
మగాడే పనోడు.....
పురుషాధిక్య సమాజమంటూ విసిగిపోయారా? ఎప్పుడూ మనమే పని చేయాలా... కాఫీలు టిఫీనీలు మనమే చేసిపెట్టాల అంటూ మండిపడుతున్నారా?
పురుషాధిక్య సమాజమంటూ విసిగిపోయారా? ఎప్పుడూ మనమే పని చేయాలా... కాఫీలు టిఫీనీలు మనమే చేసిపెట్టాల అంటూ మండిపడుతున్నారా? ఇది మీలాంటోళ్ల కోసమే... అయితే మన దగ్గర కాదు గానీ... అమెరికాలో 'మ్యాన్ సర్వెంట్స్' పేరిట కొత్త సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ మీకు అన్ని పనులు చేసి పెట్టేది పురుషులే. వీరు మిమ్మల్ని యువరాణిలా చూసుకుంటారు.
మీకు డ్రింక్స్ కలిపి పెట్టడం దగ్గర్నుంచి అన్ని పనులు యస్ మేడం అంటూ చేసుకుపోతారు. ఫోటో చూశారుగా..అంతేకాదు... మీవద్ద పనిచేసే పురుష పనివాళ్ల పేరును మీరే డిసైట్ చేయొచ్చు..అతనేం డ్రస్ వేసుకోవాలన్నది కూడా చెప్పొచ్చు. పైగా వీరు పక్కా జంటిల్మెన్ లెక్కన వ్యవహరిస్తారని అశ్లీలతకు ఇందులో తావులేదని మ్యాన్ సర్వెంట్స్ కంపెనీ వ్యవస్థాపకులు జోసఫైన్ వాయ్లిన్, దలా కజక్ చెబుతున్నారు.
అయితే వీరు సేవల ఖరీదు కాస్త ఎక్కువ. గంటకు రూ.4.900 చెల్లించాల్సి ఉంటుంది. రోజంతా అంటే రూ.18వేలు కట్టాలి. ముఖ్యంగా విదేశాల్లో తరచూ జరిగే పార్టీలో మ్యాన్ సర్వెంట్స్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుందని జోనఫైన్ చెబుతున్నారు. వచ్చే నెలలో శాన్ఫ్రాన్సిస్కోలో ఈ సర్వీసు ప్రారంభమవుతుంది.