన్ని విమానాలను చండీగడ్ విమానాశ్రాయానికి మళ్లిస్తున్నామని తెలిపారు. ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో సిబ్బంది సరఫరా చేసిన ఫుడ్ ప్లేట్లో బల్లి దర్శనమివ్వడంతో కలకలం రేగింది. ఈ వివాదం సద్దుమణగకముందే ఈ సంఘటనతో ప్రయాణీకులు భయభ్రాంతులకు లోనయ్యారు.