Allu Sirish Shares Favorite Hangout Spot Pic Goes Viral | నేను హ్యాంగ్‌ అవుట్‌ అయ్యేది అక్కడే : అల్లు శిరీష్ - Sakshi
Sakshi News home page

నేను హ్యాంగ్‌ అవుట్‌ అయ్యేది అక్కడే : అల్లు శిరీష్

Published Sat, May 1 2021 10:36 AM | Last Updated on Sat, May 1 2021 12:33 PM

Allu Sirish Shares A Pic Where He Got Hang Out - Sakshi

అల్లు శిరీష్ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. రీసెంట్‌గా ఆయన తొలిసారి బాలీవుడ్‌లో నటించిన ఓ మ్యూజిక్‌ ఆల్భమ్‌ 100 మిలియన్‌ క్లబ్‌లోకి చేరిన సంగతి తెలిసిందే. 'విలయాటి షరాబి' అంటూ సాగిన ఈ పాట యూట్యూబ్‌ను షేక్‌ చేసింది. ఇక తాజాగా తనకెంతో ఇష్టమైన ప్లేస్‌ను అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు. కాఫీ షాప్స్‌, బుక్‌ స్టోర్స్‌ తర్వాత తాను అంతగా హ్యాంగ్‌ అవుట్‌ అయ్యే  ప్రదేశం ఇదేనంటూ ఓ ఫోటోను పంచుకున్నారు.


ఇది మరక్కడో కాదు..స్వయంగా వాళ్లింటిలోని గార్డెన్‌ ఏరియా. ఈ ప్లేస్‌లో తాను చిల్‌ అవుతానంటూ ఫోటోను షేర్‌ చేసుకున్నాడు. ఇక ఇంట్లో కొందరికి కరోనా పాజిటివ్‌ రావడంతో తాను కూడా టెస్టులు చేయించుకున్నానని, అయితే రెండుసార్లు తనకు నెగిటివ​ వచ్చిందని పేర్కొన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే..అల్లు శిరీష్‌ నటించిన చివరి మూవీ ఏబీసీడీ. ఈ చిత్రం అనంతరం అను ఇమాన్యుయేల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్‌ అను ఇమాన్యుయేల్‌తో శిరీష్‌ డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై శిరీష్‌ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. 

చదవండి: హీరోయిన్‌తో అల్లు శిరీష్ డేటింగ్‌ ? ఫోటోలు వైరల్‌
తమ్ముడికి కంగ్రాట్స్‌ చెప్పిన అల్లు అర్జున్‌.. కారణం ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement