
* సాధారణ గోడ * యూరిన్ ప్రూఫ్ పెయింట్ వేసిన గోడ
ఇచ్చట మూత్రం పోయరాదు.. అని రాసినా, చెప్పులు వేలాడదీసినా.. గోడలు తడిపేసి పోవడం మన దగ్గర నిత్యం కనిపించే దృశ్యం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోనూ ఇదే సమస్య మితిమీరిపోవడంతో అధికారులు ఓ కొత్త ఉపాయం ఆలోచించారు. నగరంలో రోడ్ల పక్కన గోడలపై ప్రత్యేక పెయింట్‌ను వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పది గోడలపై ఈ రంగును వేయడం పూర్తి చేశారు కూడా. రాతలకు, చెప్పులకే జంకనివారు రంగుకు మాత్రం ముచ్చటపడి ఎందుకు ఊరుకుంటారని అనుకుంటున్నారా? ఆ పెయింట్ వేసిన గోడలపై మూత్రం పోస్తే రంగు పడుద్ది మరి!
మామూలు గోడపై కిందకు జారిపోయే మూత్రం.. ఈ గోడపై పోస్తే తిరిగి పోసినవారి మీదే పడుతుంది! అల్ట్రా వయొలెట్ కోటెడ్ సూపర్ హైడ్రోఫోబిక్ పెయింట్ వేయడమే అందుకు కారణం. శాన్ ఫ్రాన్సిస్కోలో బహిరంగ మూత్రవిసర్జనకు 50-100 డాలర్ల వరకూ జరిమానా విధిస్తారు. అయినా పరిస్థితి మారకపోవడం.. తమ గోడపై మూత్రం శుభ్రం చేయాలంటూ వందలాది విజ్ఞప్తులు రావడంతో అధికారులు ఈ కొత్త ఐడియా అమలులో పెట్టారు.