గూగుల్ హ్యాంగౌట్స్ యాప్
శాన్‌ఫ్రాన్సిస్కో: గూగుల్ హ్యాంగౌట్స్ మెసేజింగ్ యాప్‌కు 2020కల్లా సేవలు నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించుకున్నట్లు నైన్‌టుఫైవ్ గూగుల్ అనే వెబ్‌సైట్ వెల్లడించింది. జిచాట్‌కు ప్రత్యామ్నయంగా 2013లో గూగుల్ సంస్థ హ్యాంగౌట్స్‌ను తీసుకొచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో నెటిజన్లు దీనిని ఆదరించలేదు. దానికి తోడు హ్యాంగౌట్స్‌లో బగ్స్ ఎక్కువగా ఉండేవి.
గత కొద్ది కాలంగా గూగుల్ కూడా ఈ యాప్‌పై తన దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించలేదు. ఈ యాప్‌కు బదులుగా గూగుల్ మెసేజింగ్ యాప్‌ను అధునాతన ఫీచర్లతో తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. గత ఏప్రిల్‌లోనే ఆర్‌సీఎస్ ఫీచర్లను మెసేజింగ్‌కు జోడిస్తున్నామని తెలుపుతూనే హ్యాంగౌట్స్ సేవలు నిలిపివేస్తామని చెప్పకనే చెప్పింది. హ్యాంగౌట్స్‌కు గూగుల్ తన సేవలను నిలిపివేయడానికి ఇంకా ఒక సంవత్సరం ఉంది కాబట్టి అది వాడే వారు మరొక ప్లాట్‌ఫాంను ఎన్నుకోవడానికి సమయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment