49మందిపై వేటు..యూనివర్శిటీ నిర్ణయం | San Francisco university lays off IT workers, jobs head to India | Sakshi
Sakshi News home page

49మందిపై వేటు..యూనివర్శిటీ నిర్ణయం

Published Wed, Mar 1 2017 12:41 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM

49మందిపై వేటు..యూనివర్శిటీ నిర్ణయం

49మందిపై వేటు..యూనివర్శిటీ నిర్ణయం

శాన్‌ ఫ్రాన్సిస్కో: ట్రంప్‌ సంస్కరణల నేపథ్యంలో  శాన్‌ ఫ్రాన్సిస్కో యూనివర్శిటీ  తీసుకున్న నిర్ణయం దుమారం రేపింది.  యూనివర్శిటీ  ఆఫ్‌ కాలిఫోర్నియా  కొంతమంది  ఔట్‌సోర్సింగ్‌ ఐటీ ఉద్యోగులను తొలగించింది.  ఔట్‌ సోర్సింగ్‌ ఐటీ  సేవలందిస్తున్న 49మంది ఉద్యోగులను తొలగించింది. మరోవైపు ఈ పనిని ఇండియా ఆధారిత ఔట్‌సోర్సింగ్‌ కంపెనీకి అప్పగించడం విమర్శలకు దారి తీసింది.

పెరుగుతున్న టెక్నాలజీ ఖర్చుల కారణంగా ఈ తొలగింపు అనివార్యమైందని విశ్వ విద్యాలయం ప్రతినిది ఒకరు తెలిపారు. 49 మంది సిబ్బంది తొలగింపుతోపాటు, ఖాళీగా  ఉన్న లేదా కాంట్రాక్టర్లద్వారా నియమితులైన  మరో 48 మందినికూడా తొలగిస్తున్నట్టు చెప్పారు.   

 యూనివర్శిటీ నిర్ణయంతో సాఫీగా, సెక్యూర్డ్‌గా సాగిపోతున్న కంప్యూటర్‌  నెట్‌ వర్క్‌లకు అంతరాయం కలుగుతుందని తొలగించిన యూనివర్శిటీ  సిస్టం అడ్మినిస్ట్రేటర్‌ కుర్ట్‌ హో(58)  వ్యాఖ్యానించారు. బే ఏరియాలో పాతికేళ్లుగా తాను ఐటీ సేవల్లో ఉన్నట్టు తెలిపారు.  ఐటి సేవల్లో పెరుగుతున్న అవుట్సోర్సింగ్  ధోరణి  ఆందోళన కలిగిస్తుందన్నారు.

అమెరికా  ప్రస్తుత రాజకీయ వాతావరణంలో గ్లోబలైజేషన్ అండ్ ఔట్సోర్సింగ్ హాట్‌ టాపిక్‌ మారాయి.  దీంతో యజమానులు  ఖర్చులు తగ్గించుకునేందుకు, ప్రపంచంలోని దూర ప్రాంతాల్లో ఉండే తక్కువ వేతనానికి పనిచేసే ఉద్యోగులకోసం ప్రయత్నిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. మరోవైపు ఆరోగ్య సంరక్షణ, పరిశోధన పై దృష్టిపై పనిచేస్తున్న కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం  ఖర్చులు తగ్గించుకోవడానికి, ఆదాయా వనరులను పెంచుకోవడానికి  అష్టకష‍్టాలుపడుతోంది.  ఈ నేపథ్యంలో గత ఏడాది  జులైలో భారతదేశం ఆధారిత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ తో ఐదేళ్లకు గాను  50 మిలియన్ డాలర్ల  ఒప్పందం కుదుర్చుకుంది.  అలాగే రాబోయే ఐదేళ్లలో 30మిలియన్‌ డాలర్లను పొదుపు చేసే ఆలోచనలోఉన్నట్టు ప్రకటించింది. అలాగే దేశీయ ఉద్యోగాలు ఔట్‌ సోర్సింగ్‌ కు పోకుండా బాధ‍్యత తీసుకున్నట్టు  యూనివర్శిటీ సెనేటర్  డయానే గత ఏడాది  ప్రకటించారు. ఈ  మేరకు సంస్కరణలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement