విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
భోపాల్: భోపాల్లో ఎయిర్ ఇండియా విమానానం భారీ ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. బుధవారం ల్యాండింగ్ సమయంలో విమానం టైరు పేలింది. అయితే పైలెట్ సమయ స్పూర్తితో వ్యవహరించి పెను ప్రమాదం నుంచి తప్పించాడు. దీంతో విమానంలో ఉన్న 95 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.