
శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే ఏం కావాలి? కణాలన్నింటికీ శక్తి కోసం ఆక్సిజన్ కావాలి. పోషకాలు అందాలి. పేరుకుపోతున్న వ్యర్థాలు సక్రమంగా బయటకు వెళ్లిపోతుండాలి. ఈ మూడింటిలో ఏది సక్రమంగా జరక్కపోయినా శరీరంలోని కణాలు నిస్తేజమవుతాయి. ఇది కాస్తా వాపు/మంటలకు దారితీస్తుంది. ఆ తర్వాత జబ్బులు చుట్టుముడతాయి! ఇదీ వైద్య శాస్త్రం మనకు చెప్పే విషయం. పోషకాల సంగతి కాసేపు పక్కన పెడదాం. సాధారణ పరిస్థితుల్లో కణాలకు లభించే ఆక్సిజన్ కంటే 30 శాతం ఎక్కువ లభిస్తే ఏమవుతుంది? అవన్నీ చురుగ్గా ఉంటాయి. అవయవాలూ సక్రమంగా పనిచేస్తాయి.. బీమర్ అచ్చు ఇలాగే చేస్తుందంటున్నారు బీమర్ కంపెనీ సీఈవో చిత్వన్ మాలిక్. విద్యుదయస్కాంత క్షేత్రాలను సృష్టించడం ద్వారా శరీరంలోని సూక్ష్మస్థాయి రక్తనాళాల్లోనూ రక్తప్రసరణ సాఫీగా జరిగేందుకు బీమర్ ఉపయోగపడుతుందని.. ఫలితంగా కణాలు పోషకాలను సమర్థంగా వాడుకోవడంతో పాటు వ్యర్థాలను కూడా ఎప్పటిక ప్పుడు విసర్జించగలవని ఆమె శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. బీమర్‌లోని పరికరాలు 3.5 మైక్రో టెస్లా తీవ్రతతో విద్యుదయస్కాంత తరంగాలను వెలువరి స్తుంటాయని వివరించారు.
అన్ని రకాల సమస్యలకు చెక్!
జుట్టు రాలడం వంటి చిన్న సమస్య మొదలుకొని.. కేన్సర్ వంటి వ్యాధుల వరకు దాదాపు అన్నింటి విషయంలో బీమర్ సానుకూల ఫలితాలు చూపుతోందని.. ఇందుకు సంబంధించి ఇప్పటికే పదుల సంఖ్యలో పరిశోధన వ్యాసాలు ప్రచురితమయ్యాయని చిత్వన్ వివరించారు. 11 ఏళ్ల కింద తనకు బీమర్ గురించి తెలిసిందని.. ఆ తర్వాత ఈ అద్భుతమైన పరికరాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో బీమర్ పేరుతోనే ఓ కంపెనీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీమర్‌ను ప్రస్తుతం అత్యున్నత స్థాయి రాజకీయ నేతలు, ఆధ్యాత్మిక గురు వులు, క్రీడాకారులు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) బీమర్ యంత్రాన్ని రెండేళ్లపాటు అధ్యయనం చేసిందని, వ్యోమగాములు ధరించే స్పేస్ సూట్‌లో వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోందని వివరించారు.
ఏముంటాయి దీంట్లో?
విద్యుదయస్కాంత క్షేత్రాలను సృష్టించగల 6 పరికరాలు బీమర్ పరుపులో ఉంటాయి. వేర్వేరు సెట్టింగ్‌లతో కూడిన ఒక పరికరం.. శరీరంలోని వేర్వేరు భాగాలకు బిగించుకోగల పట్టీ, చర్మ సంబంధి త సమస్యల కోసం ఎల్‌ఈడీ బల్బులతో కూడిన యంత్రం ఒకటి. విద్యుదయస్కాంత తరంగాల పరిశీలనకు స్కానర్ ఉంటాయి. కంప్యూటర్‌లాంటి పరికరాన్ని పరుపునకు అనుసంధానించుకుని 1–10 వరకు ఉండే సెట్టింగ్‌ల్లో ఒకదాన్ని ఎంచుకుని కాసేపు పడుకోవాలి. వ్యాధిని బట్టి కొన్ని వారాల పాటు చేస్తే మెరుగుదల కనిపిస్తుందని చిత్వన్ చెప్పారు. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న పిల్లలకు బీమర్‌తో ప్రయోజనం చేకూరినట్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే స్పష్టమైందని, హైదరాబాద్‌లోని కొన్ని కేంద్రాలు కూడా దీన్ని విజయవం తంగా వాడుతున్నాయని చెప్పారు. మూడు, నాలుగో దశ కేన్సర్లతో బాధపడుతున్న వారికి బీమర్ ద్వారా చికిత్స కల్పించినట్లు అమెరికా, థాయ్‌లాండ్‌లలో పనిచేస్తున్న వైద్యుడు థామస్ లోడీ తెలిపారు. దేశంలోని పిల్ల లందరి బుద్ధి కుశలతను పెంచేందు కు బీమర్‌ను అందుబాటులోకి తేవాలని హైదరాబాద్‌లోని అపోలో లైఫ్ సెంటర్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ హెచ్.ఎస్.ఆర్.అరోరా సూచించారు. బీమర్ టెక్నాలజీ వైద్యరంగాన్ని కొత్తపుంతలు తొక్కించే సామర్థ్యముందని ముంబైలోని భక్తివేదాంత ఆసుపత్రి వైద్యుడు ధవళ్ దలాల్ అన్నారు.
– సాక్షి హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment