Elon Musk Replaced Twitter Blue Bird Logo To X, Know Why Police Arrested Twitter Staff, Video Viral - Sakshi
Sakshi News home page

Twitter Blue Bird Replaces With X: ఉద్యోగులు అరెస్ట్‌, వీడియో వైరల్‌ 

Jul 25 2023 12:29 PM | Updated on Jul 25 2023 1:09 PM

Twitter new logo  staff detained by the police why check details - Sakshi

Twitter "X": టాప్‌ బిలియనీర్‌, ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపింది. ఉన్నట్టుండి  ట్విటర్‌ లోగోను పిట్టను కాస్తా  "X"  పేరతో  రీబ్రాండ్‌ చేయడం అందర్నీ  ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.

ట్విటర్‌ లోగో మారిన నేపథ్యంలో తమ భవనం నుంచి పాత లోగోను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న ట్విటర్‌ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో 1355 మార్కెట్ స్ట్రీట్‌, కార్యాలయంలోని  కొంతమంది ఉద్యోగులు క్రేన్‌ సాయంతో  ట్విటర్ కొత్త లోగో రీప్లేస్‌ చేస్తున్నారు.  దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న  శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు జోక్యం చేసుకుని, లోగో మారిన విషయాన్ని గమనించక, ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. (బెదిరింపులు: అంబానీ కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు, ప్రత్యేకత తెలిస్తే..!

ఈ సందర్బంగా కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలగింపు ప్రక్రియలో ఉపయోగించిన క్రేన్‌కు మస్క్ అనుమతిని పొందలేదని, ఇది పోలీసుల ప్రతిస్పందనను ప్రేరేపించిందని  ట్వీట్ చేశారు. కానీ అసలు విషయం తెలిసిన పోలీసులు నాలిక్కరుచుకున్నారు.  పరిస్థితిని పరిశీలించిన తరువాత, వారు ఎటువంటి నేరం చేయలేదని , సంఘటన తమ పరిధిలో లేదని ప్రకటించారు. (ఐఆర్‌సీటీసీ డౌన్‌, యూజర్లు గగ్గోలు!)

కాగా ఐకానిక్ లోగోను కాదని,  మస్క్ తన వ్యక్తిగత ప్రాధాన్యతకు అనుకూలంగా బ్రాండ్ పేరును  మార్చిన సంగతి తెలిసిందే.  దీంతో  మస్క్  సంపద 4- 20 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయిందని విశ్లేషకులు, బ్రాండ్ ఏజెన్సీల  అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement