hangout
-
Best Indian Places: భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాలివే..! (ఫోటోలు)
-
నేను హ్యాంగ్ అవుట్ అయ్యేది అక్కడే : అల్లు శిరీష్
అల్లు శిరీష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. రీసెంట్గా ఆయన తొలిసారి బాలీవుడ్లో నటించిన ఓ మ్యూజిక్ ఆల్భమ్ 100 మిలియన్ క్లబ్‌లోకి చేరిన సంగతి తెలిసిందే. 'విలయాటి షరాబి' అంటూ సాగిన ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇక తాజాగా తనకెంతో ఇష్టమైన ప్లేస్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. కాఫీ షాప్స్, బుక్ స్టోర్స్ తర్వాత తాను అంతగా హ్యాంగ్ అవుట్ అయ్యే ప్రదేశం ఇదేనంటూ ఓ ఫోటోను పంచుకున్నారు. ఇది మరక్కడో కాదు..స్వయంగా వాళ్లింటిలోని గార్డెన్ ఏరియా. ఈ ప్లేస్‌లో తాను చిల్ అవుతానంటూ ఫోటోను షేర్ చేసుకున్నాడు. ఇక ఇంట్లో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో తాను కూడా టెస్టులు చేయించుకున్నానని, అయితే రెండుసార్లు తనకు నెగిటివ వచ్చిందని పేర్కొన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే..అల్లు శిరీష్ నటించిన చివరి మూవీ ఏబీసీడీ. ఈ చిత్రం అనంతరం అను ఇమాన్యుయేల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ అను ఇమాన్యుయేల్‌తో శిరీష్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై శిరీష్ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. చదవండి: హీరోయిన్‌తో అల్లు శిరీష్ డేటింగ్ ? ఫోటోలు వైరల్ తమ్ముడికి కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్.. కారణం ఇదే -
గూగుల్ హ్యాంగౌట్స్ యూజర్లకు షాకింగ్ వార్త
శాన్ఫ్రాన్సిస్కో: గూగుల్ హ్యాంగౌట్స్ మెసేజింగ్ యాప్‌కు 2020కల్లా సేవలు నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించుకున్నట్లు నైన్టుఫైవ్ గూగుల్ అనే వెబ్సైట్ వెల్లడించింది. జిచాట్కు ప్రత్యామ్నయంగా 2013లో గూగుల్ సంస్థ హ్యాంగౌట్స్ను తీసుకొచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో నెటిజన్లు దీనిని ఆదరించలేదు. దానికి తోడు హ్యాంగౌట్స్‌లో బగ్స్ ఎక్కువగా ఉండేవి. గత కొద్ది కాలంగా గూగుల్ కూడా ఈ యాప్‌పై తన దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించలేదు. ఈ యాప్‌కు బదులుగా గూగుల్ మెసేజింగ్ యాప్‌ను అధునాతన ఫీచర్లతో తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. గత ఏప్రిల్‌లోనే ఆర్సీఎస్ ఫీచర్లను మెసేజింగ్‌కు జోడిస్తున్నామని తెలుపుతూనే హ్యాంగౌట్స్ సేవలు నిలిపివేస్తామని చెప్పకనే చెప్పింది. హ్యాంగౌట్స్‌కు గూగుల్ తన సేవలను నిలిపివేయడానికి ఇంకా ఒక సంవత్సరం ఉంది కాబట్టి అది వాడే వారు మరొక ప్లాట్‌ఫాంను ఎన్నుకోవడానికి సమయం ఉంది. -
గూగుల్ హ్యాంగౌట్‌లో షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కంటే ఆమ్ఆద్మీ పార్టీ, బీజేపీ ముందంజలో ఉన్నట్టు కొన్ని ఒపీనియన్ పోల్స్ వెల్లడించడంతో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆన్లైన్ ప్రచారబాట పట్టారు. గూగుల్ హ్యాంగౌట్ ఇన్స్టంట్ మెసేజింగ్, వీడియోచాట్ సదుపాయంతో ఆమె ఢిల్లీవాసులతో సంభాషించనున్నారు. ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల ముందు.. అంటే ఈ నెల 30న ఆమె ఆన్లైన్ ప్రచారం నిర్వహిస్తారు. గూగుల్ సంస్థ కన్నాట్‌ప్లేస్ కార్యాలయంలో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి గంటసేపటి వరకు ఆమె వీడియోచాట్లో అందుబాటులో ఉంటారు. ఢిల్లీ ఎన్నికల కోసం పనిచేసే కొందరు ఐటీ నిపుణులు ఈ వీడియోచాట్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఇది వరకే పలుసార్లు వెబ్మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడడం తెలిసిందే. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వీడియోచాట్ ద్వారా సంభాషించే సదుపాయాన్ని గూగుల్ హ్యాంగౌట్ పేరుతో ఆ సంస్థ ఈ ఏడాది మే 15 నుంచి అందుబాటులోకి తెచ్చింది.www.sheiladikshit. net/hangout.php లింకు ద్వారా ఆమెతో ప్రత్యక్షంగా మాట్లాడుతూనే ప్రశ్నలూ అడగవచ్చు. ఆమె అధికారిక వెబ్సైట్లో ప్రజలు వేసే ప్రశ్నలకు కూడా షీలా దీక్షిత్ బదులిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రశ్నలను తీరును పరిశీలించాలక వాటిని అడగాల్సిన వ్యక్తులను ఎంపిక చేస్తున్నట్టు చెప్పాయి. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై యువతకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికే ఈ ప్రయత్నమని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. తన హయాంలో మొదలైన అభివృద్ధి ప్రాజెక్టులను షీలా దీక్షిత్ ఎక్కువగా ప్రస్తావి స్తున్నారు. అంతేకాదు ట్విటర్లోనూ ఆమె పేరుపై ఒక పేజీ ఉంది. దీనికి 227 మంది ఫాలోవర్లు ఉన్నా ఇప్పటికీ ఒక్క ట్వీట్ కూడా పోస్టు కాలేదు.