Elon Musk: అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఇటీవల ట్విటర్‌ను 'ఎక్స్'గా మార్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కంపెనీ ప్రధాన కార్యాలయంపై కొత్త లోగో ఏర్పాటు చేశారు. అయితే దీనిని శాన్‌ఫ్రాన్సిస్కో అధికారులు తొలగించి సీఈఓకి పెద్ద షాక్ ఇచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, శాన్‌ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం మీద ఏర్పాటు చేసిన ఎక్స్ (X) లోగో నుంచి వచ్చే లైట్ల కాంతి రాత్రి సమయంలో తమ ఇళ్లలో పడుతుందని, ఇది వారి నిద్రకు భంగం కలిగిస్తుందని 24 మంది స్థానికులు అక్కడి అధికారులకు పిర్యాదు చేశారని, ఈ కారణంగా లోగో తొలగించినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి!
అనుమతి లేకుండా లోగో ఏర్పాటు చేయడమే కాకుండా, దాని వల్ల ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతోందని అక్కడి అధికారులు చెబుతున్నారు. సంస్థ ముందుగా లోగో మార్చాలనుకుంటే డిజైన్, భద్రత వంటి వాటి కోసం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కంపెనీ లోగో రుపాటు చేసిందని ఆరోపణ. దీనితో పాటు స్థానికులు పిర్యాదు కూడా తోడవడంతో లోగో తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment