ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ తీపికబురు కబురు అందించింది. తమ వినియోగదారుల కోసం కొత్తగా మరికొన్ని ఫీచర్లను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. సర్చ్ ఇంజిన్ దిగ్గజం వ్యక్తిగత మెసేజింగ్ యాప్ లో అనేక ఫీచర్లను జోడించింది. కొన్ని ఫీచర్లు వచ్చేసి ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్, ఎమోజీలకు సులభంగా అనుమతి, వాయిస్ యాక్సెస్ వంటివి ఉన్నాయి. "మీ ఖాతా పాస్ వర్డ్ ను సురక్షితంగా ఉంచడం నుంచి టెక్స్ట్ సందేశాలను షెడ్యూల్ చేసే వరకు, మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3 బిలియన్ యాక్టివ్ ఆండ్రాయిడ్ పరికరాలకు కొత్త అప్డేట్ లు ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నట్లు" గూగుల్ తెలిపింది.
సందేశాలకు ఇప్పుడు ఎండ్ టూ ఎండ్ ఎన్ ఎండ్ క్రిప్షన్ లభించినట్లు గూగుల్ ప్రకటించింది. గూగుల్ గత ఏడాది నవంబర్ లో ఈ ఫీచర్ బీటా మోడ్ ను కొంత మంది యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఫీచర్ అందరికీ రోల్ అవుట్ చేస్తుంది. వీడియో కాలింగ్ చేసుకునే సమయంలో కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ లభిస్తుందని తెలిపింది. అలాగే, మరిన్ని దేశాల్లో భూకంప హెచ్చరిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గూగుల్ తెలిపింది. గ్రీస్, న్యూజిలాండ్ లో పరీక్షించిన ఈ ఫీచర్ ఇప్పుడు టర్కీ, ఫిలిప్పీన్స్, కజకస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లలో అందుబాటులో ఉంది. అధిక భూకంప ప్రమాదాలు సంభవించే దేశాల్లో భూకంప హెచ్చరికలను తెలియజేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు, రాబోయే సంవత్సరాల్లో ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు గూగుల్ తెలిపింది.
చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త!
Comments
Please login to add a commentAdd a comment